|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి జులై 12 ఎపిసోడ్: అప్పును కాపాడేందుకు రుద్రాణి ఐడియా- అత్తారింటికి దారేది సీన్- తల్లీకొడుకులను కొట్టిన రాజ్!

Published: 11-07-2025, 11:16 PM
బ్రహ్మముడి జులై 12 ఎపిసోడ్: అప్పును కాపాడేందుకు రుద్రాణి ఐడియా- అత్తారింటికి దారేది సీన్- తల్లీకొడుకులను కొట్టిన రాజ్!

బ్రహ్మముడి సీరియల్‌లోని ఈరోజు ఎపిసోడ్‌లో అప్పుపై ఉన్న కేసు, ఆమెను కాపాడేందుకు రుద్రాణి ప్రణాళిక, మరియు రాజ్ చేసిన ఆవేశపూరిత చర్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అత్తారింటిలోని సన్నివేశాలు కూడా ఎమోషనల్‌గా ఉంటాయి.

Key Points

1

రుద్రాణి అప్పును కాపాడేందుకు ఒక ప్రణాళికను రూపొందిస్తుంది.

2

అప్పు అత్తగారితో కలిసి కొంత సమయం గడుపుతుంది.

4

కావ్య, రాజ్ అప్పు కేసును పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.

అప్పు కేసులో కొత్త ట్విస్ట్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య, అప్పు గురించి ఆలోచించిన రాజ్ కళావతి కి కాల్ చేస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. బెయిల్ మీద తీసుకొచ్చాను. కానీ, కేసులో నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని కేసు గురించి చెప్పి కావాలనే ఇరికించారు అని చెబుతుంది కావ్య. రెండ్రోజుల్లో అప్పును కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఈలోపు తప్పు చేసినవాళ్లను పట్టుకుని నిజం నిరూపించాలి. లేకుంటే అప్పు జాబ్ పోవడమే కాదు అరెస్ట్ కూడా అవుతుందని కావ్య చెబుతుంది.

ఇద్దరం కలిసి వాళ్లు ఎవరో పట్టుకుందాం. అప్పును కేసులో ఇరికించింది ఎవరైనా సరే వదిలేది లేదని రాజ్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అపర్ణ, ఇందిరాదేవి ఏమైందని అడిగితే.. రాజ్ హెల్ప్ చేస్తానంటున్నారని, నేనే వద్దంటున్నాని కావ్య చెబుతుంది. ఎందుకని వాళ్లంటే అప్పుని కేసులో ఇరికించింది యామినినే, సిద్ధార్థ్‌ను రెచ్చగొట్టింది యామినినే, ఆయన వస్తే ఆయనకు నిజాలు తెలుస్తాయని భయపడుతున్నానని కావ్య అంటుంది.

దాని పాపాలు పండే టైమ్ వచ్చింది. అందుకే ఇలాంటివన్నీ చేస్తుంది. రాజ్ హెల్ప్ తీసుకో ఏం కాదు. యామిని ఏంటో నా మనవడికి కూడా తెలియని అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు అత్త అన్న మాటలకు అప్పు ఏడుస్తూ ఉంటుంది. కల్యాణ్ రావడంతో హగ్ చేసుకుంటుంది అప్పు. అత్త దగ్గర కల్యాణ్ తనకు సపోర్ట్ చేయడంపై మాట్లాడిన అప్పు పోయిన ప్రాణం తిరిగివచ్చినట్లు అయిందని ఎమోషనల్‌గా చెబుతుంది.

అమ్మకు కేవలం నువ్ నాతో ఇంట్లో ఉండాలని మాత్రమే. కానీ, నువ్వు ఏంటో అమ్మకు బాగా తెలిసిపోయింది. అందుకే నిన్ను తప్పు పట్టలేదు. త్వరలోనే నిన్ను కోడలిగా మా అమ్మ యాక్సెప్ట్ చేస్తుందనిపిస్తుందని కల్యాణ్ అంటాడు. తర్వాత మరుసటి రోజు అప్పు లంచం తీసుకోలేదన్న విషయం శీను వచ్చి చెబితే తప్పా కోర్టు నమ్మదు అని కల్యాణ్ అంటాడు.

అత్తారింటిలో ఎమోషనల్ సన్నివేశాలు

ఇరికించినవాడే ఎలా చెబుతాడు అని స్వప్న అంటుంది. ముందు వాడిని పట్టుకోవాలని కావ్య అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి వాడి వెనుక కచ్చితంగా ఎవరో ఉన్నారు. అలాంటి వాళ్లను కచ్చితంగా శిక్షించాలని అంటాడు. ముందు వాడిని పట్టుకుందాం, వాడి వెనుకాల వాళ్ల గురించి తర్వాత ఆలోచిద్దాం అని కావ్య అంటే.. మీరేంటీ కొత్తగా మాట్లాడుతున్నారు. మీలో ఏదో భయం కనిపిస్తుందని రాజ్ అంటాడు.

అప్పు వాడి అడ్రస్ చెప్పి నేను, కావ్య వెళ్లి కలుస్తాం అని రాజ్ అంటాడు. ఇంతలో రుద్రాణి వచ్చి వాడిని పట్టుకోగానే నిజం చెబుతాడా అని పుల్ల వేస్తుంది. మీ ప్రయత్నం మానుకోండని చెబుతుంది. ఇంకా కోర్టు ముందు అప్పుకు సమస్య అవుతుంది. దానికి బదులు నేరం ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది. ఏదో ఒకరోజు మన ఇంటికి వస్తుందని రుద్రాణి అంటుంది.

దాంతో అంతా షాక్ అవుతారు. అసలు ఈ కేసు గురించి మీకు ఏమైనా తెలుసా. వాడు ఎలా ఏసీబీని రప్పించాడు, అప్పును ఎలా ఇరికించాడు, కొంచెం అయినా తెలుసా అని రుద్రాణి అంటుంది. సూపర్ ఆంటీ, అప్పును కాపాడటానికి భలే ఐడియా ఇచ్చారు అని రాజ్ అంటాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడే తెలుసుకుందాం. సీన్ రీ క్రియేట్ చేద్దాం. ఇదే పోలీస్ స్టేషన్. అప్పుడు అందరికి ఏం జరిగిందో తెలుస్తుందని రాజ్ అంటాడు.

రాజ్ యొక్క ఆగ్రహం

మమ్మీ వీళ్లు ప్లాన్ చేసి మనల్ని ఇరికించట్లేదుగా అని రాహుల్ అంటే వీళ్లకు అంత సీన్ లేదు. వీళ్లు ఆడిన ఆట ఆడి ఆ శీనును కలవకుండా చేస్తే అప్పుకు శిక్ష పడేలా చేయొచ్చు అని రుద్రాణి అంటుంది. ఈ డ్రామాకు అప్పు అమాయకురాలు అనే టైటిల్ పెడతాడు రాజ్. శీను, అతని ఫ్రెండ్‌గా రాహుల్, రుద్రాణి వస్తారు. ఏసీబీ ఆఫీసర్స్‌గా ఇందిరాదేవి, అపర్ణ వస్తారు.

అప్పును అరెస్ట్ చేయమని రుద్రాణి, రాహుల్ అంటే ఇదంతా ప్లాన్ చేసింది ఎవరు అని ఇందిరాదేవి, అపర్ణ అడుగుతారు. దాంతో మేమే అని రాహుల్, రుద్రాణి అనడంతో అంతా వచ్చి వాళ్లిద్దరిని కొడతారు. దాంతో వాళ్లిద్దరు వేరే క్యారెక్టర్స్ చేస్తామని చెబుతారు.

తర్వాత ఏసీబీ ఆఫీసర్స్‌లో రాహుల్, రుద్రాణి చేస్తారు. అయినా వారిని కొడతారు. ఇలా అత్తారింటికి దారేది సినిమాలో అహల్య అమాయకురాలు సీన్‌లా చేస్తారు. తల్లీకొడుకులను ఇంట్లోవాళ్లతోపాటు రాజ్ కొడతాడు. రుద్రాణి, రాహుల్ ఒళ్లంతా హూనం అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

అప్పు కేసు పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు, కుటుంబంలోని సంఘర్షణలు, మరియు రాజ్ చర్యలు ఈ ఎపిసోడ్‌ను ఉత్కంఠగా ముగించాయి. తదుపరి ఎపిసోడ్‌లో ఏమి జరుగుతుందో చూడటానికి ఆసక్తిగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.