
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- ‘ది జర్నీ ఆఫ్ పెద్ది’ వీడియో సినిమా మేకింగ్, ప్రమోషన్స్ విశేషాలను వెల్లడించింది.
- రామ్ చరణ్ రగ్గడ్ లుక్, బుచ్చిబాబు సన ఎమోషన్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
- ‘చికిరి చికిరి’ సాంగ్ మేకింగ్, భోపాల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణ.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా విడుదలైన ‘ది జర్నీ ఆఫ్ పెద్ది’ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో సినిమా మేకింగ్ విశేషాలు, ప్రమోషనల్ ఈవెంట్ హైలైట్స్‌ను గ్రాండ్‌గా చూపించింది.
‘పెద్ది’ ప్రమోషన్స్‌లో కొత్త ట్రెండ్
Peddi Journey : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటడానికి రెడీ అయిపోయాడు.RRR సినిమాతో ఇంటర్ నేషనల్ స్థాయిలో క్రేజ్ కొట్టేసిన చరణ్ తాజాగా ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో నటిస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జానీ కపూర్ (జాన్వీ కపూర్) కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సాలిడ్ చార్ట్ బస్టర్స్ అందించాడని సాంగ్స్ కొల్లగొడుతున్న రికార్డులే చెబుతున్నాయి.ఇక ఈ సినిమా మరో రెండు రోజులు అంటే జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి రెడీ అయిపొయింది.
‘ది జర్ని ఆఫ్ పెద్ది’ స్పెషల్ వీడియో ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన ‘ది జర్ని ఆఫ్ పెద్ది’ స్పెషల్ వీడియో ఇటు నెట్టింటితో పాటు అటు యూట్యూబ్‌ను కూడా షేక్ చేస్తోంది.ఈ స్పెషల్ వీడియోలో సినిమాను అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచి, లొకేషన్లలో జరిగిన షూటింగ్ విశేషాలు, ప్రమోషన్స్ వరకు పెద్ది యొక్క జర్నీ ని గ్రాండ్ గా రివీల్ చేశారు..
రామ్ చరణ్ రగ్గడ్ లుక్ రీఎంట్రీ
గతంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబు పాత్రలో ఆయన చూపించిన రగ్గడ్ లుక్ థియేటర్లలో ఏ రేంజ్ మ్యాజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్లీ అంతకంటే పవర్‌ఫుల్ రగ్గడ్ లుక్‌లో రామ్ చరణ్ ఈ ‘పెద్ది’ సినిమాలో కనిపిస్తుండటం విశేషం. దానికి బుచ్చిబాబు సన మార్క్ ఎమోషన్స్ తోడవడంతో ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆ హైప్‌ను మరింత పెంచేలా ఈ జర్నీ వీడియోను కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు.
మరోసారి ప్రూవ్ అయిన చరణ్ క్రేజ్
‘చికిరి చికిరి’ సాంగ్ మేకింగ్ హైలైట్స్
ముఖ్యంగా ఈ చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన మ్యూజికల్ సెన్సేషన్ ‘చికిరి చికిరి’ సాంగ్ మేకింగ్ విజువల్స్ ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనే చెప్పాలి.ఇక ఈ సాంగ్ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఏ రేంజ్‌లో వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాగే ఇటీవల మే 23న భోపాల్‌లో నిర్వహించిన గ్రాండ్ మ్యూజికల్ మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజువల్స్ ఈ జర్నీ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. ఆ వేడుకలో రామ్ చరణ్, జానీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌లతో కూడిన చిత్ర యూనిట్ చేసిన సందడి అభిమానులను ఎంతగానో అలరించింది. భోపాల్ ఈవెంట్‌కు తరలివచ్చిన ఆడియన్స్ ని చూస్తుంటే రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది . ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త మల్టిపుల్ స్పోర్ట్స్ అవతార్స్‌లో కనిపించబోతుండటం గమనార్హం. ఒకే పాత్రలో క్రికెటర్, రన్నర్, మరియు సాంప్రదాయ పెహల్వాన్ (కుస్తీ యోధుడు) వంటి విభిన్నమైన షేడ్స్ లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు.ఈ పాత్రల కోసమే రామ్ చరణ్ ప్రత్యేకంగా బాడీ మేకోవర్ అయ్యాడు కూడా.
‘ది జర్నీ ఆఫ్ పెద్ది’ వీడియో రామ్ చరణ్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిన ఈ వీడియో, జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ కోసం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది.


