|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జానీ మాస్టర్‌కి అండగా శ్రీశైలం యాదవ్: జోలికొస్తే తాట తీస్తా అంటూ సంచలన హెచ్చరిక!

Published: 19-12-2025, 4:05 AM
జానీ మాస్టర్‌కి అండగా శ్రీశైలం యాదవ్: జోలికొస్తే తాట తీస్తా అంటూ సంచలన హెచ్చరిక!
  • జానీ మాస్టర్ సతీమణి సుమలత తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలలో విజయం సాధించారు.
  • శ్రీశైలం యాదవ్ జానీ మాస్టర్‌కి అండగా ఉంటానని, ఆయన జోలికొచ్చేవారికి తాట తీస్తానంటూ బహిరంగ హెచ్చరిక చేశారు.
  • డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యులకు ఇంటి స్థలాలు, ఇళ్లు కట్టిస్తానని శ్రీశైలం యాదవ్ హామీ ఇచ్చారు.
  • అసోసియేషన్ సమస్యలను కోర్టుల వరకు వెళ్లకుండా అంతర్గతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ జానీ మాస్టర్‌కు అండగా నిలుస్తానని, ఆయన జోలికొచ్చేవారికి తాట తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసోసియేషన్‌కు కూడా పలు హామీలు ఇచ్చారు.

శ్రీశైలం యాదవ్ మాస్ వార్నింగ్: జానీ మాస్టర్‌కు అండగా

Jani Master: జానీ మాస్టర్ పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న జానీ మాస్టర్ (Jani Master) ఇటీవల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కొన్ని ఆరోపణల కారణంగా ఈయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇలా ఈ వివాదాలు అనంతరం జానీ మాస్టర్ వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇకపోతే ఇటీవల జరిగిన తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికలలో జానీ మాస్టర్ సతీమణి సుమలత (Sumalatha) విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇలా ఈమె విజయమందుకున్న నేపథ్యంలో తాజాగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇటీవల తెలంగాణ ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ (Srisailam Yadav) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్‌కు అండగా ఉంటానని తెలిపారు. అదే విధంగా మన అసోసియేషన్‌లో ఏదైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకోవాలి కానీ కేసుల వరకు పోకూడదని అందరికీ సలహాలు ఇచ్చారు. డాన్సర్ అసోసియేషన్‌లో ఉన్న వారికి ఇంటి స్థలాలు ఇప్పిస్తామని, ఇల్లు కూడా కట్టిస్తామంటూ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు హామీలు, సలహాలు

ఇక జానీ మాస్టర్ గురించి మాట్లాడుతూ ఈయన ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. అలాగే జానీ మాస్టర్‌కు ఏ విషయంలోనైనా తాను అండగా ఉంటానని, “నీ జోలికి ఎవరు రారు” అంటూ ఈ సందర్భంగా జానీ మాస్టర్‌పై విషయం చిమ్ముతున్న వారికి శ్రీశైలం యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. ‘అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం.. చిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేద్దాం’ అంటూ శ్రీశైలం యాదవ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇక మన అసోసియేషన్‌లో కొంతమంది నిబంధనలకు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారని అలాంటి వారిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాను అంటూ శ్రీశైలం యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమలత మాట్లాడుతూ తనకి ఓటు వేసి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరికి సమస్యలను పరిష్కరిస్తానని ఈమె హామీ ఇచ్చారు.

సుమలత విజయం, ప్రమాణ స్వీకారం విశేషాలు

ఇక జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార ఆరోపణలను ఎదుర్కోవడంతో ఆయన కెరియర్ పై తీవ్రమైన ప్రభావం చూపిందని అందరూ భావించారు కానీ ఆయన మాత్రం పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా అవమానించబడిన చోటే జానీ మాస్టర్ తనని తాను నిరూపించుకుంటూ అంచలంచెలుగా ఎదుగుతున్నారు.

మొత్తం మీద, జానీ మాస్టర్‌కు శ్రీశైలం యాదవ్ పూర్తి అండదండలు అందించారు. సినీ పరిశ్రమలో ఐకమత్యం, డ్యాన్సర్స్ సంక్షేమంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇది సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.