
బ్రహ్మముడి సీరియల్‌లో తీవ్రమైన ట్విస్టులు! కావ్యకు అబార్షన్ గురించి తెలుస్తుంది. కల్యాణ్ చెప్పిన అబద్ధాలు, యామిని రీ ఎంట్రీతో రాజ్ బెంబెలెత్తిపోతాడు. ఈ ఎపిసోడ్‌లో ఎన్నో షాకింగ్ ట్విస్టులు ఉన్నాయి.
Key Points
కావ్యకు అబార్షన్ గురించి డాక్టర్ చెప్పిన నిజం
కల్యాణ్ చెప్పిన అబద్ధం, యామిని బెదిరింపు
సుభాష్‌తో రాజ్ గొడవ, కుటుంబంలో తలెత్తిన సంక్షోభం
అబార్షన్ నిర్ణయం
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్యకు అబార్షన్ త్వరగా చేయాలని, లేకుంటే తల్లి బిడ్డ ఇద్దరిని కాపాడలేమని డాక్టర్ చెబుతుంది. ఎలాగైనా కాపాడమని, స్పెషలిస్ట్‌లను చూడమని రాజ్ వేడుకుంటాడు. ఇదొక్కటే మార్గం తప్పా ఇంకోటి లేదని డాక్టర్ చెప్పడంతో ఫైర్ అవుతాడు రాజ్ .
మీరేమైనా దేవుళ్ల అంటూ గొడవ పెట్టుకుంటాడు రాజ్. తర్వాత కల్యాణ్‌తో ఎలాగైనా ఇద్దరిని కాపాడాలని పిచ్చోడిలా ప్రవర్తిస్తాడు రాజ్. బిడ్డ చనిపోతుందని తెలిసి రాజ్ బెంబెలెత్తిపోతాడు. కంగారుపడతాడు. ఇంటికి వెళ్లిన రాజ్‌తో ఆఫీస్‌లో అర్జంట్ వర్క్ ఉందని, కోట్లల్లో నష్టం వస్తుందని, ఎలాగైన ఆఫీస్‌కు వెళ్లమని తండ్రి సుభాష్ ఫోర్స్ చేస్తాడు.
దానికి సుభాష్‌పై అరిచేస్తాడు రాజ్. తండ్రిపై మొదటిసారి రాజ్ అలా ప్రవర్తించేసరికి అంతా షాక్ అయి చూస్తారు. డబ్బు పిచ్చి పట్టిందంటూ తండ్రిని నానా మాటలు అంటాడు రాజ్. పుట్టబోయే బిడ్డను కోల్పోతానన్న కోపం, భయంలో కన్నతండ్రిని మాటలు అంటాడు రాజ్. వర్కర్స్ కుటుంబాలు రోడ్డున పడతాయంటూ ఇందిరాదేవి సముదాయిద్దామని చూస్తుంది.
కల్యాణ్ యొక్క అబద్ధాలు
కానీ, ఇందిరాదేవితో కూడా హార్ష్‌గా మాట్లాడుతాడు రాజ్. రోడ్డు మీద పడితే పడనీ. వాళ్లు జీతాలు తీసుకోవట్లేదు. లేనప్పుడు ఆ మాత్రం చూసుకోలేరా కోపంగా వెళ్లిపోతాడు రాజ్. దాంతో రాజ్ వింత ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతారు. భయపడతారు. రాజ్ చాలా కోపంగా ఉన్నాడేంటీ, ఇంత కోపం ఎప్పుడు చూడలేదు. అది కూడా ఆయన మీద ఎప్పుడు ఇలా అరవలేదు అని అపర్ణ బాధపడిపోతుంది.
ఏమైంది కవిగారు. నిన్నటి నుంచి ఆయన మాములుగా లేరు. నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు. ఇవాళ ఎక్కడికెళ్లారు. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని కల్యాణ్‌ను నిలదీస్తుంది కావ్య. దాంతో ముందుగా తడబడతాడు కల్యాణ్. దాంతో దారిలో యామిని కనిపించిందని, నీకు, బిడ్డకు ప్రమాదం తలపెడతానని చెప్పిందని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు కల్యాణ్.
కావ్య అబార్షన్‌ను యామిని బెదిరింపుపై తోస్తాడు కల్యాణ్ . మరిది మాట నమ్మిన కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది. కొడుకు అన్న మాటలకు సుభాష్ కుమిలిపోతుంటాడు. మరోవైపు డాక్టర్లతో రాజ్ మాట్లాడుతుంటాడు. ఓ డాక్టర్ మాత్రం ఈ సమస్యకు ఒక్క దారి ఉందని, కానీ, అది సగం సగం అవకాశం ఉందని, రిస్క్ ఎక్కువని, తల్లిబిడ్డ ఇద్దరిని కోల్పోయే అవకాశం ఉందని చెబుతుంది.
రాజ్ యొక్క కోపం, ప్రవర్తన
అది విని ఛ అనుకుంటూ చిరాకు పడి వెనక్కి తిరుగుతాడు రాజ్. వెనుకే ఉన్న కావ్యను చూసి రాజ్ భయపడిపోతాడు. కావ్యకు అబార్షన్ నిజం తెలిసిందని బెంబెలెత్తిపోతాడు రాజ్. మీరు ఇలా ఎందుకు ఉన్నారో నాకు తెలుసు. కవిగారు మొత్తం నాకు చెప్పారు అని కావ్య అంటుంది. దాంతో రాజ్ మరింత షాక్ అవుతాడు.
సమస్య ఏదైనా తండ్రిపైన అలా అరిచారు ఏంటీ, దానికి మావయ్య ఎంత బాధపడి ఉంటారు. కట్టుకున్న భర్తను కన్న కొడుకే అలా మాటలు అంటుంటే ఆ తల్లి ఎంత కుమిలిపోతుంది అని రాజ్‌కు చెబుతుంది కావ్య. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
రాజ్ యొక్క కోపం, కావ్య ఆందోళన, కల్యాణ్ అబద్ధాలు, మరియు యామిని తిరిగి రావడంతో బ్రహ్మముడి కుటుంబంలో సంక్షోభం తీవ్రమవుతుంది. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.


