|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి నవంబర్ 7 ఎపిసోడ్: మారిపోయిన రాహుల్, క్షమించని స్వప్న; కుయిలిని కొట్టిన రాహుల్ వీడియో రంజిత్ తీశాడు.

Published: 06-11-2025, 11:02 PM
బ్రహ్మముడి నవంబర్ 7 ఎపిసోడ్: మారిపోయిన రాహుల్, క్షమించని స్వప్న; కుయిలిని కొట్టిన రాహుల్ వీడియో రంజిత్ తీశాడు.

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 7 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. కుయిలి మోసాలను రాజ్, కావ్య బయటపెట్టారు. రాహుల్, కుయిలి గొడవలో రంజిత్ కీలక వీడియో తీశాడు. రాహుల్ పశ్చాత్తాపపడినా, స్వప్న అతన్ని క్షమించలేదు. ఈ డ్రామా తారాస్థాయికి చేరింది.

Key Points

1

రాజ్, కావ్య, గోల్డ్ బాబు కలిసి కుయిలి మోసాన్ని బయటపెట్టారు.

2

రాహుల్, కుయిలి మధ్య గొడవ జరగగా, రంజిత్ దానిని వీడియో తీశాడు.

4

తన ఆస్తి కోసం రాహుల్‌ను ట్రాప్ చేయాలని కుయిలి ప్రయత్నించినట్లు ఒప్పుకుంది.

రాజ్, కావ్యల ప్లాన్ సక్సెస్

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 7 ఎపిసోడ్‌లో కుయిలి నిజ స్వరూపం ఏంటే చెప్పి రాజ్, కావ్య, గోల్డ్ బాబు వెళ్లిపోతారు. వాళ్లు వేసిన ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. అది కుయిలి భర్త రంజిత్ వెంటాడు. రాహుల్, కుయిలికి గొడవ జరుగుతుంది. కుయిలిని రాహుల్ కొడతాడు. అది రంజిత్ వీడియో తీస్తాడు. రాహుల్‌ను స్వప్న క్షమించదు.

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి నిజ స్వరూపాన్ని రాజ్, కావ్య బయటపెడతారు. ఇప్పటికైనా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకుంటే మంచిది. ఇంటికొస్తే నీకే బెటర్ అని చెప్పిన రాజ్, కావ్య వెళ్లిపోతారు. వాళ్లతోపాటు గోల్డ్ బాబు కూడా వచ్చేస్తాడు. మొత్తానికి రాహుల్‌కు క్లారిటీ వచ్చిందని, నాటకం సక్సెస్ అయిందని ముగ్గురు సంబరపడతారు.

ఇక్కడే ఉంటే లేనిపోని అనుమానాలు వస్తాయి. వెళ్లిపోదాం అని గోల్డ్ బాబు అంటాడు. దాంతో అంతా వెళ్లిపోతారు. అంటే వీరంతా రాహుల్ కోసం నాటకం ఆడారా. కుయిలి పరిస్థితి ఎలా ఉందో అని రంజిత్ అనుకుంటాడు. మరోవైపు కుయిలిని రాహుల్ కొడతాడు. చేసిన మోసానికి తిడతాడు. నువ్వు బజారు దానికన్న హీనం అంటాడు. నా డబ్బు కోసం ఆశపడ్డా నిన్ను ఏమనలిరా అని కుయిలి రివర్స్ అవుతుంది.

నీ మొగుడు పక్కన ఉన్న నన్ను ఎంటర్‌టైన్ చేశావే. నీకు ఇంకో పేరు పెట్టాలి అని రాహుల్ అంటే, పెళ్లయి, కూతురు కూడా ఉన్నా నాకోసం వచ్చిన నిన్ను ఏమనాలి అని కుయిలి అంటుంది. అవును, నిన్ను ట్రాప్ చేసి నీ ఆస్తి కొల్లగొట్టాలని అనుకున్నాను. నీకంటే బెటర్‌గా గోల్డ్ బాబు దొరికాడు. వాన్ని పడగొట్టాను. అయితే ఏంట్రా ఏం చేయగలవు. నీలాంటి వాళ్లు నా చేతుల్లో చాలా మంది అవుట్ అయ్యారు అని కుయిలి పొగరుగా అంటుంది.

రాహుల్-కుయిలి గొడవ, రంజిత్ వీడియో

ఆ దెబ్బకు కింద పడిపోతుంది కుయిలి. ఇంకోసారి నా పెళ్లాం గురించి అంటే చంపేస్తాను అని రాహుల్ వెళ్లిపోతాడు. అదంతా రంజిత్ వీడియో తీస్తాడు. కుయిలి కాస్తా కదులుతుంది. మరోవైపు వాళ్లు ఆడిన నాటకం గురించి రాజ్, కావ్య చెబుతారు. అంతా నవ్వుతారు. రుద్రాణి కూడా మెచ్చుకుంటుంది. ఎప్పటికీ రుణపడి ఉంటానంటుంది. ఇంతకీ రాహుల్ గాడు ఎక్కడ అని ఇందిరాదేవి అంటుంది.

రాహుల్ దిగాలుగా ఇంటికి వస్తాడు. గుమ్మం దగ్గరే ఆగితే రాజ్ లోపలికి రమ్మంటాడు. రాహుల్ అడుగుపెడుతుంటే స్వప్న వద్దంటుంది. నీకు తప్పులు అలవాటు అయిపోయాయి. కానీ, నీతో కాపురం నాకు బరువైందని, నువ్వు పుట్టిందే తప్పులు చేయడానికి. నాకు సహనం చచ్చింది. అందుకే నీతో కాపురం చేయలేను, భర్తగా అంగీకరించలేను అని స్వప్న అంటుంది.

నీ ముందు నిస్సహాయంగా మారిన మనిషిలా నిలబడ్డాను. ఒక్క అవకాశం ఇవ్వు స్వప్న అని బతిమిలాడుకుంటాడు రాహుల్. ఒక్క ఛాన్స్ ఇవ్వమని రాజ్, కావ్య నచ్చజెబుతారు. ఇకపై నీకు నచ్చని పని చేయను. అలా చేస్తే నువ్వు ఏ శిక్ష వేస్తే దానికి సిద్ధం. ఈ ఒక్కసారి క్షమించు అని రాహుల్ వేడుకుంటాడు. రాహుల్ మారిపోయాడు. పూర్తిగా నీవాడు అయ్యాడు అని అపర్ణ అంటుంది.

స్వప్న నిరాకరణ, రాహుల్ పరిస్థితి

రేయ్ ఇకనైన భార్యే జీవితంగా బతుకు లేకుంటే పుట్టగతులు ఉండవు అని రుద్రాణి అంటుంది. బాగా ఆలోచించిన స్వప్న ఇదే నీకు చివరి అవకాశం అని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది. రాహుల్ లోపలికి వెళ్తాడు. తర్వాత రాహుల్‌ను రుద్రాణి కొడతుంది. ఇంకా మారవా. ఇలాగే లేకి పనులు చేస్తావా. అందరితో తిట్టించుకుంటావా అని తిడుతుంది.

ఈ ఇంటికి వారసుడిని చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకు మళ్లీ ఓ అవకాశం ఇచ్చారు. దీన్ని పరిపూర్ణంగా వాడుకోవాలి అని రుద్రాణి చెబుతుంటే మామ్ నీకేమైనా మతిపోయిందా అని రాహుల్ అంటాడు. ఏయ్.. నేను చెప్పింది వింటూ నన్ను ఫాలో అవ్వు అని రుద్రాణి చెప్పేసి వెళ్లిపోతుంది.

తర్వాత కుయిలిని రాహుల్ చంపాడని, తను చనిపోయిందని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రాహుల్ చంపినట్లు వీడియో సాక్ష్యం ఉన్నట్లు చెబుతారు. నిజానికి కుయిలిని తన భర్త రంజిత్ చంపాడని తెలుస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

మొత్తంగా, బ్రహ్మముడి నవంబర్ 7 ఎపిసోడ్ కీలక మలుపులతో నిండిపోయింది. రాహుల్, స్వప్న భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రంజిత్ వీడియోతో కథ మరింత ఉత్కంఠగా మారింది. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.