
బ్రహ్మముడి అక్టోబర్ 3 ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. కావ్య తన ‘చీకట్లో బాణం’ ప్లాన్‌తో రాజ్ బిడ్డ రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించింది. అయితే కల్యాణ్‌తో జరిగిన సంభాషణతో అది విఫలమైంది. మరోవైపు, సుభాష్ ఫ్రెండ్ రాకతో కొత్త మలుపు తిరిగింది.
Key Points
కావ్య 'చీకట్లో బాణం' వేసినా కల్యాణ్ నిజం చెప్పలేకపోయాడు.
రాజ్ తన బిడ్డ రహస్యం కావ్యకు తెలియకుండా జాగ్రత్త పడతాడు.
రాజ్, కల్యాణ్ కలిసి ఆడుతున్న డ్రామాపై కావ్యకు అనుమానం పెరిగింది.
సుభాష్ ఫ్రెండ్ గిరీష్ రాకతో సీరియల్‌లో కొత్త మలుపులు మొదలయ్యాయి.
కావ్య చీకట్లో బాణం ఫెయిల్
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నేను డాక్టర్‌ను కలవలేదన్న విషయం మీకెలా తెలుసు అని కల్యాణ్‌ను అడుగుతుంది కావ్య. దాంతో కల్యాణ్ తడబడతాడు. మీరు నన్ను ఫాలో చేశారా అని కావ్య అంటే.. అలా ఎందుకు చేస్తాను వదినా. గెస్ చేశాను. హాస్పిటల్‌కు వెళ్తే చెకప్‌లు, టెస్ట్‌లు చేస్తారుగా. త్వరగా లేట్ కాకుండా వస్తే గెస్ చేశాను అని వెళ్లిపోతాడు కల్యాణ్ .
తర్వాత కల్యాణ్ మాట్లాడింది, అప్పటి వరకు జరిగింది అన్ని ఆలోచించినా కావ్య కల్యాణ్‌కు రాజ్ బిడ్డ వద్దనుకునే కారణం తెలిసే అవకాశం ఉంటుందని అనుమానిస్తుంది. ఒకవేళ తాను అనుకుంది తప్పు అయితే కల్యాణ్‌ను అనుమానించినట్లు బాధపడుతాడు. అలా కాకుండా నాకు అంతా తెలిసినట్లు చీకట్లో బాణం వేస్తే కల్యాణ్ బయటపడే ఛాన్స్ ఉంది. అలా చేద్దాం అనుకుని కల్యాణ్ దగ్గరికి వెళ్తుంది కావ్య.
మరోవైపు నీకు మరి ఇంత నోటి దూల ఉందేంట్రా అని అద్దంలో చూసుకుంటూ తిట్టుకుంటాడు కల్యాణ్. ఇంతలో కావ్య వస్తుంది. కళ్యాణ్ భయపడతాడు. మీరు నిజం చెప్పండి, నా దగ్గర దాస్తున్న నిజం చెప్పండి. మీరు చెప్పకపోయిన నాకు నిజం తెలిసిపోయింది. మీరు మీ అన్నయ్య కలిసి ఆడుతున్న డ్రామాలు నాకు తెలియదు అనుకున్నారా. ఇంతపెద్ద నిజం ఎందుకు దాచారు అని కావ్య నిలదీస్తుంది.
అటుగా వెళ్తున్న రాజ్ ఆ మాటలు విని ఏంటిది కళావతి చీకట్లో బాణం వేస్తుందా. ఒరేయ్ కవిగా బుట్టలో పడిపోయావంటే బుక్ అయిపోతావురా అని రాజ్ అనుకుంటాడు. అంటే వదినా చెబుదామనుకున్నా కానీ అన్నయ్య వద్దన్నాడు. మేము టెస్ట్ రిపోర్ట్స్ తెద్దామని హాస్పిటల్‌కు వెళ్తే అని కల్యాణ్ అంటుండగా రాజ్ సైగలు చేస్తుంటాడు. అది చూసిన కళ్యాణ్ అంటే వదినకు నిజం తెలియదన్నమాట అని ఆగిపోతాడు.
రాజ్ రహస్యాన్ని దాచే ప్రయత్నం
మీ వదినతో గొడవ జరుగుతుందిగా సరదాగా సెకండ్ షో సినిమాకు వెళ్దామంటే చెప్పలేదు వదినా. అంతే తప్ప నిజాన్ని నీ దగ్గర దాయాలని కాదు. దీంట్లో తప్పుంటే క్షమించు అని కల్యాణ్ అంటాడు. దాంట్లో ఏం తప్పుందిరా అని అంటూ రాజ్ వస్తాడు. ఏంటీ నిజాన్ని దాయాలని చూస్తున్నారా. ఏదో ఒకరోజు కచ్చితంగా బయటపడుతుంది అని కావ్య చెప్పేసి వెళ్లిపోతుంది.
కావ్య చీకట్లో బాణం వేసిందిరా. నిజంగానే చెప్పేస్తావా అని కళ్యాణ్‌ను తిడతాడు. కళావతికి నిజం తెలిసిలోపు అనుకుంది జరిగిపోవాలి. తనకు ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకూడదు అని రాజ్ వెళ్లిపోతాడు. ఇంటికి సుభాష్ ఫ్రెండ్ గిరీష్ వస్తాడు. ఏంట్రా ఈ సడెన్ సర్‌ప్రైజ్ అని సుభాష్ అంటే.. నా కూతురు సీమంతం. రావాలని చెబుతాడు గిరీష్.
తర్వాత మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ మీ ఇంటి విషయాలు బయటకొస్తున్నాయ్. కావ్యకు రాజ్ అబార్షన్ చేయించాలని చూస్తున్నాడట. తనకు తెలియకుండా చేయించాలని చూశాడట. ఏం జరుగుతుందిరా మీ ఇంట్లో. పెద్దింటి వాళ్ల విషయాలు అందరికి హాట్ టాపిక్‌రా. సీతారామయ్య ఇంట్లో గాసిప్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అని గిరీష్ చెబుతాడు.
వాడు ఎందుకు అలా చేస్తున్నాడు. రాజ్ ఇలా చేస్తున్నాడు అని హాస్పిటల్‌లో మాట్లాడుకున్నారు. మనలాంటి వాళ్ల విషయాలు ఎదుటి వాళ్లకు సమాచారం. వీలైనంతవరకు ఇంట్లోనే క్లియర్ చేసుకోరా. ఇలా చెబుతున్నందుకు తప్పుగా అర్థం చేసుకోకు అని గిరీష్ వెళ్లిపోతాడు. మరోవైపు కృష్ణుడి దగ్గరికి వెళ్లి కావ్య తన బాధ చెప్పుకుంటుంది. ఆయన మాములుగా అడిగితే నిజం చెప్పట్లేదు. ఆయనకు విడాకులు ఇచ్చేస్తాను అని కావ్య షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది.
సుభాష్ ఫ్రెండ్‌తో కొత్త చిక్కులు
ఏ భార్య అయిన భర్తతోనే ఉండాలనుకుంటుంది. సుమంగళిగానే చావాలనుకుంటుంది. విడాకులు అనే అమంఘలమైన మాటను కూడా బయటకు రానివ్వదు. కానీ, నా బిడ్డను కాపాడుకోవాలనుకుంటే విడాకులు తీసుకోవాలి. ఇంట్లో అందరు నన్ను చెడ్డదానిలా చూస్తారు. కానీ, నా బిడ్డ కంటే నన్ను ఏమనుకున్న పర్వాలేదు. నేను ఆయన్ను వదులుకోలేను. అందుకే విడాకులు అనే నాటకాన్ని ఆడబోతున్నాను అని కావ్య అంటుంది.
ఈ నాటకంలో నా జీవితానికి ఎలాంటి ఆటంకం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కృష్ణ. ఈ నాటకం ఆయన నుంచి నిజాన్ని బయటకు రాబట్టడానికి మాత్రమే ఆడుతున్నా. ఇందులో నేను గెలిచేలా ఆశీర్వదించు కృష్ణ అని కావ్య దండం పెట్టుకుంటుంది. మరోవైపు సుభాష్ ఫ్రెండ్ గిరీష్ రాజ్ అబార్షన్ గురించి చెప్పడం, చిచ్చు రగిల్చి వెళ్లాడని రాహుల్ విన్నది రుద్రాణి కి చెబుతాడు రాహుల్.
రాజ్‌కు ఇంకా క్లాస్ పీకలేదేంటీ అని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. ఇంతలో రాజ్‌ను పిలిచి అపర్ణ నిలదీస్తుంది. గిరీష్ చెప్పిందాన్ని సుభాష్ చెబుతాడు. ఇప్పటివరకు పరువు కాపాడుకుంటూ వచ్చాం. నీ వల్ల పరువు గంగలో కలిసిపోయింది అని సుభాష్ అంటాడు. మేము ఇంకా ఎంతమంది చేత మాటలు పడాలి అని అపర్ణ అంటుంది.
నాకు దీని విషయంలో పరిష్కారం కావాలి అని సుభాష్ అంటాడు. అది మీ కోడలి చెప్పాలి అని రాజ్ అంటాడు. ఎందుకిన్ని నాటకాలు ఆడుతున్నారు. డాక్టర్‌ను కావాలనే కలవకుండా చేశారు. మీరు నాతో కలిసి ఉండటానికి ఈ బిడ్డ అడ్డం అయితే నేను మీకు దూరంగా వెళ్లిపోతాను అని కావ్య అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
రాజ్ రహస్యాన్ని కావ్య ఎప్పుడు తెలుసుకుంటుందో, సుభాష్ ఫ్రెండ్ రాక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. విడాకుల నిర్ణయంపై ఈ పరిణామాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ చూడాల్సిందే.


