
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో ఆసక్తికరమైన ట్విస్టులు ఉన్నాయి. రుద్రాణి చేసిన టాబ్లెట్స్ మార్పిడి, స్వరాజ్ వెల్లడించిన నిజం, కావ్య మరియు రాజ్ మధ్య ప్రేమ వంటివి ఈ ప్రోమోలో ప్రధాన ఆకర్షణలు.
Key Points
రుద్రాణి చేసిన టాబ్లెట్స్ మార్పిడితో అప్పుకు పాయిజన్ చేరింది.
స్వరాజ్ కావ్య గర్భవతి అని నిజం బయటపెట్టాడు.
కనకం కావ్యను ఆశీర్వదించింది.
రుద్రాణి యొక్క ప్రణాళిక
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో అప్పు దగ్గర టాబ్లెట్స్ అయిపోతే వెళ్లి కావ్య దగ్గర తీసుకుంటుంది. అది రుద్రాణి చూస్తుంది. అయితే, ఎపిసోడ్‌లో మాత్రం అది చూపించరు. కానీ, అప్పు వెళ్లగానే కావ్య దగ్గరికి కనకం వస్తుంది. అది రుద్రాణి చూస్తుంది.
కావ్య కడుపుతో ఉంది బయటపెట్టకపోయే పరిస్థితి గురించి కనకం బాధపడుతుంది. కావ్య కూడా అందుకు చింతిస్తుంది. ఇలా కావ్య, కనకం మాట్లాడుకునే మాటలను ధాన్యలక్ష్మీకి చూపిస్తుంది రుద్రాణి. అప్పుకున్నంత అదృష్టం తనకు లేదని కావ్య బాధపడుతుంది. ఇదంతా అసూయతో మాట్లాడే మాటలు అని, ఇదే కావ్య నిజ స్వరూపం అని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి.
తర్వాత అప్పును భోజనం చేయమని టాబ్లెట్స్ తీసుకొస్తానని వెళ్తుంది ధాన్యలక్ష్మీ. ఈలోపే ఇదే సరైన సమయం అనుకుని ఆ టాబ్లెట్స్‌ను రాహుల్‌తో మార్పించేస్తుంది రుద్రాణి. అంటే, కావ్య గర్భవతి అనే విషయం బయటపెట్టడానికి రుద్రాణికి తనకు తానే ఇన్‌డైరెక్ట్‌గా సహాయం చేసినట్లు అవుతుంది.
స్వరాజ్ యొక్క ఆవిష్కరణ
ఇక రాహుల్ మార్చిన టాబ్లెట్స్‌నే ధాన్యం తీసుకొచ్చి అప్పుకు ఇస్తుంది. పాయిజన్ లాంటి టాబ్లెట్స్‌ను అప్పు వేసుకుంటుంది. మరోవైపు కల్యాణ్ ఇచ్చిన పంచె కట్టుకుని రాజ్ వస్తాడు. రాజ్‌ను చూసి కావ్య ఫిదా అయిపోతుంది. మరోవైపు స్వరాజ్‌తో కావ్య కడుపుతో ఉందని, నీకోసం బాబును మోస్తుందని రుద్రాణి చెబుతుంది. దాంతో స్వరాజ్ వెళ్లి కావ్యకు కంగ్రాట్స్ చెబుతాడు.
నాకెందుకు కంగ్రాట్స్ చెబుతున్నావురా అని కావ్య అంటే.. నువ్వు కడుపుతో ఉన్నావుగా అని నిజం బయటపెడతాడు స్వరాజ్. ఆ మాటలు అంతా వింటారు. మెట్లపై నుంచి వస్తున్న రాజ్ కూడా విని షాక్ అవుతాడు. నేను కడుపుతో ఉండటం ఏంట్రా అని షాక్ అయి అడుగుతుంది కావ్య. దాంతో రుద్రాణి చెప్పిందని స్వరాజ్ అంటాడు. అంతా రుద్రాణిని తిట్టుకుంటారు.
అక్క కడుపుతో లేదు. కడుపుతో ఉంది నేనురా. నాకోసమే ఈ వ్రతం చేయిస్తున్నారు అని స్వరాజ్‌కు అప్పు చెబుతుంది. హో అలాగా అని స్వరాజ్ అంటాడు. తర్వాత ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. రాహుల్ దగ్గర స్వప్న, కల్యాణ్ దగ్గర అప్పు అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. కావ్య మాత్రం తన భర్త రాజ్ దగ్గర ఎలా ఆశీర్వాదం తీసుకోవాలో తెలియక బాధపడుతుంది.
కావ్య మరియు రాజ్ ప్రేమ
రాజ్ పక్కనే ఉన్న కనకం కావ్యను పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెబుతుంది. రాజ్ చేతిలో ఉన్న ప్లేట్‌లో అక్షింతలు ఉంటాయి. వాటిని కావ్యపై పడేలా చేస్తుంది కనకం. అలా కావ్యను రాజ్ భర్తగా ఆశీర్వదించినట్లు అవుతుంది. వ్రతం అయిన తర్వాత మరోసారి కావ్యకు రాజ్ లవ్ ప్రపోజ్ చేస్తాడు.
అందరి గుండెలు బతకడానికి కొట్టుకుంటే నా గుండె మాత్రం మీతో కలిసి ఉండాలంటోంది. నన్ను పెళ్లి చేసుకుంటారా అని కావ్య ను రాజ్ అడుగుతాడు. కానీ, బాధగా అలాగే ఉంపోతుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరకు, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కావ్యకు కనకం ఆశీర్వాదం చేస్తుంది. ఈ ఎపిసోడ్‌లోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


