|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి ప్రోమో: తల్లి కాబోతున్న కావ్య- రాజ్ ప్రేమను రెజెక్ట్ చేసిన కావ్య

Published: 02-08-2025, 8:14 PM
బ్రహ్మముడి ప్రోమో: తల్లి కాబోతున్న కావ్య- రాజ్ ప్రేమను రెజెక్ట్ చేసిన కావ్య

బ్రహ్మముడి సీరియల్ ప్రోమోలో కావ్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కానీ, భర్త గతం గుర్తులేకపోవడంతో ఆమె తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతోంది. రాజ్ ప్రేమను కావ్య ఎలా స్వీకరిస్తుందో చూడాలి.

Key Points

1

కావ్య ప్రెగ్నెంట్ అయినట్లు ధ్రువీకరించబడింది.

2

రాజ్ ప్రేమను కావ్య తిరస్కరించింది.

4

రామ్ గతం గుర్తులేకపోవడం వల్ల కావ్య కష్టాలను ఎదుర్కుంటోంది.

కావ్య ప్రెగ్నెన్సీ

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ఇకనైన కష్టాలు దూరం చేసి తన భర్తకు దగ్గర చేయమని, నీ లీలలు ఆపేయమని కృష్ణుడితో మోర పెట్టుకుంటుంది కావ్య. ఇంతలోనే కావ్యకు వాంతులు అవుతాయి. నెల తప్పినట్లు అనుమానం వచ్చిన కావ్య ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో పరీక్ష చేసుకుంటుంది.

దాంట్లో కావ్య ప్రెగ్నెంట్ అయినట్లు కన్ఫర్మ్ అవుతుంది. అది తెలిసి తెగ సంబరపడిపోయిన కావ్య ఆ విషయం అత్త అపర్ణకు చెప్పాలని పిలుస్తుంది. కానీ, ఒక్కసారిగా ఆగిపోయి తెగ బాధపడిపోతుంది. తన భర్త రాజ్‌కు గతం గుర్తు లేక రామ్‌గా మారిపోవడం, రామ్‌ ప్రేమను ఒప్పుకుని పెళ్లి చేసుకొందామన్న కావ్యకు ఈ ప్రెగ్నెన్సీ శాపంగా అడ్డంకిగా మారిందని తెలిసి ఏడుస్తుంది.

ఇంతలో అక్కడికి అప్పు వస్తుంది. అప్పును చూసి తనను హగ్ చేసుకుని ఏడుస్తుంటుంది కావ్య. ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అప్పు అడిగితే.. తాను తల్లి కాబుతోన్నట్లు, కానీ ఆ విషయాన్ని ఎవరికి పంచుకోలేనని చెబుతుంది కావ్య. అలా ఎందుకు చెప్పలేవు అక్క అని అప్పు అడిగితే మీ బావగారికి గతం గుర్తు లేదు. ఇప్పుడు ఈ బిడ్డకు తండ్రి ఎవరు అని తండ్రే అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను అని కుమిలిపోతుంది కావ్య.

రాజ్ ప్రేమ ప్రతిస్పందన

అది అర్థం చేసుకున్న అప్పు అక్క కావ్యను ఓదారుస్తుంది. తర్వాత స్వరాజ్‌ను రేవతి ఇంట్లో దిగబెట్టొస్తానని చెప్పి తీసుకెళ్తుంది అప్పు. దాంతో రాహుల్‌కు రుద్రాణి సైగ చేస్తుంది. అది అర్థం చేసుకున్న రాహుల్ అప్పు వెంట పడుతు ఫాలో అవుతాడు. మరోవైపు కారులో హుషారుగా రాజ్ దుగ్గిరాల ఇంటికి వస్తాడు. ఈరోజు ఎలాగైనా తన మనసులో ఉన్న ప్రేమను కావ్యకు చెప్పాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు.

ఇంటికి వచ్చిన రాజ్ కావ్యకు లవ్ ప్రపోజ్ చేయాలని తడబడతాడు. ఏదోటి మాట్లాడిన కాసేపటికి తాను ప్రేమిస్తున్న విషయం కావ్యకు చెబుతాడు రాజ్. మీతో కలిసి జీవితాంతం బతకాలి. మీతో కలిసి ఏడు అడుగులు నడవాలి అనుకుంటున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని కావ్యను అడుగుతాడు రాజ్ .

అదంతా దుగ్గిరాల కుటుంబం మొత్తం వింటుంది. పెళ్లి ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలి మొత్తం నువ్వే డిసైడ్ చేసి చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది. ఇక చాలు ఆపుతారా. ఆయన అంటే నాకు ఇష్టమని మీ అందరికి నేను చెప్పానా. అసలు నేను పెళ్లికి ఒప్పుకున్నానా. ఆయన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని రాజ్ ప్రేమను రెజెక్ట్ చేస్తుంది కావ్య.

కావ్య యొక్క దుఃఖం

అది విన్న ఇందిరాదేవి, అపర్ణ, రాజ్ ఒక్కసారిగా అవాక్కవుతారు. రుద్రాణి కూడా ఊహించని విధంగా షాక్ అయిపోతుంది. ఇక రాజ్ బాధతో ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. రాజ్ కావ్య ప్రేమను రెజెక్ట్ చేయడానికి కారణం యామినినే అనుకుని కాల్ చేసి జరిగింది చెబుతుంది రుద్రాణి . అది విని యామిని తెగ సంబరపడిపోతుంది.

రాజ్ ఎప్పటికైనా తన దగ్గరికి వస్తాడని, కావ్యనే తనంతట తానే రాజ్ ప్రేమను తిరస్కరించేలా చేయిస్తానని ప్లాన్‌లు వేసిన యామిని కి ఎలాంటి స్కెచ్ వేయకుండానే అనుకుంది జరుగుతుంది. కావ్య ప్రెగ్నెన్సీ యామినికి కలిసొస్తుంది. ఇక రాజ్‌ను తనవైపుకు ఎలా తిప్పుకోవాలా అని ఆలోచిస్తుంది యామిని. అక్కడితో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

కావ్య ప్రెగ్నెన్సీ మరియు రాజ్ గతం గుర్తులేకపోవడం వల్ల కలిగే కష్టాలతో కథ ముగిసింది. కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.