
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కళ్లుగప్పి కుయిలి ఇంట్లోకి చొరబడిన రాజ్, కావ్య కీలక సాక్ష్యాన్ని కనుగొన్నారు. రంజిత్ డబ్బు కోసం ఆడుతున్న నాటకం బయటపడటంతో రాహుల్ నిర్దోషి అని తేలింది. ఈ కొత్త సాక్ష్యం సీరియల్ కథను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.
Key Points
రుద్రాణితో రంజిత్ 2 కోట్ల డీల్ మాట్లాడుకుంటున్నాడు.
పోలీసుల కళ్లుగప్పి కుయిలి ఇంట్లో సీక్రెట్ కెమెరాను తెచ్చిన రాజ్, కావ్య.
రాహుల్ కొట్టిన తర్వాత కూడా కుయిలి బతికే ఉందని వీడియోలో వెల్లడైంది.
కుయిలి మరణంపై రంజిత్ నాటకం ఆడుతున్నట్లు రాజ్, కావ్య గుర్తించారు.
పోలీసుల కళ్లుగప్పి సీక్రెట్ కెమెరాను తెచ్చిన రాజ్, కావ్య
బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రంజిత్‌తో డీల్ మాట్లాడుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది రుద్రాణి. కుయిలి ఇంటికి వెళ్లిన రాజ్, కావ్య అక్కడ పోలీసులు ఉండటం చూసి షాక్ అవుతారు. పోలీసుల కళ్లుగప్పి కుయిలి ఇంట్లోకి దొంగచాటుగా చొరబడతారు. అక్కడ కావ్య పెట్టిన సీక్రెట్ కెమెరాను తీసుకుని బయటకు వస్తారు.
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తన కొడుకును తానే కాపాకుంటానని కుయిలి భర్త రంజిత్ దగ్గరికి వెళ్లిపోతుంది రుద్రాణి. రాజ్, కావ్య ఎంత చెప్పిన వినదు. రాహుల్ కోసం అత్త ఏమైనా చేస్తుంది. ఇలాంటప్పుడు అత్తతో నువ్వు పక్కన ఉండి, ఎలాంటి తప్పు జరగకుండా చూడమని స్వప్నకు చెబుతాడు రాజ్.
మేము వెళ్లి ఎలాంటి నిజాలు రాబట్టలేకపోతే వాళ్లు ఆడే నాటకం రికార్డ్ అవుతుందని ముందుగానే సీక్రెట్ కెమెరా పెట్టినట్లు కావ్య చెబుతుంది. దాంతో కావ్యను ఇంటిల్లిపాది మెచ్చుకుంటారు. ఆ సీక్రెట్ కెమెరాను రికవరీ చేసేందుకు కుయిలి ఇంటికి వెళ్తారు రాజ్ , కావ్య. కారులో కుయిలి ఇంటికి వెళ్తారు రాజ్, కావ్య.
రాహుల్ నిర్దోషి అని నిరూపించిన అసలు సాక్ష్యం
అయితే, అక్కడ కుయిలి ఇంటి చుట్టు పోలీసులు బందోబస్తుగా ఉంటారు. కుయిలి ఇంటి చుట్టూ పోలీసులు ఉండటం చూసి రాజ్, కావ్య చూసి షాక్ అవుతారు. ఇదేంటండి కెమెరా తీసుకొద్దామనుకుంటే ఇంతమంది పోలీసులు ఉన్నారు అని కావ్య కంగారుపడుతుంది.
కిటికీ నుంచి కుయిలి ఇంట్లోకి దొంగచాటుగా చొరబడతారు రాజ్, కావ్య . ఇంట్లో పెట్టిన సీక్రెట్ కెమెరాను తీసుకుని మళ్లీ పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా బయటకు వస్తారు. కారులో కూర్చుని ఆ సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయింది చూస్తారు రాజ్ కావ్య. అందులో రాహుల్, కుయిలి గొడవ పడటం, స్వప్నను మాట అనడంతో కుయిలిని రాహుల్ కొట్టడం, దాంతో కుయిలి కిందపడిపోవడం చూస్తారు.
అలాగే, రాహుల్ కొట్టిన తర్వాత కూడా కుయిలి కదలడం చూసి షాక్ అవుతారు. తర్వాత పూర్తి వీడియో చూసి రాజ్, కావ్య నిర్ఘాంతపోతారు. అంటే, రాహుల్ కొడితే కుయిలి చావలేదు. ఆ రంజిత్ గాడు పైపైన వీడియో తీసి దాన్నే సాక్ష్యం అంటున్నాడు. కానీ, మనకు దొరికిందే అసలైన సాక్ష్యం, రాహుల్‌ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే సాక్ష్యం అని రాజ్ అంటాడు.
కుయిలి మరణం వెనుక రంజిత్ కుట్ర
నువ్వు తోస్తేనే చనిపోయినట్లు కుయిలి భర్త రంజిత్ గాడి దగ్గర సాక్ష్యం ఉంది. వాడు నాకు ఫోన్ చేసి 2 కోట్లు ఇస్తే ఆ వీడియోను కోర్టులో సబ్‌మిట్ చేయను అని చెబుతున్నాడు అని అంటుంది రుద్రాణి. దానికి రాహుల్ షాక్ అవుతాడు. ఏదోటి చేయి మమ్మీ అని రాహుల్ అంటాడు. ఎలాగరా నిన్ను బయటకు తీసుకొచ్చేది అని రుద్రాణి అంటుంటే నేను అంటూ రంజిత్ ఎంట్రీ ఇస్తాడు.
నువ్వు ఎవడ్రా అని రుద్రాణి అంటే.. వాడే కుయిలి భర్త రంజిత్ అని రాహుల్ చెబుతాడు. మరి మనం డీల్ మాట్లాడుకుందామా అని రుద్రాణిని బయటకు రమ్మంటాడు రంజిత్. కుయిలిని రాహుల్ కొట్టడం, దాంతో కుయిలి కిందపడిపోవడం చూపించి ఇది చాలుగా నీ కొడుకు జైలుకెళ్లడానికి అని రంజిత్ ఆ వీడియోతో రుద్రాణిని ఏమారుస్తాడు.
రాజ్, కావ్యకు దొరికిన అసలు సాక్ష్యం రాహుల్‌ను నిర్దోషిగా నిరూపిస్తుందని స్పష్టమైంది. రంజిత్ మోసం బయటపడటంతో రుద్రాణి, రాహుల్ షాక్‌లో ఉన్నారు. ఈ కొత్త ట్విస్ట్ బ్రహ్మముడి కథనానికి మరింత ఆసక్తిని పెంచనుంది.

