|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సెప్టెంబర్ 17 ఎపిసోడ్: కూతురికి డ్రెస్ తీసుకొచ్చిన రాజ్.. నిజం తెలిసి గుండె బద్ధలు.. అప్పు చెప్పలేకపోయినా..

Published: 16-09-2025, 9:47 PM
బ్రహ్మముడి సెప్టెంబర్ 17 ఎపిసోడ్: కూతురికి డ్రెస్ తీసుకొచ్చిన రాజ్.. నిజం తెలిసి గుండె బద్ధలు.. అప్పు చెప్పలేకపోయినా..

బ్రహ్మముడి సీరియల్ 828వ ఎపిసోడ్‌లో, రేవతి రాకతో దుగ్గిరాల కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ, అప్పు ఒక కీలక విషయాన్ని దాచి ఉంచుతుంది. కావ్యకు నిజం చెప్పే ప్రయత్నం, మరియు రాజ్‌కు నిజం తెలియడం ఈ ఎపిసోడ్‌లో చూడవచ్చు.

Key Points

1

రేవతి రాకతో దుగ్గిరాల ఇంట్లో సంతోషం పెరిగింది.

2

రాజ్ కూతురికి డ్రెస్ తీసుకువచ్చి ఆనందపడుతున్నాడు.

4

నిజం తెలిసి రాజ్ ఎమోషనల్ అవుతాడు.

రేవతి రాకతో దుగ్గిరాల ఇంట్లో సంతోష వాతావరణం

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 828వ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగిపోయింది. రేవతి వచ్చిందన్న సంతోషంలో ఉన్న దుగ్గిరాల కుటుంబంలో కావ్య గురించి నిజం చెప్పలేక అప్పు సతమతమవుతుంది. కానీ కల్యాణ్ ధైర్యం తెచ్చుకొని రాజ్ కు అసలు విషయం చెప్పడంతో అతని గుండె ముక్కలవుతుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ అప్పు, కల్యాణ్.. కావ్యకు ఈ నిజం ఎలా చెప్పాలా అని బాధపడుతున్న సీన్ తో మొదలవుతుంది. అప్పుడే డాక్టర్ ఆమెకు ఫోన్ చేస్తుంది. ఇంకా కావ్యకు నిజం చెప్పారా లేదా అని అడుగుతుంది. ఇవాళ పండగ కదా.. అందరూ సంతోషంగా ఉన్నారు.. తర్వాత చెబుతానని అప్పూ అనడంతో డాక్టర్ కోప్పడుతుంది.

పండగ పోతే మళ్లీ వస్తుంది ప్రాణం పోతే రాదు.. వెంటనే కావ్య కు నిజం చెప్పేయమని స్పష్టంగా చెబుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక అప్పూ ఏడుస్తుంటే.. తాను నిజం చెబుతానని కల్యాణ్ అంటాడు. సరే అని ఇద్దరూ వెళ్తారు.

రేవతి రాకతో దుగ్గిరాల ఇంట్లో సంతోషం

అటు రేవతి రాకపోతే దుగ్గిరాల ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. హాల్లో కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటారు. రేవతి అందరికీ స్వీట్లు తీసుకొస్తుంది. రేవతి రాకతో ఇంటికి కళ వచ్చిందని అనుకుంటారు. రుద్రాణి మాత్రం అదోలా ఉండటంతో నువ్వు సంతోషంగా లేవా అని అపర్ణ అడుగుతుంది. అందరి కంటే నేనే సంతోషంగా ఉన్నానని రుద్రాణి అంటుంది.

అన్నీ అబద్ధాలే చెబుతావా అంటూ ప్రకాశం ఆటపట్టిస్తాడు. దీంతో స్వరాజ్ మరోసారి రుబ్బురోలు ఆంటీ కాదు.. అబద్ధాల ఆంటీ అని కొత్త పేరు పెడతాడు. అతన్ని కొట్టడానికి వస్తే అమ్మమ్మ అపర్ణ దగ్గరికి వెళ్తాడు. స్వరాజ్ తో అందరూ కలిసి సరదాగా ఆడుకుంటూ ఉంటారు.

కావ్యకు నిజం చెప్పే ప్రయత్నంలో అప్పు, కల్యాణ్

ఆ తర్వాత అతడు రాజ్ ఒళ్లో కూర్చొని స్వీట్ తింటాడు. ఇక నుంచి నిన్ను మామయ్యే అని పిలుస్తానని అంటాడు. మీ అమ్మకు మా అమ్మ లైన్ క్లియర్ చేసింది కాబట్టి నీకు లైసెన్స్ వచ్చినట్లే అని రాజ్ అంటాడు. ఆ తర్వాత అతనికి ముద్దిస్తాడు. అది ఇందిరా దేవి స్పందిస్తూ.. నీ అక్క కొడుకునే ఇలా చూసుకుంటే..

రేపు నీకు బిడ్డ పుడితే ఇంకెలా చూసుకుంటావో అని అంటుంది. తనకు కూతురే పుడుతుందని, ఆమెనే కాదు తన భార్యను కూడా అడుగు కింద పెట్టకుండా చూసుకుంటానని రాజ్ ఎమోషనల్ అవుతాడు. కావ్యకు నిజం చెప్పడానికి వచ్చిన అప్పు, కల్యాణ్ దూరం నుంచే రాజ్ ఆనందాన్ని చూసి మరింత బాధపడతారు.

ఆ తర్వాత అప్పు, కల్యాణ్ అక్కడికి వస్తారు. అప్పుని చూసిన కావ్య ఆమె దగ్గరికి వెళ్లి మీ బావ నాకు కూతురు పుడుతుందని అంటున్నారు.. మరి కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా అని అడుగుతుంది. అప్పుడు అప్పు నీకు ఎవరు పుట్టరక్కా అని చెబుతుంది. అలా పుడితే నీ ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరిస్తుంది. అది విని కావ్య ఎమోషనలైపోయి కళ్లు తిరిగి పడిపోతుంది.

తాను నిజం చెబితే ఇదంతా జరుగుతుందని ఊహించుకున్న అప్పు ఆమెకు నిజం చెప్పలేకపోతుంది. వెంటనే కావ్యను హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావని కావ్య అడిగినా చెప్పదు. రేవతిని ఇంటికి తీసుకొచ్చామని కావ్యకు అప్పు ఇలా థ్యాంక్స్ చెబుతున్నట్లుంది అని రాజ్ అంటాడు.

నిజాన్ని రాజ్‌కు చెబుదామన్న కల్యాణ్

రాజ్‌కు నిజం తెలియడంతో ఎమోషనల్ సన్నివేశాలు

ఆ తర్వాత గదిలోకి వెళ్లి అప్పు ఏడుస్తూ కూర్చొంటుంది. నిజం చెబుతానని వెళ్లి ఎందుకు చెప్పలేదని అప్పుని కల్యాణ్ అడుగుతాడు. వాళ్లు పుట్టబోయే బిడ్డ కోసం అంతగా కలలు కంటుంటే ఎలా చెప్పగలను.. ఆ విషయం తెలిస్తే అక్క గుండె ఒక్క క్షణం ఆగిపోతుందేమో అని అనిపించి ఆగిపోయానని అప్పూ చెబుతుంది.

దీంతో ఈ విషయం వదినకు కాదు అన్నయ్యకు చెబుదామని అంటాడు. తానే ఆ విషయం చెబుతానంటాడు. బావ అయినా తట్టుకుంటాడా అని అప్పు అడితే.. ఆయన తట్టుకుంటాడని, ఆ విషయం వదినకు కూడా అన్నయ్యే చెబుతాడని అంటాడు.

పిల్లలకు డ్రెస్ తీసుకొచ్చిన రాజ్

ఇదే విషయం రాజ్ కు చెప్పడానికి కల్యాణ్ వెళ్తుండగా అతడే ఎదురుపడతాడు. రాజ్ ఎంతో ఉత్సాహంగా రెండు డ్రెస్సులు తీసుకొని వస్తాడు. ఒకటి తన కూతురికి, మరొకటి నీ కూతురికి తెచ్చానంటూ కల్యాణ్ కు డ్రెస్ ఇస్తాడు. బయటకు వెళ్లినప్పుడు ఈ డ్రెస్ చాలా బాగా అనిపించింది.. నా కూతురికే తెచ్చుకుంటే.. నువ్వు బాధపడతావని నీ పుట్టబోయే కూతురికి కూడా తీసుకొచ్చానని రాజ్ ఎంతో మురిపెంగా చెబుతాడు. అది చూసి కల్యాణ్ మరింత బాధపడతాడు.

నీకో విషయం చెప్పాలి.. బయటకు వెళ్దామని అతన్ని తీసుకెళ్తాడు. నేరుగా నిజం చెప్పకుండా అప్పూకి ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పారు.. నువ్వు అయితే ఏం చేస్తావు అని రాజ్ ను అడుగుతాడు. తాను ఎలాగోలా ఆమెకు నిజం చెబుతానని రాజ్ అంటాడు. అయితే వెంటనే చెప్పెయ్.. ఈ ప్రమాదం అప్పూకి కాదు వదినకి అని కల్యాణ్ అనడంతో రాజ్ గుండె ముక్కలవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరగా, కావ్యకు నిజం చెప్పే విషయంలో అప్పు, కల్యాణ్ ఎదుర్కొన్న ఇబ్బందులు మరియు రాజ్‌కు నిజం తెలియడంతో ఆయన ఎమోషనల్ అయిన విధానం ఈ ఎపిసోడ్‌ను ఆకట్టుకునేలా చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.