
📌 Key Points
- నందుకు రేఖ వాతలు: ఇంట్లోంచి పారిపోయిన నందు!
- కానిస్టేబుల్ దత్త ఆశ్రయం: నందుకు ఊరట లభించింది.
- రుద్రాణి ఫొటో పగలగొట్టిన నందు: షాకింగ్ ట్విస్ట్!
- భ్రమరాంబ కూతురు స్వాతి బొమ్మలు ఇచ్చిన ఇందు!
బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నందు ఇంటి నుండి పారిపోవడం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే!
నందు పారిపోవడానికి కారణం ఏంటి?
Brahmamudi Serial March 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 3వ తేది ఎపిసోడ్‌లో ఇందు, నందుకు భ్రమరాంబ కూతురు స్వాతి బొమ్మలు ఇస్తుంది. ఐశ్వర్య వచ్చి గొడవ పెట్టుకుంటుంది. చికెన్ తిన్నందుకు నందుకు వాతలు పెడుతుంది రేఖ. దాంతో ఇంట్లోంచి పారిపోతుంది నందు. పాపను కానిస్టేబుల్ దత్త చేరదీస్తాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ పెళ్లి చేసుకుని కొత్త ఫ్యామిలీతో అపర్ణ ఇంట్లోకి అపర్ణ పిల్లలకు రేఖ వదిన అన్నం కూడా ఉంచదు. ఆస్తి ఎవరి పేరు మీద లేదు. నెల నెల వచ్చే డబ్బులతోనే ఇల్లు గడవాలి. చిన్న పిల్ల రేఖ మాత్రం ఎన్నని చూసుకుంటుంది. కుమారి ఇంట్లో ఏది వండాలో నేను మాత్రమే డిసైడ్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది రేఖ వదిన.
ఇంతలో ఐశ్వర్య వచ్చి అవి నావని లాక్కుంటుంది. ఇందు, నందులను పనివాళ్లను, ఈ కోటకు తానే మహరాణి అని మాటలు అంటుంది. నందు తనతో గొడవ పడతారు. ఇంతలో భ్రమరాంబ వచ్చి నందును తోసేస్తుంది. దాంతో అపర్ణ వచ్చి తిడుతుంది. ఇంతలో రేఖ వచ్చి ఇప్పుడు నోరు మూసుకుని ఉండాల్సింది నువ్వని, నీ మనవరాళ్లు పనివాళ్లలాగే ఉండాలని అంటుంది.
కానిస్టేబుల్ దత్త ఆశ్రయం వెనుక కథేమిటి?
కనీసం మిమ్మల్ని బతకనిస్తున్నాను. వారికి ఎంతలో ఉండాలో హద్దులు చూపించు అని తిట్టేసి వెళ్తుంది రేఖ. మరోవైపు తమ్ముడుతో రాజు ఆడుకుంటారు. బాలు పక్కకు వెళ్లడంతో తమ్ముడు వెళ్తాడు. అప్పుడే కారు వస్తుంది. కారు గుద్దకుండా రాజు తమ్ముడిని కాపాడుతాడు. కానీ, రాజుకు దెబ్బ తగులుతుంది. అదంతా చూసిన తల్లిదండ్రులు ఎందుకురా ఇలా చేశావని అడుగుతారు.
డైనింగ్ టేబుల్‌పై ఉన్న చికెన్ తీసుకుని తినబోతుంది నందు. అది చూసిన రేఖ ఇంకోసారి నువ్వు ఇలాంటిది చేయకూడదు అంటే శిక్షించాలి అని నందు చేయిపై పెనంతో వాత పెడుతుంది. అది చూసి అపర్ణ తిడుతుంది. ఇంకోసారి ఇలా చేయకూడదని చెప్పు అని వెళ్లిపోతుంది రేఖ. తర్వాత రాత్రి నన్ను క్షమించు అక్కా. నేను బాగా చదువుకుని పెద్దయ్యాక వచ్చి రేఖ అంటీని బాగా కొట్టి మిమ్మల్ని తీసుకెళ్తాను అని అక్కకు ముద్దు పెట్టి ఇంట్లోంచి పారిపోతుంది నందు .
మరుసటి రోజు ఉదయానికి నందు కనిపించకపోవడంతో అపర్ణ కంగారుపడుతుంది. మరోవైపు ఒకరి బ్యాగ్‌లో బన్ ఉంటే నందు తీసుకుంటుంది. అది చూసి దొంగతనం చేస్తావా అని తిడుతుంది ఆవిడ. ఇంతలో ఓ తాగుబోతు వచ్చి ఏదో ఆకలికి తీసుకుంది అని చెబుతాడు. నేను హెడ్ కానిస్టేబుల్ వీన్ దత్త అని అంటాడు. దాంతో ఆవిడ పారిపోతుంది.
రుద్రాణికి ఎదురుదెబ్బ తగిలే సీన్ అదిరింది!
తర్వాత తనకోసం చేసిన పాయసం కొంచెం నీకోసం ఉంచానని ఇందుకు ఇస్తుంది స్వాతి. నందు వెళ్లిపోయిందిగా తినాలని లేదు అని ఇందు అంటుంది. ఆ చెల్లి ఇంటికి వచ్చేంతవరకు ఈ చెల్లి నీకు తోడుగా ఉంటుంది అని స్వాతి అంటుంది. మరోవైపు ఉదయం నందు కానిస్టేబుల్ దత్త ఇంటి ముందు పడుకుని ఉంటుంది.
అది చూసి పాప ఇక్కడ ఎందుకు పడుకున్నావ్, మీ వాళ్ల దగ్గరికి వెళ్లమని అంటాడు కానిస్టేబుల్ దత్త. నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పను. నేను బాగా చదువుకుని పోలీస్ అవుతా. ఆ రేఖ ఆంటీ బాక్సు బద్దలు కొడతా. మీరు ఉండమంటే ఇక్కడే ఉంటా. లేకపోతే వెళ్లిపోతా. కానీ, నేను ఉండేది ఎక్కడో చెప్పను అని నందు మొండిగా మాట్లాడుతుంది.
ఇది అచ్చం వాళ్ల అమ్మలాగే ఉంది. ఎదుటివారికి కష్టం వస్తే ఊరుకోదు అని అపర్ణ అనుకుంటుంది. అలా ముగ్గులేస్తూ ఇందు పెద్దది అవుతుంది. రుద్రాణి ఫొటోను ఇందు తుడుస్తుంటే అది కిందపడుతుంది. రుద్రాణి ఫొటోను ఇందు పగలగొట్టిందని రేఖ వచ్చి కొట్టబోతుంది. అపర్ణ వచ్చి అడ్డుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ మరింత ఉత్కంఠగా మారుతోంది. నందు జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


