|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీ నందు: ‘నరకం చూశా, దేశం విడిచిపోవాలనుకున్నా’.. నందు సంచలన వ్యాఖ్యలు!

Published: 25-12-2025, 8:37 AM
శ్రీ నందు: 'నరకం చూశా, దేశం విడిచిపోవాలనుకున్నా'.. నందు సంచలన వ్యాఖ్యలు!
  • 19 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నా సక్సెస్ అందుకోలేకపోయానని నందు ఆవేదన.
  • తోటి నటులు సక్సెస్ సాధించినా తాను వెనుకబడిపోవడానికి కారణం తానేనని వెల్లడి.
  • తప్పుడు విషయాల్లో ఇరికించినప్పుడు నరకం అనుభవించి, దేశం విడిచిపోవాలని నిర్ణయం.
  • సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే బలి పశువులను చేస్తారని నందు సంచలన వ్యాఖ్యలు.

నటుడు శ్రీ నందు తన సినీ ప్రయాణంలో ఎదురైన కష్టాలు, చేదు అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఒకానొక సమయంలో దేశం విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలో విడుదల కానున్న ‘సైక్ సిద్ధార్థ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాలు వెల్లడించారు.

సినీ కెరీర్‌లో నందు పడిన కష్టాలు

Sree nandu: శ్రీ నందు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన హీరోగా సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి. ఇప్పటికి ఇండస్ట్రీలో సక్సెస్ కోసం సరికొత్త ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నందు(Nandu) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 19 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు లేవని చెప్పాలి. ఇలా నటుడుగా సక్సెస్ కానీ నందు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇక త్వరలోనే నందు హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ్(Pscy siddhartha) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల కావాల్సి ఉండగా బాలకృష్ణ అఖండ 2 విడుదలవుతున్న నేపథ్యంలో జనవరి ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది..

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నందు మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తనతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియదర్శి విజయ్ దేవరకొండ సిద్దు జొన్నలగడ్డ లాంటి వారందరూ కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు కానీ నేను మాత్రం సక్సెస్ అందుకోలేకపోయానని అందుకు కారణం తానేనని తెలిపారు. ఒకప్పుడు డబ్బుల కోసం సినిమాలు చేశాను. ఇలా చేయటం వల్లే ఇప్పటికి నాకు సక్సెస్ రాలేదని నందు ఎమోషనల్ అయ్యారు.

‘నరకం చూశా.. దేశం వదిలేద్దామనుకున్నా’: నందు ఆవేదన

ఒకానొక సమయంలో తనకు సంబంధం లేని విషయాలలో తనను ఇరికించినప్పుడు చాలా బాధపడ్డానని ఆ సమయంలో తాను చాలా కుమిలిపోయానని తెలిపారు. దాదాపు రెండు వారాలపాటు నరకం అనుభవించాను, ఆ సమయంలోనే ఇండియా వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నానని నందు తెలిపారు. ఇక గీత ఇక్కడ స్టార్ సింగర్ అయినప్పటికీ తనకోసం తన జీవితాన్ని వదులుకొని మనం వేరే దేశం వెళ్లి ఏదైనా హోటల్లో పని చేసుకుందాం అంటూ ధైర్యం చెప్పింది.

బ్యాక్ గ్రౌండ్ లేకపోతే బల్లి పశువును చేస్తారు..

నందు కొత్త సినిమా: ‘సైక్ సిద్ధార్థ్’ విశేషాలు

ఇప్పటికీ ఆ క్షణాలను తలుచుకుంటే కన్నీళ్లు లాగవు అంటూ నందు ఎమోషనల్ అయ్యారు . బహుశా నేను సినిమా ఇండస్ట్రీలో లేకపోతే నా గురించి అలాంటి రూమర్స్ వచ్చేవి కాదేమో, ఇక్కడ సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లను కచ్చితంగా బలి పశువులను చేస్తారని నందు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఈయన ఇండస్ట్రీలో సక్సెస్ కోసం పోరాటం చేస్తున్నారు . మరి జనవరి ఒకటో తేదీ విడుదల కాబోతున్న సైక్ సిద్ధార్థ్ సినిమా అయినా నందుకి హిట్ అందించేనా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్ చూస్తుంటే మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో నందు సిద్ధార్థ రెడ్డి అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.

ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న నందు సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘సైక్ సిద్ధార్థ్’ సినిమా నందు కెరీర్‌కు ఎలాంటి మలుపునిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.