|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తలా అజిత్ ధైర్యం! తల్లి మరణించినా.. రేసింగ్ ట్రాక్‌పై అడుగుపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచిన వైనం!

Published: 05-06-2026, 4:45 PM
తలా అజిత్ ధైర్యం! తల్లి మరణించినా.. రేసింగ్ ట్రాక్‌పై అడుగుపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచిన వైనం!
  • అజిత్ కుమార్ తల్లి మోహిని మణి మే 30న కన్నుమూశారు.
  • తల్లి మరణించిన ఆరు రోజులకే అజిత్ రేసింగ్ ట్రాక్‌పై కనిపించారు.
  • “జీవితం సాగిపోవాలి” అంటూ అజిత్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అయింది.
  • తమిళనాడు సీఎం విజయ్ సహా పలువురు ప్రముఖులు అజిత్‌ను పరామర్శించారు.

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన విషాదాన్ని దాటుకొని వృత్తి పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. తల్లి మరణించిన కొద్ది రోజులకే రేసింగ్ ట్రాక్‌పై అడుగుపెట్టి, తన మానసిక ధైర్యాన్ని, కమిట్‌మెంట్‌ను ప్రదర్శించారు. ఈ ఘటన అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

అజిత్ తల్లి మరణం: విషాదంలో కోలీవుడ్

Ajith Racing: కోలీవుడ్ ఇండస్ట్రీలో  ‘తలా’గా పిలవబడే అజిత్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ఎంతటి క్రమశిక్షణతో ఉంటారో, వృత్తి పట్ల ఆయనకున్నకమిట్ మెంట్  ఎలాంటిదో మరోసారి ప్రూవ్ అయింది.తన తల్లి ఈ మధ్యే చనిపోయినా ఆ బాధని అణుచుకుంటూ మళ్ళీ అజిత్ మళ్లీ రేసింగ్ ట్రాక్‌పై అడుగుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

విషయంలోకి వెళ్తే ..గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో, అనారోగ్యంతో బాధపడుతున్న అజిత్ కుమార్ తల్లి మోహిని మణి (89) మే 30వ తేదీ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. నిద్రలోనే ఆమె ప్రశాంతంగా ప్రాణాలు విడిచినట్లు అజిత్ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. తల్లి మరణంతో విషాదంలో మునిగిపోయిన   అజిత్, ఆ విషాదం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే.. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే అంటే జూన్ 5వ తేదీన చెన్నైలోని రేసింగ్ ట్రాక్‌పై ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యానికి, గురిచేస్తోంది. అజిత్ కుమార్ రేసింగ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ.. బరువెక్కిన గుండెతోనే మళ్లీ పనిలోకి దిగానని, జీవితం సాగిపోవక తప్పదంటూ పెట్టిన ఎమోషనల్ క్యాప్షన్ అభిమానుల మనసులను పిండేస్తోంది.

రేసింగ్ ట్రాక్‌పై అజిత్: ధైర్యానికి ప్రతీక

అభిమానుల మనసులను గెలిచిన ‘తలా’

అలాగే ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌తో పాటు కోలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటీనటులు, దర్శకులు అజిత్ ఇంటికి వెళ్లి తమ సంతాపాన్ని తెలియజేశారు.ఇక దిల్ రాజు ప్రొడక్షన్స్ సహా టాలీవుడ్ ప్రముఖులు సైతం అజిత్ మాతృమూర్తి మృతికి సోషల్ మీడియా ద్వారా తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.ఇన్నేళ్లపాటు తన తల్లిని ఎంతో శ్రద్ధగా చూసుకున్న వైద్య బృందానికి, తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అజిత్ కుటుంబం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

అజిత్ కుమార్ చూపిన ఈ అసాధారణ ధైర్యం, వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత ఎందరికో స్ఫూర్తినిచ్చింది. వ్యక్తిగత బాధను పక్కనపెట్టి, తన బాధ్యతలను నిర్వర్తించిన తీరు ‘తలా’ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.