
బ్రహ్మముడి సీరియల్‌లోని సెప్టెంబర్ 24 ఎపిసోడ్‌లో, కావ్య తన బిడ్డను ప్రాణం పణంగా పెట్టినయినా కాపాడుకుంటానని చెప్పడంతో ఎమోషనల్ సీన్స్ అలరించాయి. రాజ్ ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు.
Key Points
కావ్య తన బిడ్డను ఏ ధరకైనా కాపాడుకుంటానని ప్రమాణం చేసింది.
రాజ్ కావ్యకు తన ప్రేమను, మద్దతును చూపించాడు.
అపర్ణ కావ్యను హాస్పిటల్‌కు వెళ్లనివ్వలేదు, కానీ రాజ్ కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్ళాడు.
సుభాష్ మరియు ప్రకాశ్ ఆఫీసు పనులను చూసుకోవడానికి వెళ్లారు.
కావ్య మరియు రాజ్ మధ్య సంభాషణ
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 834వ ఎపిసోడ్ రాజ్, కావ్య చుట్టూ తిరిగింది. ఏం జరిగినా తనను వదిలి పెట్టి వెళ్లిపోనని కావ్య దగ్గర రాజ్ మాట తీసుకోవడం, అటు అపర్ణ వద్దంటున్నా అలాగే హాస్పిటల్ కు వెళ్లడం, అక్కడ రాజ్ డాక్టర్ కాళ్లు పట్టుకోవడానికి వెళ్లడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ సాగిపోయింది.
బిడ్డను కాపాడుకుంటానన్న కావ్య..
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 24) ఎపిసోడ్ కావ్యతో రాజ్ మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకోని బిడ్డపై మరీ అంత ప్రేమ పెంచుకోవడం అవసరమా అని కావ్యను రాజ్ అడుగుతాడు. ఈ మధ్య ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్ క్యారీ అవుతున్నాయి కదా అంటాడు. అంతా మంచే జరుగుతుంటే ఎందుకు అలాంటి అపశకునం మాటలు మాట్లాడతారని అంటుంది.
అలాంటిదేమీ జరగదని, తన ప్రాణం పణంగా పెట్టి అయినా బిడ్డను కాపాడతానని కావ్య అనడంతో రాజ్ మరింత ఎమోషనల్ అవుతాడు. ఇప్పటికే నిన్ను ఎన్నోసార్లు నా మూర్ఖత్వంతో వేధించాను.. ఎప్పుడూ నన్ను వదిలి పెట్టి వెళ్లలేదు.. ఇక మీదట అలాంటి తప్పు జరిగినా వెళ్లనని మాటివ్వు అని రాజ్ అంటాడు. అతని ప్రవర్తన వింతగా అనిపించినా కూడా సరే అంటూ ఏం జరిగినా మీతోనే ఉంటానని కావ్య అతనికి మాటిస్తుంది. తప్పులను క్షమిస్తానని అంటుంది.
ఆఫీసుకు బయలుదేరిన సుభాష్, ప్రకాశ్..
అపర్ణ యొక్క వ్యతిరేకత
అటు రాజ్ ఆఫీసుకు వెళ్లకపోవడంతో ఇక సుభాష్, ప్రకాశే ఆ పనులు చూసుకోవడానికి సూటు, బూటు వేసుకొని బయలుదేరుతారు. వాళ్లను చూసి ఇందిరా దేవి మురిసిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి మరి తన కొడుకు సంగతేంటని అడుగుతుంది.
నీ కొడుక్కి అంత అర్హత లేదులే అత్త అని స్వప్న కూడా అనడంతో రుద్రాణికి మరింత మండుతుంది. ఆమెను తిట్టబోతుండగా.. రాహుల్ వచ్చి అడ్డుకుంటాడు. ఆమె చెప్పింది నిజమే అని, తాను ఆ హోదాలో కూర్చోవడానికి అర్హత లేదని అంటాడు. రాహుల్ అర్థం చేసుకున్నాడు.. రుద్రాణికి ఎప్పటికి అర్థమవుతుందో అని ఇందిర అనగానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అపర్ణ వద్దంటున్నా హాస్పిటల్ కు..
హారతి తీసుకొస్తానని అపర్ణ వెళ్తుంది. అప్పుడే కావ్య , రాజ్ బయటకు వస్తారు. మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగితే.. కావ్యను హాస్పిటల్ కు తీసుకెళ్తున్నానని రాజ్ చెబుతాడు. ఇప్పుడేం అవసరం లేదు కదా అని సుభాష్ అంటే.. బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా అని రాజ్ కవర్ చేస్తాడు.
బిడ్డ, భార్యపై రాజ్ చూపిస్తున్న ప్రేమ చూసి అపర్ణ అతనిపై సెటైర్ వేస్తుంది. సరే హారతి తీసుకోండి అని అందరికీ ఇస్తుంది. కావ్య తీసుకుంటుండగా హారతి ఆరిపోవడంతో అపర్ణ భయపడుతూ హాస్పిటల్ కు వెళ్లొద్దని, ఇది అపశకునం అని అంటుంది. కానీ రాజ్ మాత్రం ఇంకా ఏ కాలంలో ఉన్నారు.. గాలి వచ్చి హారతి ఆరిపోయింది అని కావ్యను తీసుకొని హాస్పిటల్ కు వెళ్తాడు.
హాస్పిటల్‌కు వెళ్ళడం
కల్యాణ్‌ను నిలదీసిన అప్పు
అది చూసి కల్యాణ్, అప్పు ఆందోళన చెందుతారు. తర్వాత గదిలోకి వెళ్లి బాధపడుతున్న కల్యాణ్ దగ్గరికి అప్పు వెళ్లి అతన్ని నిలదీస్తుంది. హాస్పిటల్ కు అనగానే అక్క అలా నవ్వుతూ వెళ్లిందేంటి.. బావగారు ఆమెకు నిజం చెప్పారా లేదా అని అడుగుతుంది. తాను నిజం చెప్పమని చెప్పినా అన్నయ్య వినలేదని, ఆమెకు నిజం తెలియకుండా అబార్షన్ చేయిస్తానని చెప్పాడని కల్యాణ్ అంటాడు. అది విని అప్పు షాక్ తింటుంది. ఓ సమస్యను పరిష్కరించమంటే మరో సమస్య తీసుకొచ్చారు.. ఇప్పుడు హాస్పిటల్లో అక్క ఏం గొడవ చేస్తుందో ఏమో అంటూ ఆందోళన చెందుతుంది.
కావ్యకు ముద్దు పెట్టి డాక్టర్ దగ్గరికి రాజ్
అటు రాజ్, కావ్య హాస్పిటల్ కు వెళ్తారు. కావ్యను బయటే కూర్చోమని, తాను డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతానని రాజ్ చెబుతాడు. తాను ఎందుకు రావొద్దు.. ఏదైనా ఉంటే తన ముందే మాట్లాడొచ్చు కదా.. తండ్రిగా మీకు ఎంత బాధ్యత ఉందో తనకూ అంతే ఉందని కావ్య సరదాగా అతనితో వాదిస్తుంది. రాజ్ ఆమెకు సర్ది చెబుతాడు.
ఆ తర్వాత ఎమోషనల్ అయిపోయి కావ్యకు నుదుటిపై ముద్దు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. కావ్యకు అసలు విషయం తెలిస్తే తట్టుకోలేదని, ఆమెకు నిజం చెప్పకుండా ఆపరేషన్ చేయాలని అడుగుతాడు. కానీ డాక్టర్ ఒప్పుకోదు. ఒప్పించి చేయాల్సిందే అని పట్టుబడుతుంది. మీ కాళ్లు పట్టుకుంటానంటూ డాక్టర్ దగ్గరికి రాజ్ వెళ్లగానే కావ్య అది చూస్తుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ కావ్య మరియు రాజ్ మధ్య బలమైన బంధాన్ని చూపిస్తుంది. తన బిడ్డను కాపాడుకోవడానికి కావ్య చేసే ప్రయత్నాలు, రాజ్ యొక్క మద్దతు చూపిస్తుంది.


