|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్‌కు అరుదైన గౌరవం.. యూనివర్సిటీలో ఏకంగా కోర్సు!

Published: 23-06-2025, 10:48 AM
ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్‌కు అరుదైన గౌరవం.. యూనివర్సిటీలో ఏకంగా కోర్సు!

ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని ఒక యూనివర్సిటీ ఆయన పేరు మీద ప్రత్యేక కోర్సు ప్రారంభించనుంది. ఈ విషయం తాజాగా వెల్లడైంది.

Key Points

1

ప్రముఖ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ పేరు మీద కెనడాలోని ఒక యూనివర్సిటీ కోర్సు ప్రారంభించింది.

2

టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో 'బోర్న్ టు షైన్' పేరుతో కోర్సు ప్రారంభం.

4

అతని 'మూన్‌చైల్డ్ ఎరా', 'గోట్' లాంటి ఆల్బమ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి.

దిల్జీత్ దోసాంజ్‌కు అరుదైన గౌరవం

ప్రముఖ సింగర్‌ దిల్జీత్‌ దోసాంజ్‌కు అరుదైన ఘనత దక్కింది. ఆయన పేరుపై ఏకంగా కోర్సు ప్రారంభించనున్నట్లు కెనడాకు చెందిన యూనవర్సిటీ ప్రకటించింది. ఈ పంజాబ్‌ గాయకుడిపై ఏకంగా కోర్సును అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్న్ టు షైన్ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన  ది క్రియేటివ్ స్కూల్‌లో వచ్చే ఏడాది నుంచి అతని పేరిట కోర్సు ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన సమ్మిట్‌లో ఈ విషయాన్ని ‍ప్రకటించారు. కాగా.. పంజాబ్‌కు చెందిన దిల్జీత్ దోసాంజ్ ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గత ఇరవై ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై తన గాత్రంతో అభిమానులను అలరించారు. ‘మూన్‌చైల్డ్ ఎరా’, ‘గోట్’ లాంటి మ్యూజిక్ ఆల్బమ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ‘మూన్‌చైల్డ్ ఎరా’ కెనడియన్ ఆల్బమ్‌ల జాబితాలో ఏకంగా 32వ స్థానానికి చేరుకుంది. ఒక భారతీయ కళాకారుడిగా అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఆయనపై కోర్సు అందించడం అతని ప్రతిభకు నిదర్శనమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

దిల్జీత్ దోసాంజ్ తన నటనా జీవితంలో అద్భుతంగా రాణించారు. ‘జాట్ అండ్ జూలియట్’, ‘పంజాబ్ 1984’, ‘సజ్జన్ సింగ్ రంగ్‌రూట్’ వంటి అనేక పంజాబీ సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. అలాగే ‘ఉడ్తా పంజాబ్’ లాంటి బాలీవుడ్ మూవీలోనూ కనిపించారు. గతేడాది  ‘చమ్‌కిలా’ అనే చిత్రంలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా 2023లో అతను తన ‘దిల్-లుమినాటి’ పర్యటనతో ఉత్తర అమెరికాలో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కెనడాలో జరిగిన అతిపెద్ద పంజాబీ కచేరీలతో పేరు సంపాదించారు.

కెనడా యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సు

సంగీత, నటన ప్రతిభకు గుర్తు

దిల్జీత్ దోసాంజ్ యొక్క అద్భుతమైన సంగీత, నటన ప్రతిభకు ఈ గౌరవం నిదర్శనం. భవిష్యత్ తరాలకు ఆయన ప్రతిభను పరిచయం చేసే ఈ కోర్సు చాలా ప్రత్యేకమైనది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.