
బ్రహ్మముడి సీరియల్ 815వ ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంట్లో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజ్ ప్రేమ, అపర్ణ కష్టాలు, ధాన్యానికి అడ్డంగా దొరికిన ప్రకాశ్.. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Key Points
రాజ్ చీర కట్టుకున్నాడు!
ధాన్యానికి ప్రకాశ్ అడ్డంగా దొరికిపోయాడు.
కావ్య, రాజ్ ప్రేమతో అపర్ణ ఇబ్బందులు పెరిగాయి.
రాజ్ చర్యల వల్ల కావ్య, అపర్ణల జీవితంలో మార్పులు
బ్రహ్మముడి ఈరోజు అంటే 815వ ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇళ్లు మరోసారి సంతోషాలతో నిండిపోయింది. కావ్యపై రాజ్ ప్రేమ, దాని వల్ల అపర్ణకు కొత్త కష్టాలు రావడం, అటు భార్య ధాన్యం దగ్గర ప్రకాశ్ అడ్డంగా ఇరుక్కుపోవడంలాంటివి ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
తిట్టుకుంటూ పైకి వెళ్లిన అపర్ణ, సుభాష్
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ రాజ్, కల్యాణ్ తమ గదులు మార్చుకునే సీన్ తో మొదలవుతుంది. నువ్వు చెప్పేది కరెక్ట్ అంటూ రాజ్ ను సమర్థించి మెల్లగా జారుకుంటుంది ఇందిరా దేవి. తనను 9 నెలల కడుపులో మోసి కన్నావు కదా.. ఇప్పుడు మరో 9 నెలలు తన బిడ్డ కోసం ఈ మాత్రం చేయలేవా అంటూ తల్లిని అడుగుతాడు రాజ్.
అటు అపర్ణ, సుభాష్, ధాన్యం, ప్రకాశ్ చేసేది లేక కింది నుంచి పైనున్న గదుల్లోకి మారడానికి ఒప్పుకుంటారు. వీడికి గతం గుర్తుకు రావడం పెద్ద తప్పయినట్లుంది అని ప్రకాశ్ అంటాడు. అటు అపర్ణ కూడా తిట్టుకుంటూ పైనున్న గదిలోకి వెళ్లిపోతుంది.
కింది గదిలోకి షిఫ్ట్ అయిన తర్వాత కావ్య దగ్గరికి వెళ్లిన రాజ్.. చూశావా గంటలో తాను ఎలా మేనేజ్ చేశానో అని అంటాడు. వాళ్లను ఇబ్బంది పెట్టి ఇలా చేయడం ఏం బాగా లేదని కావ్య అంటుంది. వాళ్లు పైకి కిందికి తిరగడానికి ఇబ్బంది పడతారని అంటుంది. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదురదు అని రాజ్ అంటాడు. నువ్వు మెట్లు ఎక్కి దిగితే తనకూ నచ్చడం లేదని స్పష్టం చేస్తాడు.
కావ్యను కాళ్లు కింద పెట్టుకుండా చూసుకుంటానని అంటాడు. కనీసం మంచి నీళ్లు తాగడానికి కూడా వెళ్లనివ్వడు. ఆ నీళ్లు కూడా తానే తీసుకొస్తానని, కాళ్లు కింద పెడితే బాగుండని వార్నింగ్ ఇస్తాడు. ఇదీ మరీ ఓవరాక్షన్ లా ఉందని కావ్య అంటున్నా కూడా రాజ్ పట్టించుకోడు. బిడ్డ పుట్టే వరకూ తానే అన్ని పనులు చేస్తానని అంటాడు.
ధాన్యం, ప్రకాశ్ మధ్య సంఘర్షణ
ఈయన కోపాన్ని, ప్రేమను భరించడం కష్టమే అని కావ్య నవ్వుతూ అనుకుంటుంది. తన కష్టాలు తొలగించిన ఆ భగవంతుడికి కావ్య థ్యాంక్స్ చెప్పుకుంటుంది.
ఇటు అపర్ణ , ధాన్యం ఉదయాన్నే లాన్ లో కూర్చొని తమ కష్టాలు చెప్పుకుంటారు. రాత్రంతా తాను అస్సలు నిద్రపోలేదని ధాన్యలక్ష్మితో అపర్ణ అంటుంది. కొత్త గదిలో అస్సలు నిద్ర పట్టలేదని, రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చిందని అపర్ణ అంటే.. ధాన్యం కూడా తన పరిస్థితి అలాగే ఉందని అంటుంది. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. మమ్మల్ని ఇరికించి మీరు తప్పించుకుంటారా అని అత్తను అపర్ణను నిలదీస్తుంది. దానిని సమయస్ఫూర్తి అంటారు అని ఆమె అంటుంది.
వీళ్ల ప్రెగ్నెన్సీలు మా ప్రాణాల మీదికి వచ్చేలా ఉందని అపర్ణ బాధపడుతుంది. అది విని ఇందిర నవ్వడంతో మా కష్టాలు మీకు నవ్వులాటగా ఉన్నాయా అని అపర్ణ అంటుంది. అయినా ఈ కష్టాలు కొద్దిరోజులే తర్వాత అలవాటైపోతాయని ఇందిర అనడంతో అపర్ణ, ధాన్యం షాక్ తింటారు. అయినా వాళ్లనే భరించాం.. వాళ్ల ఇబ్బందులను భరించలేమా అంటూ వాళ్లు వెళ్లిపోతారు.
ఇటు రాజ్ ను కావ్య నిలదీస్తుంది. ఉదయం 9 గంటలు అవుతున్నా కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు అని నిందిస్తుంది. తొలి రోజు కదా మరచిపోయానని రాజ్ అంటాడు. వెంటనే వెళ్లి కాఫీ తీసుకొస్తానని అంటాడు. బయటకు వెళ్లగానే హాల్లో అపర్ణ, ధాన్యం ఉండటం చూసి కంగారుపడతాడు. అమ్మో వీళ్లు నన్ను కిచెన్ లో చూశారంటే ఇంకా ఏమైనా ఉందా? వీళ్ల కంటపడకుండా వెళ్లాలంటూ తప్పించుకొని కిచెన్ లోకి వెళ్తాడు.
చీర కట్టుకున్న రాజ్.. వాటేసుకున్న ప్రకాశ్
అపర్ణ కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది
కిచెన్ లో కాఫీ పెట్టడానికి వెళ్తూ ఎవరైనా సడెన్ గా వస్తే రిస్క్ అనుకొని అక్కడే ఉన్న చీరను చుట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరూ గుర్తు పట్టలేరంటూ కాఫీ పెడుతుంటాడు. అటు హాల్లో తమ కాఫీ ఇచ్చే వారే లేరా అంటూ అపర్ణ, ధాన్యం బాధపడుతూ ఉండగా.. ప్రకాశ్ వచ్చి తనకూ కాఫీ కావాలని అడుగుతాడు. నువ్వు పెట్టుకోలేవా అని అపర్ణ అనడంతో సరే మీకు కూడా కాఫీ తీసుకొస్తానని కిచెన్ వైపు వెళ్తాడు ప్రకాశ్.
అక్కడ చీర కట్టుకొని కాఫీ పెడుతున్న రాజ్ ను వెనుక నుంచి చూసి తన గర్ల్‌ఫ్రెండ్ శైలజ తనను సర్‌ప్రైజ్ చేయడానికి ఇలా వచ్చిందని ప్రకాశ్ అనుకుంటాడు. వెనుక నుంచి వెళ్లి వాటేసుకుంటాడు.
ధాన్యం దగ్గర అడ్డంగా ఇరుక్కుపోయిన ప్రకాశ్
నన్ను సర్ ప్రైజ్ చేస్తానని చెప్పి ఇలా సడెన్ గా వస్తావా అంటూ రాజ్ ను వదలడు. అప్పుడే ధాన్యం కిచెన్ లోకి వస్తుంది. ప్రకాశ్ ను అలా చూసి కోపంగా పిలుస్తుంది. వెంటనే రాజ్ కూడా తిరగడంతో నువ్వా అని ప్రకాశ్ అడుగుతాడు. ఆ శైలజ ఎవరు అని ప్రకాశ్ ను ధాన్యం నిలదీస్తుంది. అది తర్వాత నువ్వు ఎందుకు చీర కట్టుకున్నావ్ అని రాజ్ ను అడుగుతాడు. కానీ రాజ్ మాత్రం తాను తప్పించుకోవడానికి ప్రకాశ్ ను ఇరికిస్తాడు.
ముందు ఆ శైలజ ఎవరో కనుక్కో పిన్నీ అని చెప్పి వెళ్లిపోతాడు. ప్రకాశ్ కు ధాన్యం క్లాస్ పీకుతుంది. ఇటు కావ్యకు దొంగచాటుగా వెళ్లి కాఫీ ఇస్తాడు రాజ్. ఎవరైనా చూస్తారేమో అన్నట్లుగా అలా ఎందుకు తీసుకొచ్చారు.. భార్యకు సేవలు చేస్తే ఇంట్లో వాళ్లు ఏమైనా అనుకుంటారని భయమా అని కావ్య అంటుంది. అలా ఏమీ లేదు.. అందరినీ పిలిచి నీకోసం కాఫీ తెచ్చానని చెబుతానని చెప్పి రాజ్ బయటకు వెళ్లడానికి రెడీ అవుతాడు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ లో రాజ్ ప్రేమ, అపర్ణ, ధాన్యంల ఇబ్బందులు, ప్రకాశ్ యొక్క అనుకోని రాకతో సిరీయల్ ఆసక్తికరంగా సాగింది. కథలో తదుపరి పరిణామాల కోసం ఎదురు చూద్దాం.


