
📌 Key Points
- బ్రహ్మముడి సీరియల్‌లో రేఖపై కోర్టు కేసు వేయాలని అపర్ణ నిర్ణయం!
- ఇందుకి కొత్త ఫోన్ కొనిచ్చిన రాజ్.. ప్రేమతో మరింత దగ్గరయ్యే అవకాశం?
- ఐశ్వర్యను శత్రువులా మార్చుతున్న రేఖ.. కొత్త కుట్రలకు తెరలేపే ఛాన్స్?
- సుభాష్‌కు డేంజర్ పొంచి ఉందన్న అపర్ణ.. కుటుంబంలో కలకలం!
బ్రహ్మముడి సీరియల్‌లో బిగ్ ట్విస్ట్! అపర్ణ సంచలన నిర్ణయంతో కథ కొత్త మలుపు తిరుగుతోంది. రేఖ ఆట కట్టించడానికి అపర్ణ ఏం చేయబోతోంది? రాజ్, ఇందుల మధ్య ప్రేమ చిగురిస్తుందా? చూస్తూ ఉండండి!
రేఖపై అపర్ణ సంచలన నిర్ణయం!
Brahmamudi Serial March 19th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్‌లో ఇందుకు ఐశ్వర్యను కూడా శత్రువులా రేఖ మారుస్తుంది. ఇందు ధైర్యంగా ఉండాలంటే ఆస్తి మొత్తం అధికారం తనకే కావాలి. రేఖపై కోర్టులో కేసు వేయాలని అపర్ణ అంటుంది. ఇందు సర్టిఫికేట్స్‌తో బయటకు వెళ్తుంది. రాజ్ కొత్త ఫోన్ కొనిస్తాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య, అప్పు, స్వప్న ఎంత అన్యూన్యంగా ఉండేవారో గుర్తు చేసుకున్న అపర్ణ వారి పిల్లలు మాత్రం ఇలా ఉన్నారని సుభాష్‌తో చెబుతుంది. ఆ రేఖ రుద్రాణి కంటే ఘోరంగా తయారైంది. ఐశ్వర్యను తనలాగే పెంచుతుంది. ఇందుకు కొత్త శత్రువులా ఐశ్వర్య మారుతుంది. మనం లేనప్పుడు ఇందు ఒక్కతే అవుతుందని ఆవేదనగా చెబుతుంది అపర్ణ.
అది తెలిసి ఇందుకు రేఖ ప్రమాదం తలపెడితే అని సుభాష్ అంటాడు. ఆ ప్రమాదం ఇప్పుడు కూడా ఉంది. కానీ, ఒక్కసారి ధైర్యం చేసి కోర్టులో కేసు వేస్తే తప్పకుండా ఆస్తి మొత్తం ఇందు చేతుల్లోకి వచ్చేసింది. అప్పుడు రేఖ చచ్చిన పాముతో సమానం అని అపర్ణ ప్లాన్ వేస్తుంది. ఈరోజే వెళ్లి లాయర్‌ను కలుస్తానంటుంది. అపర్ణ వెళ్లిపోతుంది.
ఇందుకి రాజ్ ప్రేమతో బహుమతి!
మరోవైపు సర్టిఫికేట్స్ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటుంది ఇందు. స్వాతి వచ్చి ఎక్కడికి అని అడిగితే ఇంటర్వ్యూకి అని చెబుతుంది ఇందు. శివరామ్ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఇంటర్వ్యూకి వెళ్తానంటుంది ఇందు. హాల్లో భ్రమరాంబ ఉంటుంది. తనకు చెప్పి ఇందు వెళ్తుంటే భ్రమరాంబ ఆపి బ్యాగ్‌లో ఏముందని అడిగుతుంది. వంట పనికి ఆ బ్యాగుతో సంబంధం ఏంటీ, ఒకసారి చూపించు అని బ్యాగ్ లాక్కుని ఓపెన్ చేస్తుంది భ్రమరాంబ.
ఇందు సర్టిఫికేట్స్ సర్దుతుంటే ఎవరివి ఆ సర్టిఫికెట్స్ అని రేఖ గొంతు వినిపిస్తుంది. దాంతో భయపడుతూ అది అని వెనక్కి చూస్తే అలా మాట్లాడింది స్వాతి. రేఖ వాయిస్‌ను ఇమిటేట్ చేస్తుంది స్వాతి. అది చూసి ఇందు తేరుకుంటుంది. స్వాతి నవ్వుతుంది. స్వాతిని సరదాగా కోప్పడి ఇంట్లోంచి అడుగు బయటపెడుతుంది. మొదటిసారి కొత్త లోకంలోకి అడుగు పెడుతున్నా, నువ్వే దారి చూపించాలని కృష్ణయ్యను వేడుకుంటుంది ఇందు.
శివరామ్ ఇంటికి ఇందు వెళ్లి థ్యాంక్స్ చెబుతుంది. ఇక్కడ నువ్వు వంట చేయాల్సింది ఏం లేదు. నువ్వు అడిగావనే నేను రమ్మన్నాను. నీ వాళ్ల దగ్గర నీకు ఏదో ఇబ్బంది ఉందని అర్థమైంది. కానీ నేను అది అడగను. కానీ, బయటకు ఎందుకు రావాలనుకున్నావ్ అని శివరామ్ అంటాడు. జాబ్ చేసేందుకు అని ఇందు చెబుతుంది. దాంతో ఇందును మెచ్చుకుని తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెబుతాడు శివరామ్.
సుభాష్‌కు పొంచి ఉన్న ప్రమాదం!
రాజ్ కోప్పడుతాడు. ఎధవ అని తిడుతుంది ఇందు. ఇప్పుడు గొడవ పడితే పబ్లిక్ అంతా వాళ్లకే సపోర్ట్ చేస్తారు. మన చెన్నై డీల్ పోతుందిరా అని ఫ్రెండ్ అనడంతో ఇందుకు సారీ చెబుతాడు రాజ్. స్క్రీన్ గార్డ్ పోయింటుంది, ఐదు వందలు ఇస్తానని రాజ్ అంటాడు. ఫోన్ ఆన్ కావట్లేదు, నా ఇంటర్వ్యూ అడ్రస్ ఇందులోనే ఉందని ఇందు అంటుంది.
రాజ్‌కు ఫ్రెండ్ సర్దిచెబుతాడు. పక్కన మొబైల్ షాప్ ఉంది, రిపేర్ చేయించి ఎంత ఖర్చు అయిన పెట్టుకుంటామని రాజ్ ఫ్రెండ్ అంటాడు. దాంతో ఇందు ఒప్పుకుంటుంది. షాప్‌కు వెళ్లి ఫోన్ త్వరగా చూడమని చెబుతారు. అది చూసిన షాప్ అతను స్క్రీన్ గార్డ్ పోయింది, స్పీకర్స్ పోయాయి, బ్యాటరీ ఫెయిల్ అయింది. మొత్తం రూ. 7 వేలు అవుతుందంటాడు.
మీ సిమ్ కొత్త ఫోన్‌లో వేయగానే ఆ మెసేజ్‌లు వస్తాయని షాప్ అతను అంటాడు. దాంతో రాజ్ కొత్త ఫోన్ ఇవ్వమంటాడు. షాప్ అతను కొత్త ఫోన్‌లో ఇందు సిమ్ వేస్తాడు. మెసేజ్ వచ్చిందని చెబుతాడు. దాంతో ఇందు సంతోషిస్తుంది. కానీ, రాజ్‌తో కృతజ్ఞతతో ఉండదు. కొత్త ఫోన్ కొనిచ్చిన కృతజ్ఞత లేదని రాజ్ కోపంగా అనుకుంటాడు.
బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. అపర్ణ తీసుకునే నిర్ణయాలు, రేఖ వేసే ఎత్తులు సీరియల్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


