
📌 Key Points
- దుగ్గిరాల ఇంట్లో మీడియాకు లీక్ చేసిన సుభాష్!
- ఇందుతో సంతకం పెట్టించాలని రేఖ ప్లాన్.
- మత్తుమందు కలిపిన జ్యూస్ తాగిన శేషు స్పృహ కోల్పోయాడు.
- స్మోక్ బాంబ్ వేసి కిడ్నాప్ చేసిన దుండగులు!
బ్రహ్మముడి సీరియల్ లో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. రేఖ పన్నాగం బెడిసి కొట్టింది. దుగ్గిరాల ఇంట స్మోక్ బాంబ్ కలకలం సృష్టించింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే కథనం చదవండి!
ఇందు కిడ్నాప్ వెనుక ఎవరు?
Brahmamudi Serial April 10th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 10వ ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటి నుంచి ఇందుతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారని మీడియాకు లీక్ అయిందని రేఖకు కాల్ చేసి చెబుతాడు ప్రెసిడెంట్. దాంతో అపర్ణ వాళ్లపై రేఖ ఫైర్ అవుతుంది. కోపం తెచ్చుకున్న సుభాష్ అదంతా తానే చేసినట్లు చెబుతాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లాయర్లతో రేఖ మీటింగ్ నిర్వహిస్తుంది. ఇందుతో సంతకం అందరి ముందు పెట్టించాలని, దాన్ని వీడియో తీసుకుని భవిష్యత్తులో ప్రూఫ్ కింద వాడుకోవచ్చని ఓ లాయర్ చెబుతాడు. రేఖను ఎదురించే ధైర్యం ఎవరు చేయరులేండి అని భ్రమరాంబ అంటుంది.
నేను ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాను, రిపోర్టర్స్‌ను మీరు ఆపండి, అందుకు రిటర్న్‌గా మీకు పెద్ద స్కేల్‌లో గిఫ్ట్ అందుతుందని రేఖ చెబుతుంది. ఇందుతో బలవంతంగా సంతకం పెట్టిస్తున్నామని మీడియాకు లీక్ చేశారట అని చెప్పి అపర్ణపై కోప్పడుతుంది రేఖ. మరోవైపు ఇంత సమస్య పెట్టుకుని ప్రశాంతంగా ఎలా ఉన్నావని, రాత్రి అమ్మ గురించి తెలుసుకుని మారుతావని అనుకున్నానే, కానీ, నువ్వు ఇలాగే ఉన్నావని ఇందుపై కోప్పడుతుంది అపర్ణ .
రేఖ ప్లాన్ బెడిసి కొట్టిందా?
ఇంతలో వచ్చిన రేఖ అందుకేనా గూడు పుఠానీ చేస్తున్నారా. నువ్వు మీ నానమ్మ కలిసి నా మీద మీడియాకు కంప్లైంట్ చేస్తారా. నన్ను మోసం చేస్తున్నారా, సంతకం పెట్టకుంటే నీ ముసలి తాత, నానమ్మను ఏం చేస్తానో మర్చిపోయావా అని రేఖ ఫైర్ అవుతుంది. ప్రమాణపూర్తిగా చెబుతున్నా నేను ఏ మీడియాకు చెప్పలేదని ఇందు అంటుంది. ఇలా వెన్నుపోటు పొడవటానికి సిగ్గు లేదు అని భ్రమరాంబ అంటే అపర్ణ ఫైర్ అవుతుంది.
ఈరోజుతో మీ కథ ముగించగా తప్పదు అని రేఖ అంటే.. ఇందు అరుస్తుంది. వీళ్లను ప్రాణాలతో ఉంచాలంటే ఒక్క కారణం చెప్పమని రేఖ అంటే.. నేను మిమ్మల్ని ఎదురించలేదుకదా. మీకు సంతకం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మా తాతయ్య, నానమ్మ ప్రాణాలతో ఉంటేనే సంతకం పెడతాను అని ఇందు అంటుంది.
సరే. ముందు సంతోషంగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకో. ఆ తర్వాత అందరిముందు సంతకం పెడుదువు అని రేఖ అనేసి వెళ్లిపోతుంది. మరోవైపు జ్యూస్ ఎవరితో అయినా ఇది తాగించాలి, పని చేస్తుందో లేదో చెక్ చేయాలి. దానికి ఒక బకరా కావాలని బంటీ అంటాడు. ఇంతలో శేషు వచ్చి ఓ జ్యూస్ అడుగుతాడు. బకరా దొరికాడని మత్తుమందు కలిపిన జ్యూస్ శేషుకు ఇస్తాడు బంటీ. అది తాగి శేషు స్పృహ కోల్పోతాడు.
దుగ్గిరాల ఇంట్లో పోలీసుల విచారణ!
ఈ ఆట నీది అయినా గెలుపు నాదే అవ్వాలని చెబుతుంది రేఖ. ఇందు కేక్ కట్ చేస్తుంది. అందరూ బర్త్ డే విషెస్ చెబుతారు. మరోవైపు రాజ్, లక్కీ బ్లాస్ట్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఇందు స్పీచ్ ఇస్తుంది. నానమ్మ అపర్ణ గురించి గొప్పగా చెబుతుంది. ఆ తర్వాత తనకు అండగా నిలబడింది, ముందుండి నడిపించింది రేఖ ఆంటీ అని, ఈరోజుతో నా ఆస్తి పవర్ ఆఫ్ అటార్నీ నాకు రాబోతుంది. కానీ దానిపై నాకు ఆశ లేదు. అది రేఖ ఆంటీకే బాధ్యతలన్నీ అప్పగించాలనుకుంటున్నానని ఇందు అంటుంది.
దాంతో రేఖ అందరూ సంతోషిస్తారు. ఇంత చిన్న వయసులోనే ఆ బాధ్యతలు చూసుకోవాలని లేదు. మా ఆస్తులన్నీ మా రేఖ ఆంటీ పేరు మీదకే మార్చాలని అనుకుంటున్నాను అని ఇందు చెబుతుంది. తర్వాత లాయర్స్ ఆస్తి పేపర్స్ తీసుకొస్తారు. ఇందుతో వేలి ముద్ర వేయిస్తుంటుంది రేఖ. ఇంతలో రాజ్ స్మోక్ బాంబ్ పేలుస్తాడు. ఆ స్మోక్ బాంబ్‌కు అందరు స్పృహ కోల్పోతారు.
బ్రహ్మముడి సీరియల్ లో రోజుకో ట్విస్ట్ ఎదురుచూస్తూనే ఉంది. రేఖ ప్లాన్ ఏమిటి? కిడ్నాప్ చేసింది ఎవరు? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి!


