
📌 Key Points
- బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్: దుగ్గిరాల ఇంటికి రాజు రాక!
- ఐశ్వర్య నెక్లెస్ పోగొట్టుకోవడం, తిరిగి ఇవ్వడానికి రాజు రావడం హైలైట్
- జాబ్ ఇంటర్వ్యూలో ఇందుకి నిరాశ, డిగ్రీ లేదని రిజెక్ట్ చేసిన ఆఫీసర్
- అమ్మవారి నగలు దొంగిలించిన ఐశ్వర్యను ఫాలో అవుతున్న ఇందు, నందు!
బ్రహ్మముడి సీరియల్ అభిమానులకు ఒక సంచలన వార్త! రాజు దుగ్గిరాల ఇంటికి తిరిగి రావడంతో కథలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. అపర్ణ మరియు రేఖ షాక్‌కు గురయ్యారు. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి!
దుగ్గిరాల ఇంటికి రాజు: షాక్ లో అపర్ణ, రేఖ!
Brahmamudi March 25th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఎదురైంది. రాజు ఏకంగా దుగ్గిరాల ఇంటికే వస్తాడు. అతన్ని చూసి అపర్ణ, రేఖ షాక్ తింటారు. రాజ్ తిరిగి వచ్చాడేమో అని వాళ్లు అనుకుంటారు.
Brahmamudi March 25th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజు, లక్కీ కారులో ఐశ్వర్య తన నెక్లెస్ పారేసుకోవడం, దానిని తిరిగి ఇవ్వడం కోసం రాజు ఏకంగా దుగ్గిరాల ఇంటికే రావడం చూడొచ్చు. అటు ఇందు జాబ్ ప్రయత్నం మరోసారి విఫలమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
నెక్లెస్‌లు దొంగతనం చేసిన ఐశ్వర్య, భ్రమరాంబ
జాబ్ ఇంటర్వ్యూకి ఇందు.. డిగ్రీ లేదని రిజెక్ట్
జాబ్ కోసం ప్రయత్నించిన ఇందుకి నిరాశ!
అయితే ఆమె సర్టిఫికెట్లను చూసే సమయంలో డిగ్రీ లేదని అడుగుతాడు. ఈ మధ్యే పరీక్షలు రాశానని, కచ్చితంగా పాసవుతానని ఆమె అంటుంది. కానీ డిగ్రీ లేకుండా జాబ్ ఇవ్వడం కుదరదని అతడు స్పష్టం చేస్తాడు. దీంతో ఇందు నిరాశగా వెనుదిరుగుతుంది.
ఐశ్వర్యకు రాజు, లక్కీ లిఫ్ట్.. ఫాలో అయిన ఇందు
అప్పుడే ఆఫీసు నుంచి బయటకు వచ్చిన ఇందు దూరం నుంచి ఐశ్వర్య ఆ కారు ఎక్కడం చూస్తుంది. పబ్ లో లక్కీని చూసి ఉండటంతో మళ్లీ ఇతని కారు ఎక్కుతోంది ఎందుకంటూ ఆటోలో ఆ కారును ఫాలో అవుతుంది. కారులో లక్కీ ఏం అడిగినా ఐశ్వర్య పట్టించుకోదు. పొగరుగా సమాధానం చెబుతుంది.
అది చూసి నందు ఆమెకు థ్యాంక్స్ చెబుతుంది. వీళ్లు అమ్మవారి నగలు దోచుకున్న దొంగలని, వీళ్లను పోలీస్ స్టేషన్ లో అప్పగించే వరకూ తన వెంటే ఉండాలని ఇందుని అడుగుతుంది నందు. ఆమె సరే అంటుంది. ఆ ఆటోలోనే వాళ్లు వెళ్తారు.
ఐశ్వర్యను ఫాలో చేస్తున్న ఇందు, నందు!
లక్కీ కారులో ఐశ్వర్య నెక్లెస్
అటు రాజు, లక్కీ ఓ చోట కారు ఆపి కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అప్పుడే కారులో నెక్లెస్ కనిపిస్తుంది. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. కానీ దానిని తిరిగి ఇచ్చేద్దామనుకొని రాజు ఏకంగా దుగ్గిరాల ఇంటికే వచ్చేస్తాడు.
అప్పుడే ఆ ప్రమాదం గురించి సుభాష్ తో అపర్ణ మాట్లాడుతూ ఉంటుంది. స్వరాజ్ బాడీ మాత్రం కనిపించలేదని, అతడు ఎక్కడో చోట ఉండే ఉంటాడని, మనల్ని వెతుక్కుంటూ వస్తాడని అంటుంది. అప్పుడే రాజు ఇంట్లోకి వస్తాడు. అతన్ని చూసి అపర్ణ, రేఖ షాక్ తింటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి సీరియల్‌లో రాజు రాకతో కథ ఊహించని మలుపు తిరిగింది. అపర్ణ, రేఖ షాక్‌లో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడటానికి వేచి ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


