|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్: రేఖపై దాడి! రాజ్ ఫిదా!! నందు షాకింగ్ కామెంట్స్! వైరల్ అప్డేట్స్!

Published: 06-04-2026, 11:05 PM
బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్: రేఖపై దాడి! రాజ్ ఫిదా!! నందు షాకింగ్ కామెంట్స్! వైరల్ అప్డేట్స్!
  • బ్రహ్మముడి సీరియల్‌లో రేఖకు అప్పులోళ్ల వార్నింగ్: కిడ్నాప్ భయం!
  • వెయిటర్స్‌గా రాజ్, లక్కీ: కిడ్నాప్ ప్లాన్‌లో ట్విస్ట్!
  • ఇందు బర్త్ డే పార్టీలో కావ్య ఎంట్రీ: కూతురికి మోటివేషన్!
  • నన్ను కిడ్నాప్ చేసుకోండి: ప్లాన్ చెప్పిన ఇందు!

బ్రహ్మముడి సీరియల్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్! రేఖపై దాడి జరగడం, రాజ్ ఫిదా అవ్వడం, నందు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే చదవండి!

రేఖపై అప్పులోళ్ల దాడి: అసలేం జరిగింది?

Brahmamudi Serial April 7th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 7వ ఎపిసోడ్‌లో ఇందుకు ఉదయమే వచ్చి రేఖ, భ్రమరాంబ వాళ్లు వచ్చి బర్త్ డే విషెస్ చెబుతారు. ఇందు బర్త్ డే పార్టీలో రేఖ దగ్గరికి వచ్చిన అప్పులోళ్లంతా వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. కిడ్నాప్ చేసేందుకు వచ్చిన రాజ్, లక్కీ వెయిటర్స్‌గా మారుతారు.

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తల్లి కావ్య జీవితాన్ని పుస్తకంలో చదివిన ఇందు పడుకుండిపోతుంది. కావ్య పిలుస్తుంది. తన తల్లిని చూసి ఇందు మురిసిపోతుంది. రేఖ వల్ల కష్టాల్లో ఉన్నట్లు చెబుతుంది ఇందు. ఆస్తి కోసం తాతయ్య వాళ్లను చంపేస్తానంది అంతేగా, నువ్వు నా కూతురువి, నువ్వు అనుకుంది సాధిస్తావని మోటివేట్ చేస్తుంది కావ్య .

నా భయాన్ని దూరం చేయడానికి వచ్చావా అమ్మా. సరే అమ్మ నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను. యుద్ధంలో గెలిచేవరకు పోరాడుతాను, సమయం వచ్చేవరకు ఎదురుచూస్తాను. కానీ, రేఖను మాత్రం గెలవనివ్వను అని ఇందు అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం పడుకున్న ఇందు దగ్గరికి వచ్చిన రేఖ, భ్రమరాంబ, భూషణ్ హ్యాపీ బర్త్ డే అని గట్టిగా అరిచి చెబుతారు. దాంతో కంగారుగా లేచిన ఇందు దొంగ దొంగ అని అరుస్తుంది.

ఇందు అందానికి ఫిదా అయిన రాజ్: కొత్త ప్రేమ కథ?

మేము ఇందు అని సర్దిచెబుతుంది రేఖ . మీ పిన్ని మొహం దగ్గరగా చూసేసరికి దొంగలా అనిపించి భయబడ్డావా అని శేషు సెటైర్లు వేస్తాడు. భ్రమరాంబ కోప్పడుతుంది. తర్వాత అంతా ఇందుకు హ్యాపీ బర్త్ డే అని చెబుతారు. ఎందుకీ దొంగ ప్రేమలు, దేనికోసం, నువ్వేంటో నాకు తెలియదా అని అపర్ణ అంటుంది. మా నానమ్మ గురించి తెలిసిందేగా. మీరిచ్చిన డ్రెస్ వేసుకోవాలి అంతేగా నేను మీరు చెప్పినట్లు రెడీ అవుతాను అని ఇందు అంటుంది.

ఏం చేయాలనుకుంటున్నావ్ అని ఇందును స్వాతి అడుగుతుంది. నేను పార్టీకి వస్తాను. కానీ, సంతకం పెట్టట్లేదు. కేక్ కట్ చేశాక మాయమైపోతాను. ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేస్తారుగా. నన్ను నేను కిడ్నాప్ చేసుకుంటాను. అందరిముందు కిడ్నాప్ చేస్తే తాతయ్య, నానమ్మను ఏం చేయకుండా నాకోసం వెతుకుతుందని ఇందు అంటుంది. ఐడియా బాగుంది, కానీ, కిడ్నాప్ ఎవరు చేస్తారని స్వాతి అడుగుతుంది.

నువ్వే అని ఇందు అంటే.. నాకు కిడ్నాప్ చేసేవాళ్లు తెలియదు అని స్వాతి అంటుంది. దాంతో ఇందు బతిమిలాడుతుంది. నాకు ఇద్దరు తెలుసు, వారితో చేయిస్తాను అని స్వాతి అని కిడ్నాప్ చేసేందుకు వెళ్లి మాట్లాడతానంటుంది. మరోవైపు ఫామ్ హౌజ్‌కి రాజ్, లక్కీ వస్తారు. ఇలా వచ్చారేంటీ, కిడ్నాప్ అయ్యాక మీరు కనిపించకుంటే డౌట్ వస్తుంది. మీరు నా ఫ్రెండ్స్ అని తెలుసు కాబట్టి అంతా దొరికిపోతామని ఐశ్వర్య కోప్పడుతుంది.

అపర్ణను చూసి నానమ్మ అన్న నందు: షాకింగ్‌గా ఉందే!

అప్పు ఈసారైనా తీరుస్తారా అని సెటైర్లు వేస్తారు. పేరుకే బర్త్ డే పార్టీ అంతా అప్పులు ఇచ్చినవాళ్లే ఉన్నారు అని శేషు అంటాడు. నిజమే, ఇన్ని రోజులు మనం అప్పులు తిరిగి ఇవ్వకపోవడం వల్ల వాళ్లంతా కలిసి త్వరలోనే మనమీద యుద్థం ప్రకటిద్దామని అనుకుంటున్నారు. వారు అలా దాడి చేయకుండా ఉండాలంటే నా మీద నమ్మకం రావాలి. వాళ్ల కళ్ల ముందు నా పేరు మీదున్న ఆస్తి పేపర్స్ మీద ఆ ఇందు సంతకం పెడితే అందరూ నమ్ముతారు అని రేఖ అంటుంది.

ఇంతలో చక్రి వచ్చి తన డబ్బు గురించి అడుగుతాడు. త్వరలోనే నేను స్వరాజ్ గ్రూప్‌కు చైర్మన్ కాబోతున్నా. అప్పుడు మనం చేసే బిజినెస్ ముందు మీ కోట్ల అప్పు చాలా చిన్నగా అనిపిస్తుందని రేఖ అంటుంది. అది చూస్తాను అని బెదిరించి పోతాడు చక్రి. అప్పులోళ్లందరూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇందు సంతకం పెట్టడంలో తేడా రాదుగా అని భూషణ్ భయంగా అడుగుతాడు. అన్ని అనుకున్నట్లుగా జరుగుతాయని రేఖ అంటుంది.

అందాల రాక్షసిరా అని ఇందును అంటాడు రాజ్ . ఇందు బర్త్ డే పార్టీకి వచ్చిన నందు అపర్ణ చూసి గుర్తు పడుతుంది. నానమ్మా అని పిలుస్తుంది. ఇందును చూసి తను తన సొంత అక్క అని అనుకుంటుంది నందు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌లో రోజుకో ట్విస్ట్ ఎదురవుతోంది. రేఖపై దాడి, రాజ్ మనసు మార్పు, నందు షాకింగ్ కామెంట్స్ వెనుక అసలు కథ ఏమిటో చూడాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.