
📌 Key Points
- లక్కీ కుట్రతో రాజు నోట అసలు నిజం బయటపడింది, ఐశ్వర్య రికార్డు చేసింది.
- వెంకీ కష్టాలు, ఏఐ ట్రైనింగ్: మెరుగైన భవిష్యత్తు కోసం పోరాటం.
- రాజు తల్లిదండ్రులు పార్టీకి రాక: నిజం తెలిసిపోతుందా అని లక్ష్మీ ఆందోళన.
- అద్దె మొగుడు నాటకంపై రాజు సంచలన వ్యాఖ్యలు: డబ్బు కోసమే అని వెల్లడి.
బ్రహ్మముడి సీరియల్ అభిమానులారా, ఊపిరి బిగబట్టండి! తాజా ఎపిసోడ్ మీ గుండె వేగాన్ని పెంచేస్తోంది. లక్కీ పన్నాగం, రాజు సంచలన నిజాలు, కుటుంబంలో పెరిగిన ఉత్కంఠ – అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, ఈ వార్త చూడాల్సిందే!
లక్కీ ప్లాన్: రాజు నోట నిజం!
Brahmamudi Serial June 18th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 18వ ఎపిసోడ్‌లో రాజుకు తాగించి నిజం కక్కిస్తాడు లక్కీ. అదంతా ఐశ్వర్య వీడియో తీస్తుంది. వెంకీ చాలా డెలివరీలు చేసి లంచ్ కూడా చేయలేక పస్తులుంటాడు. కంపెనీ పార్టీకి రాజు తల్లిదండ్రులు వస్తారు. రాజుకు నిజం తెలిసిపోయిందేమోనని లక్ష్మీ భయపడుతుంది
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకీ కాళ్లకు తల్లి లక్ష్మీ మందు రాస్తుంది. ఈ కష్టాలు ఇంకొన్ని రోజులే. త్వరలోనే మంచి జాబ్ సంపాదిస్తాను అని వెంకీ అంటాడు. అదేంట్రా ఇది మంచి జాబే కదా అని చలపతి అంటే.. ఇప్పుడు ఏఐ ట్రైనింగ్ తీసుకుంటున్నా కదా. అప్పుడు ఇంకా మంచి జాబ్ వస్తుందని వెంకీ అంటాడు.
అసలు మా పెళ్లే జరగలేదు. మా పెళ్లి అనేది అబద్ధం అని రాజు చెబుతాడు. అదంతా ఐశ్వర్య లక్కీకి కూడా తెలియకుండా వీడియో తీస్తుంది. అదేంట్రా ఆ ఇంట్లో భార్యాభర్తలుగానే ఉంటున్నారుగా. నేను కూడా పెళ్లి చేసుకున్నారనే అనుకుంటున్నా అని లక్కీ అంటాడు. అలా అనుకోవాలనే నటిస్తున్నాం. అవసరాల కోసం నటిస్తున్నాం. అందులో నేను వేస్తున్న పాత్ర పేరు అద్దె మొగుడు అని రాజు అంటాడు.
అద్దె మొగుడు డ్రామా: బయటపడిందా?
ఈ పాత్రకు పేమెంట్ ఎక్కువగా వస్తుందిగా. నేను డబ్బులు తీసుకుని అద్దె మొగుడుగా చేస్తున్నా అని రాజు చెబుతాడు. డబ్బుల కోసం చేస్తున్నావా. మరి తనెందుకు ఇలా చేస్తుందని లక్కీ అడుగుతాడు. ఆ ఇంటికి తన ఇంట్లోవాళ్లు బలవంతంగా పెళ్లి చేస్తుంటే నాతో ఇలా నాటకం వేయించింది. ఇప్పుడు అంత క్లియర్ అయినట్లేనా. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ మామ అని రాజు అంటాడు.
వెంకీకి బాస్ కాల్ చేసి త్వరగా రమ్మని, చాలా డెలివరీలు ఉన్నాయని అంటాడు. సరేనని వెంకీ అంటాడు. తల్లిదండ్రులు టిఫిన్ చేయమంటే వెళ్తానని లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తాడు వెంకీ. వాడిలో చాలా మార్పు కనిపిస్తుందని చలపతి, లక్ష్మీ డౌట్ పడతారు. వీడు ఇలా కష్టపడుతుంటే పెద్దోడు అస్సలు పట్టించుకోవట్లేదు అంటాడు చలపతి.
మరోవైపు పార్టీకి ఇంత రిచ్‌గా రెడీ అవడం అవసరమా అని ఇందును అడుగుతాడు రాజు. దాంతో ఇందు షాక్ అవుతుంది. ఇంతలో రాజుకు చలపతి కాల్ చేస్తాడు. తండ్రి కాల్ రాజు కట్ చేస్తాడు. మళ్లీ కాల్ చేస్తే రాజు కట్ చేస్తాడు. మీ నాన్న కంగారుపడతారు. లిఫ్ట్ చేసి మాట్లాడమని ఇందు అంటుంది. ఆయన డబ్బు కోసమే చేసి ఉంటారు అని రాజు అంటాడు.
పార్టీలో ఉత్కంఠ: లక్ష్మీ భయం!
తర్వాత కాసేపటికి ఈరోజు అన్ని డెలివరీలు చేసేశాను. అమ్మ పెట్టిన లంచ్ తినేసి కోచింగ్‌కు వెళ్దామని అనుకుంటాడు వెంకీ. లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే అది వాసన వస్తుంది. అన్నం పాడవుతుంది. అన్నం పక్కన పడేసి ఆకలేస్తుందని, నీళ్లతో కడుపు నింపుకుంటాడు వెంకీ. అది నందు చూస్తుంది. అన్నం తినే టైమ్ కూడా దొరకలేదా అని నందు అడుగుతుంది.
జరిగింది చెబుతాడు వెంకీ. అలా వెంకీ పస్తులు ఉంటాడు. మరోవైపు స్వరాజ్ కంపెనీ క్లైంట్స్‌కు ఇందువాళ్లు పార్టీ ఇస్తారు. ఆ పార్టీకి రాజు తల్లిదండ్రులు చలపతి, లక్ష్మీ వస్తారు. అపర్ణ ను కలిసి రాజు గురించి అడుగుతారు.
బ్రహ్మముడిలో రోజురోజుకు పెరుగుతున్న ఈ డ్రామా ప్రేక్షకులను మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. రాజు నిజం బయటపడిందా? లక్కీ ప్లాన్ ఫలిస్తుందా? వేచి చూడండి, మరిన్ని షాకింగ్ అప్డేట్స్ కోసం సిద్ధంగా ఉండండి!


