|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: కావ్య‌ను క‌త్తితో పొడిచిన రౌడీ – క‌ళావ‌తి కోసం రాజ్ సాహ‌సం – యామిని రివేంజ్‌

Published: 05-06-2025, 10:14 PM
బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: కావ్య‌ను క‌త్తితో పొడిచిన రౌడీ - క‌ళావ‌తి కోసం రాజ్ సాహ‌సం - యామిని రివేంజ్‌

బ్రహ్మముడి సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. రాజ్ మరియు కావ్య అడవిలో చిక్కుకుని రౌడీల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. యామిని వారిని వెంబడిస్తుంది.

Key Points

1

రాజ్, కావ్య అడవిలో చిక్కుకుంటారు, రౌడీల నుండి తప్పించుకుంటారు.

2

యామిని ప్లాన్ ప్రకారం రౌడీలు కావ్యను చంపడానికి ప్రయత్నిస్తారు.

4

కావ్య గతంలో జరిగిన సంఘటన గురించి రాజ్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.

అడవిలో చిక్కుకున్న కావ్య మరియు రాజ్

రాజ్‌, కావ్య అడ‌విలో చిక్కుకుపోతారు. ద‌ట్ట‌మైన అడ‌వి నుంచి బ‌య‌ట‌ప‌డే దారి కోసం వెతుకుతుంటారు. మ‌రోవైపు యామిని నియ‌మించిన‌ రౌడీలు కావ్య‌ను చంప‌డానికి అడ‌విలో వారిని వెంటాడుతుంటారు. ఆ కిల్ల‌ర్స్‌ను ప‌ట్టుకొని కావ్య‌, రాజ్‌ల‌ను ర‌క్షించ‌డానికి అప్పు అడ‌విలోకి ఎంట‌ర్ అవుతుంది.

భ‌యానికి మీనింగ్ తెలియ‌ని బ్ల‌డ్ నాది అని, గూగుల్‌లో ధైర్యం అని టైప్ చేస్తే త‌న పేరే వ‌స్తుంద‌ని కావ్య ముందు బిల్డ‌ప్‌లు ఇస్తాడు రాజ్‌ . ఇంత‌లోనే తొండ క‌నిపించ‌డంతో భ‌య‌ప‌డి గెంతులు వేస్తాడు. అత‌డిని చూసి న‌వ్వుకుంటుంది కావ్య‌. న‌డిచి న‌డిచి కాళ్లు నొప్పులు పుట్ట‌డంతో ఆగిపోతుంది కావ్య‌. దాహం వేస్తుంద‌ని, మంచినీళ్లు కావాల‌ని అంటుంది. ఇదేమైనా నా పుట్టిల్లా ఏది ఎక్క‌డుందో తెలియ‌డానికి అని రాజ్ సెటైర్ వేస్తారు.

ఒక అమ్మాయికి దాహంగా ఉందంటే క‌నీసం వాట‌ర్ ఇచ్చి సాయం చేయ‌లేరా అని కావ్య అంటుంది. రాజ్ అటూ ఇటూ చూస్తాడు. ఏమైంద‌ని కావ్య అడుగుతుంది. అమ్మాయి అన్నారు క‌దా ఎక్క‌డుందా అని చూస్తున్నాన‌ని జోకులు వేస్తాడు. మీరు ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిలా ఉన్నారు…అమ్మాయి ఏంటి అని ఆట‌ప‌ట్టిస్తాడు. మీరు కూడా న‌లుగురు పిల్ల‌ల్లా తండ్రిలా ఉన్నార‌ని కావ్య రివ‌ర్స్ కౌంట‌ర్ వేస్తుంది.

వాట‌ర్ కోసం వెత‌క‌డానికి రాజ్ బ‌య‌లుదేర‌బోతాడు. అడ‌వి జంతువుల సౌండ్ వినిపించ‌డంతో భ‌య‌ప‌డిపోతాడు. కావ్య కోసం క‌ష్ట‌ప‌డి నీళ్లు సంపాదిస్తాడు రాజ్‌.

యామిని యొక్క ప్రతీకారం

రాజ్‌, కావ్య‌ల‌ను చూస్తారు రౌడీలు, వారి వెంట ప‌డ‌తారు. ఆ రౌడీల బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి కావ్య రాజ్ ఓ చోట దాక్కుంటారు. రౌడీలు త‌మ వైపు రాకుండా తెలివిగా వారిని దారి మ‌ళ్లిస్తాడు రాజ్‌. ఆయాసంతో ప‌రిగెత్త‌లేక ఓ చోట ఆగిపోతారు కావ్య‌, రాజ్‌. రౌడీల‌ను ఎదుర్కోవ‌డానికి రాజ్ సిద్ధ‌మ‌వుతాడు.

కానీ తెగింపు అన్నిసార్లు మంచిదికాద‌ని, స‌మ‌యం మ‌న‌ది కాన‌ప్పుడు త‌ప్పించుకొని పారిపోవ‌డం మంచిదేన‌ని అత‌డిని వారిస్తుంది కావ్య‌. గ‌తంలో జ‌రిగిన‌ట్లు మ‌ళ్లీ మీకు ఏదైనా జ‌రిగితే నేను త‌ట్టుకోలేన‌ని నోరుజారుతుంది. గ‌తంలో నాకు ఏం జ‌రిగింది అని రాజ్ అనుమానంగా అడుగుతాడు. కోమాలోకి వెళ్లారు క‌దా దాని గురించి మాట్లాడాన‌ని కావ్య క‌వ‌ర్ చేస్తుంది.

రౌడీల‌కు యామిని ఫోన్ చేస్తుంది. కావ్య స్టోరీని ఫినిష్ చేశావా లేదా అని రౌడీ గ్యాంగ్ లీడ‌ర్‌ను అడుగుతుంది. కావ్య త‌మ నుంచి త‌ప్పించుకొని రాజ్‌తో క‌లిసి అడ‌విలోకి పారిపోయింద‌ని గ్యాంగ్ లీడ‌ర్ చెబుతాడు. అడ‌వి త‌మ‌కు కొట్టిన పిండి అని వారిని ప‌ట్టుకొని కావ్య‌ను చంపేస్తాన‌ని యామినికి మాటిస్తాడు రౌడీ గ్యాంగ్ లీడ‌ర్‌.

రాజ్ మరియు కావ్య మధ్య సంఘర్షణ

త‌న‌కు ఆక‌లిగా ఉంద‌ని కావ్య అంటుంది. అరెరె అవునా…బిర్యానీ ఓకేనా అని రాజ్ పంచ్‌లు వేస్తాడు. నా కోసం అది చేస్తా…ఇది చేస్తా అన్నారు. ఒక్క పూట కూడా భోజ‌నం పెట్ట‌లేరా అని కావ్య అంటుంది. టైమ్ చూసి దెబ్బ కొట్టారు క‌దా అని రాజ్ అంటాడు. అమ్మాయిలం క‌దా అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడే ఆడుకోగ‌లం అని కావ్య అంటుంది. కావ్య ముందు న‌డుస్తుండ‌గా స‌డెన్‌గా రాజ్ క‌నిపించ‌కుండాపోతాడు. దాంతో కావ్య భ‌యంతో వ‌ణికిపోతుంది.

మ‌రోవైపు అడ‌విలో రాజ్‌, కావ్య‌ల కారు ఆగిపోయిన ప్లేస్‌ను అప్పు క‌నిపెడుతుంది. రౌడీల‌కు దొరికేలోపు వారిని ఎలాగైనా కాపాడాల‌ని అనుకుంటుంది. రాజ్ కోసం కావ్య అటు ఇటూ చూస్తుంటుంది. నేను ఇక్క‌డ ఉన్నాన‌ని దూరం నుంచి రాజ్ పిలుస్తాడు. రాజ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన కావ్య‌…ఆడ‌పిల్ల‌ను అలా ఒంట‌రిగా వ‌దిలేసి ఎలా వెళ్తార‌ని కొడుతుంది.

ఇందాక మీకు ఆక‌లిగా ఉంద‌ని అన్నారు క‌దా…మీ కోసం ఫుడ్ తేవ‌డానికి వెళ్లాన‌ని చెప్పి కొన్ని ఫ్రూట్స్ కావ్య‌కు ఇస్తాడు. త‌న కోసం రాజ్ రాత్రిపూట‌, అడ‌విలో రిస్క్ తీసుకోవ‌డం చూసి కావ్య ఇంప్రెస్ అవుతుంది. ఇద్ద‌రు క‌లిసి పండ్లు తింటారు. రాజ్ తెచ్చిన పండ్లు తిన్న త‌ర్వాత క‌ళ్లు తిరిగిన‌ట్లు అవుతుంది. కావ్య‌, రాజ్ మ‌త్తులోకి జారుతారు. వారిని రౌడీలు చూస్తారు. కావ్య‌ను రౌడీ గ్యాంగ్ లీడ‌ర్ క‌త్తితో పొడుస్తాడు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఎపిసోడ్ ముగిసింది.

చివరిగా, యామిని ప్రణాళిక విఫలమవుతుంది. రాజ్ మరియు కావ్య ప్రమాదం నుండి తప్పించుకుంటారు. కానీ యామిని మళ్ళీ కొత్త ప్రణాళికతో వస్తుందని సూచించబడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.