
బ్రహ్మముడి సీరియల్‌లోని ఈరోజు ఎపిసోడ్‌లో, రేవతి యామిని చెల్లిగా వస్తుంది. స్వరాజ్ మరియు రేవతి సంబంధం బయటపడటంతో, రుద్రాణి, ప్రకాశం మధ్య తీవ్రమైన సంఘర్షణ చోటుచేసుకుంటుంది.
Key Points
రేవతి యామిని చెల్లిగా రాజ్ ప్రవేశపెడతాడు.
రుద్రాణి స్వరాజ్‌కు, రేవతికి ఉన్న సంబంధాన్ని గుర్తిస్తుంది.
కావ్య రేవతిని గుర్తించి షాక్ అవుతుంది.
రేవతి యొక్క అనుమానస్పద ప్రవేశం
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పంతులును పూజకు సిద్ధం చేయమని, తాము ప్రసాదం ప్రిపేర్ చేస్తామని కావ్య చెబుతుంది. కావ్యను పక్కకు పిలిచిన రాజ్.. అక్క రేవతికి కాల్ చేస్తాడు. ఇంటి బయటే ఉన్నానని రేవతి చెబుతుంది. రాజ్, కావ్య ఇద్దరు బయటకు వెళ్తారు. కళావతిని కాసేపు ఆడుకుందాం అని రాజ్ అనుకుంటాడు.
రేవతి గారు వచ్చారన్నారు. ఎక్కడ అని కావ్య అడుగుతుంది. నీకు అబద్ధం చెప్పాను. వచ్చింది అక్క కాదు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వచ్చింది అని అక్క రేవతిని ఫ్రెండ్‌గా చూపిస్తాడు రాజ్. మొన్నటిదాక యామిని అయింది, ఇప్పుడు దాని చెల్లి వచ్చిందా అని కోపంగా వెళ్తుంది కావ్య. ముసుగు వేసుకున్న రేవతిని కావ్య చెడామడా తిడుతుంది.
ముసుగు వేసుకున్నావేంటీ అని తీసి చూసి షాక్ అవుతుంది కావ్య. సారీ వదినా అని కావ్య చెబుతుంది. ఆంటీ ఫూల్ అయిందని స్వరాజ్ అంటాడు. నువ్వు ఏమైనా గుర్తు పడతావో లేదో అని టెస్ట్ చేశాను. ఇదే ప్లాన్ ఇంట్లో అమలు చేస్తాం అని రాజ్ అంటాడు. అమ్మ కనిపెడుతుందేమో, మన స్వార్థానికి అమ్మను బాధపెట్టడం ఇష్టంలేదు అని రేవతి అంటుంది.
అమ్మకు దగ్గరవ్వాలని లేదా అని రాజ్ అడిగితే ఉందని రేవతి చెబుతుంది. నలుగురు ఇంట్లోకి వెళ్తారు. హాయ్ ఫ్రెండు అనుకుంటూ స్వరాజ్ అపర్ణ దగ్గరికి వెళ్తాడు. స్వరాజ్‌ను అపర్ణ, సుభాష్ ముద్దు చేస్తారు. దాంతో రేవతి ఎమోషనల్ అవుతుంది. రేవతి లోపలికి వస్తుంది. ముసుగు వేసుకున్న రేవతిని చూసి అంతా షాక్ అవుతారు. రుద్రాణి ఎవరని అడుగుతుంది.
రుద్రాణి కీలకమైన విషయాన్ని బయటపెడుతుంది
స్వరాజ్ వాళ్ల అమ్మ అని రాజ్ చెబుతాడు. మీ వాడికి మావాడి పోలికలే వచ్చాయని, విచిత్రంగా మీ వాడికి మా వాడి పేరే పెట్టారు స్వరాజ్ అని అపర్ణ అంటుంది. అయినా ముసుగు ఏంటీ కొత్త పెళ్లి కూతురిలా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అది వాళ్ల ఆచారం. ఎక్కడికెళ్లినా వాళ్లు ముసుగుతోనే ఉంటారు అని రాజ్ చెబుతాడు. నేను ఇలాంటి ఆచారం చూశాను. కానీ, ఇంట్లో వేసుకోరే అని ప్రకాశం అంటాడు.
ఇది వీళ్ల ఆచారం. వీళ్ల ముసుగు చూసిన వారికి చెడు జరుగుతుందని వాళ్ల నమ్మకం అని రాజ్ అంటాడు. రుద్రాణి పేరు అడుగుతుంది. రాజ్ చెబుతాడు. ఇంటికి వచ్చిన ఆవిడను ఇలా నిలబెట్టే మాట్లాడుతారా. ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ కాదని కావ్య అంటుంది. పంతులు పూజకు టైమ్ అవుతుందంటాడు. అంతా ఆ పనిలో ఉంటారు. రుద్రాణి మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటుంది.
తీసి చూడవే అని ప్రకాశం అంటాడు. దాంతో రుద్రాణి తీసి చూస్తుంటే.. చస్తావే అని ప్రకాశం బెదిరిస్తాడు. రుద్రాణి భయపడిపోయి ఆగిపోతుంది. మరోవైపు స్వరాజ్ పరిచయమైంది మొన్నే. వాళ్ల తల్లితో రాజ్, కావ్య అంత రాసుకుపూసుకు ఉంటారేంటీ అని రుద్రాణి అనుమానిస్తుంది. రుద్రాణి చెప్పిన ప్లాన్ గురించి అడుగుతాడు రాహుల్. మనం తీసుకొచ్చిన టాబ్లెట్స్ ఎవరికీ తెలియకుండా తీర్థంలో కలపాలి అని రుద్రాణి అంటుంది.
ప్రకాశం యొక్క బెదిరింపులు
మరోవైపు సీతారామయ్య దగ్గరికి రేవతిని తీసుకెళ్తారు. ఈ అమ్మాయి ఎవరు అని ఇందిరాదేవి నిలదీస్తుంది. ముసుగు తీసి రేవతిని చూపిస్తారు. దాంతో ఇందిరాదేవి షాక్ అయి భయపడిపోతుంది. రాజ్, కావ్య, రేవతిని తిడుతుంది. పండక్కి అక్క ఇంట్లో ఉండాలని ఆశ పడ్డాను. అందుకే తీసుకొచ్చాను. గతం గుర్తుకు లేదు కాబట్టి అమ్మను మ్యానేజ్ చేయలేకపోయాను. ఇప్పుడు చూసుకుంటాను అని రాజ్ చెబుతాడు.
రాజ్ చెబుతున్నాడుగా వదిలేయ్ అని చెప్పిన సీతారామయ్య రేవతిని యోగక్షేమాలు అడుగుతాడు. స్వరాజ్ కోసం వెతుక్కుంటూ ఇందిరాదేవి వాళ్ల రూమ్ వైపు వెళ్తుంది. రేవతి మాట్లాడుతుంటుంది. ఎప్పుడైతే స్వరాజ్‌ను తన మనవడిగా ఒప్పుకుని దగ్గరిగా తీసుకుంటుందో ఆరోజే నేను ఈ ఇంటి బిడ్డను అవుతాను అని రేవతి అంటుంది. అది మా బాధ్యత అని రాజ్ అంటే.. మా బాధ్యత కూడా కల్యాణ్ , అప్పు, స్వప్న అంటారు.
కట్ చేస్తే ఇన్నిరోజులు వీడు ఎవరో బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా తెలియలేదు. కానీ, ఈరోజు వాడే వాడి నోటితో ఈ ఇంటితో ఉన్న సంబంధం ఏంటో చెప్పాడు. అసలు వీడు ఎవడో తెలుసా. ఈ ఇంటి వారసుడు. స్వరాజ్ రేవతి కొడుకు అని రుద్రాణి నిజం చెప్పి కుండ బద్ధలు కొడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్‌లో, రేవతి వ్యవహారం మరింత ఉద్రిక్తతను సృష్టిస్తుంది. రుద్రాణి, ప్రకాశం మధ్య ఘర్షణ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.


