|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రో 2: పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? సీక్వెల్ భవితవ్యం ప్రశ్నార్థకం!

Published: 26-03-2026, 10:05 AM
బ్రో 2: పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? సీక్వెల్ భవితవ్యం ప్రశ్నార్థకం!
  • బ్రో సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు సముద్రఖని తెలిపారు.
  • స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది, పవన్ కళ్యాణ్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
  • పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా నిర్ణయం ఆలస్యం కావచ్చు.
  • పవన్ కళ్యాణ్ లేకుంటే మరో హీరోతో సీక్వెల్ తీసే ఆలోచనలో దర్శక నిర్మాతలు.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాకు సీక్వెల్ రాబోతోంది. దర్శకుడు సముద్రఖని స్క్రిప్ట్ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన బిజీగా ఉండటం వల్ల సీక్వెల్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

బ్రో సీక్వెల్ కు సన్నాహాలు పూర్తి

Bro 2: ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయ్యింది అంటే ఆ సినిమాకు తప్పనిసరిగా సీక్వెల్ సినిమాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎప్పటికే ఎన్నో సినిమాలు ప్రకటించి షూటింగ్ పనులను జరుపుకోగా మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే కొన్ని సీక్వెల్ సినిమాలు మాత్రం ప్రకటన వరకు మాత్రమే ఉన్నాయి కానీ తరువాత కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. ఇలా సీక్వెల్ సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరంతేజ్ (Sai Dharam Tej)హీరోలుగా నటించిన చిత్రం బ్రో(Bro). ఈ సినిమాకు ప్రముఖ నటుడు సముద్రఖని(samuthirakani) దర్శకుడిగా వ్యవహరించారు.

ఈ సినిమా 2023వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉండబోతోంది అంటూ పలు సందర్భాలలో దర్శకుడు సముద్రఖని తెలియజేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు మీడియా వారి నుంచి బ్రో సీక్వెల్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే సముద్రఖని ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. బ్రో 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉందని తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం ఎదురుచూపులు

ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయిందని పవన్ కళ్యాణ్ అన్నయ్య నుంచి ఈ సినిమాకు అనుమతి రావడమే ఆలస్యం అంటూ సముద్రఖని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదంటే పవన్ లేకుండానే ఆయన స్థానంలో మరొక హీరోతో ఈ సీక్వెల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా? అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాలి.

బ్రో 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

మరో హీరోతో సీక్వెల్ ఉంటుందా?

ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన పలువురు డైరెక్టర్లతో సినిమాలు చేయబోతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన టీం ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని తెలియజేశారు.. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ బ్రో 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనే సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఈ సినిమా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ ఓజి 2 సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చేయబోతున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక ఆయనకు కాస్త విరామం దొరికితే ఓజి 2 సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం చిత్ర బృందం ఎదురు చూస్తోంది. ఒకవేళ ఆయన అంగీకరించకపోతే, మరో హీరోతో ఈ సీక్వెల్ తెరకెక్కుతుందా అనేది చూడాలి. ఈ విషయంపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.