
📌 Key Points
- ‘పెద్ది’పై భారీ అంచనాలు, రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబో!
- ఖుషీ కపూర్‌కు మొదట కథ చెప్పిన బుచ్చిబాబు సాన.
- జాన్వీ కపూర్‌ను ఎంపిక వెనుక బలమైన కారణం వెల్లడి.
- జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ సినిమా విడుదల!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి బుచ్చిబాబు సాన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు విషయం ఏంటో తెలుసుకుందామా!
ఖుషీ కపూర్‌కు పెద్ది కథ చెప్పిన బుచ్చిబాబు
Buchi Babu Sana On Peddi Story Narrated To Khushi Kapoor First: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే జాన్వీ కపూర్ కంటే ముందుగా పెద్ది కథను ఆమె చెల్లి ఖుషీ కపూర్‌కు చెప్పినట్లు బుచ్చిబాబు సాన చెప్పడం వైరల్ అవుతోంది.
Buchi Babu Sana On Peddi Story Narrated To Khushi Kapoor First: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో ‘ పెద్ది ‘ అనే భారీ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా విడుదల కానున్నట్లు ఇటీవల బుచ్చిబాబు సాన అధికారికంగా ప్రకటించారు.
జాన్వీనే కరెక్ట్ అని బుచ్చిబాబు నిర్ణయం
“ఒకే ఇంట్లో ఉంటూ చెల్లిని వద్దని, అక్కకు కథ చెప్పాల్సి రావడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ విషయానికి ఖుషీ ఎక్కడైనా ఫీలయ్యిందా అని జాన్వీ కపూర్‌ని కూడా అడిగాను” అని పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సాన పేర్కొన్నారు. సినిమాకు ఏది కావాలో ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని, మొదటి నుంచి ఈ పాత్రకు జాన్వీనే కరెక్ట్ అని తన మనసు బలంగా నమ్మిందని ఆయన వివరించారు.
రామ్ చరణ్‌పై బుచ్చిబాబు ప్రశంసలు
ఇటీవల హైదరాబాద్ వీధుల్లో రామ్ చరణ్ , బుచ్చిబాబు కలిసి కారులో తిరుగుతూ ఒక ప్రమోషనల్ వీడియో షూట్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ నటనపై బుచ్చిబాబు ప్రశంసల జల్లు కురిపించారు.
‘పెద్ది’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, ఇలాంటి ఆసక్తికర విషయాలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రామ్ చరణ్, బుచ్చిబాబుల కాంబో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా వెంట ఉండండి!


