
📌 Key Points
- ‘పెద్ది’ పాన్ ఇండియాలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
- బుచ్చిబాబు చేసిన ఒకే ఒక తప్పు – అనవసర ఐటెం సాంగ్.
- జాన్వీ కపూర్ ఓవర్ యాక్షన్, లవ్ ట్రాక్ సినిమాకు మైనస్.
- ఐటెం సాంగ్ లేకుంటే ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ అయ్యేది.
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది! అయితే, దర్శకుడు బుచ్చిబాబు సానా చేసిన ఒక చిన్న పొరపాటు సినిమా బ్లాక్‌బస్టర్ అవకాశాలను దెబ్బతీసిందా? పాన్ ఇండియా వైడ్ పాజిటివ్ టాక్ వస్తున్నా, ఆ ఒక్క అంశంపైనే విమర్శలు ఎందుకు?
ఐటెం సాంగ్ ఎందుకు? బుచ్చిబాబు వివరణ?
Buchibabu Sana : రామ్ చరణ్ పెద్ది సినిమా నిన్న రాత్రి ప్రీమియర్ షో ల నుంచి థియేటర్స్ లో సందడి చేస్తుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అసలు ఇలాంటి కథ, క్లైమాక్స్ ఒక స్టార్ హీరో ఒప్పుకోవడం, తన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించడం అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. సినిమా స్పోర్ట్స్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.
ఈ సినిమా క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా కూడా ఉంది. సినిమా అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. అయితే సినిమాలో చాలా పాజిటివ్ అంశాలు ఉన్నా ఒక విషయం మాత్రం సినిమాకు మైనస్ అయింది. అదే ఐటెం సాంగ్. సినిమా రిలీజ్ కి ముందు హెల్లల్లాల్లో.. అనే ఓ పాటని రిలీజ్ చేసారు. చరణ్, శృతిహాసన్, జాన్వీ కలిసి ఈ పాటలో స్టెప్స్ వేశారు. పాట పర్వాలేదనిపించింది.
జాన్వీ కపూర్ నటనపై విమర్శలు!
అయితే సినిమాలో ఈ పాట ప్లేస్మెంట్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. అంతే కాకుండా అసలు సినిమాలో ఐటెం సాంగ్ కూడా అవసర్లేదు. కానీ ఇరికించారు. ఆ పాట లేకపోయినా కథ నడుస్తుంది. అంతే కాకుండా ఐటెం సాంగ్ కోసం శృతి హాసన్ ని తీసుకొస్తే తనతోనే డ్యాన్స్ వేయించకుండా మధ్యలో జాన్వీ కపూర్ ని కూడా తీసుకొచ్చారు. ఇక ఐటెం సాంగ్ మధ్యలో జాన్వీ ఓవర్ యాక్షన్ సీన్స్ అవసరమా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఆ ఒక్క ఐటెం సాంగ్ లేకపోయింటే సినిమాకు ఇంకా పాజిటివ్ కామెంట్స్, రివ్యూస్, పాజిటివ్ టాక్ ఎక్కువగా వచ్చేది అంటున్నారు. బుచ్చిబాబు చేసిన తప్పు అదొక్కటే అంటున్నారు. మన దర్శకులు కమర్షియల్ అని చెప్పి మంచి సినిమాల్లో కూడా కథకు అక్కర్లేకపోయినా ఐటెం సాంగ్స్ ఎందుకు పెడతారో వాళ్ళకే తెలియాలి.
‘పెద్ది’ కలెక్షన్లపై దీని ప్రభావం?
ఇక సినిమాలో జాన్వీ పోర్షన్స్ కూడా కొంత చిరాకు తెప్పిస్తాయి. జాన్వీ – చరణ్ లవ్ ట్రాక్ సరిగా రాసుకోలేదు. కొన్ని సీన్స్ లో జాన్వీ ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉంటుంది. అది తప్పితే మిగతా సినిమా అంతా పవర్ ఫుల్ గా ఎమోషనల్ గా సాగుతుంది.
‘పెద్ది’ సినిమాపై వస్తున్న ఈ చర్చలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బుచ్చిబాబు తప్పు నిజంగానే సినిమాకు మైనస్ అయిందా? మరిన్ని సంచలన వార్తలు, ప్రత్యేక అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!


