
📌 Key Points
- అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్ట్.
- స్టోరీ లీక్: బన్నీ యంగ్ సైంటిస్ట్‌గా కనిపించనున్నారు.
- యాక్సిడెంట్‌తో కుడి చేయి కోల్పోయి, కృత్రిమ చేయి అమర్చుకుంటారు.
- ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్‌లో అదృశ్య శక్తిని పొంది క్రైమ్‌ను అరికడతారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే వార్త. లోకేష్ కనగరాజ్‌తో ఆయన తదుపరి చిత్రం కథాంశం లీక్ అయింది. ఇందులో బన్నీ సైంటిస్ట్‌గా, అదృశ్య శక్తితో నేరాలను అరికట్టే సూపర్ హీరోగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ ఆసక్తికరమైన కథ అభిమానులను ఉత్సాహపరుస్తోంది.
అల్లు అర్జున్ తదుపరి సినిమా వివరాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మల్టిపుల్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ దాదాపు అయిపోయింది. అయితే ఈ చిత్రం తర్వాత బన్నీ లోకేష్ కనగరాజ్‌తో ‘ఇరుంబుకై మాయావి(Irumbukai Mayavi)’ చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన స్టోరీ లైన్ సోసల్ మీడియాలో లీక్ అయింది. యంగ్ సైంటిస్ట్ ఓ యాక్సిడెంట్‌లో రైట్ హ్యాండ్ కోల్పోతాడు. దీని ప్లేస్‌లో ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టుకుంటాడు. అయితే లేట్ నైట్ ల్యాబ్ ఎక్స్‌పరిమెంట్ సమయంలో ఆయనకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ షాక్ తగులుతుంది. దాని నుంచి వచ్చిన ఎనర్జీతో శరీరం పూర్తిగా ఇన్విజిబుల్‌గా మారుతుంది. ఓన్లీ మెటల్ హ్యాండ్ మాత్రమే కనిపిస్తుంటుంది. దీన్నే క్రైమ్ అరికట్టేందుకు ఉపయోగించే హీరో.. హ్యూమన్ ప్రొటెక్టర్‌గా మారిపోతాడనేది స్టోరీ. కాగా ఈ కథ విన్న అభిమానులు సూపర్ థ్రిల్ అవుతున్నారు. నిజంగా ఇదే కథ అయితే బాక్సాఫీసులు షేక్ కావడం ఖాయం అంటున్నారు.
లోకేష్ కనగరాజ్ మూవీ స్టోరీ లీక్
సైంటిస్ట్ రోల్‌పై ఫ్యాన్స్ రెస్పాన్స్
అల్లు అర్జున్ కొత్త అవతార్, లోకేష్ కనగరాజ్ విజన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విభిన్నమైన కథతో బన్నీ మరోసారి మెప్పించడం పక్కా.


