
అమెరికాలో జరిగిన ‘నాట్స్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్, యాంకర్ శ్రీముఖి యాంకరింగ్‌ను ప్రశంసించారు. ‘రప్పా రప్పా’ అంటూ పొగిడిన బన్నీ మాటలకు శ్రీముఖి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది.
Key Points
అల్లు అర్జున్ అమెరికాలో ‘నాట్స్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయన శ్రీముఖి యాంకరింగ్‌ను ‘రప్పా రప్పా’ అని పొగిడారు.
శ్రీముఖి ఆనందంతో బన్నీ మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్ అమెరికా పర్యటన
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అట్లీ(Atlee) డైరెక్షన్‌లో ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఇక ఇందులో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె(Deepika Padukone), యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్(Kalanidhi Maran) సుమారు రూ. 800 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికా వేదికగా జరిగిన ‘నాట్స్ 2025’(NATS 2025) కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పాల్గొన్నారు. అయితే ఆయనకు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన విజయానికి చిహ్నంగా, తెలుగు గుర్తింపునకు ఒక వెలుగుగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు గర్వానికి నిజమైన చిరునామాగా మారారు. ఈ సందర్భంగా ‘ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులో తెలుగువాళ్లయితే అస్సలు తగ్గేదేలే..’, ‘తెలుగోళ్లంటే ఫైర్ అనుకున్నారా? వైల్డ్ ఫైర్’ అని డైలాగ్స్ చెప్పాడు. ఇక చివర్లో యాంకర్ శ్రీముఖి(Sree Mukhi)ని ఉద్దేశిస్తూ.. మీ యాంకరింగ్ మాత్రం రప్పా రప్పా అని పొగిడేశాడు. దీంతో సంతోషం తట్టుకోలేక శ్రీముఖి తన ఇన్‌స్టాలో బన్నీ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ హార్ట్ సింబల్‌ను హగ్ చేసుకున్న గర్ల్ ఎమోజీని జోడించింది. దీంతో ఈ స్టోరీ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
శ్రీముఖి యాంకరింగ్ పై బన్నీ ప్రశంసలు
వైరల్ అవుతున్న వీడియో
అల్లు అర్జున్ ప్రశంసలతో సంతోషించిన శ్రీముఖి, తన సోషల్ మీడియాలో వీడియోను పంచుకుని అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది. ఈ సంఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది.


