
📌 Key Points
- బన్నీ వాసు మలయాళ నిర్మాతలను హెచ్చరిస్తూ తెలుగు సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
- టొవినో థామస్ నటించిన ‘పళ్లిచట్టంబి’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
- ఈ సినిమా ఒక భారీ కమర్షియల్ మూవీ అని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు.
- తెలుగులో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న మలయాళ నిర్మాతలకు బన్నీ వాసు సూచనలు చేశారు.
ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మలయాళ నిర్మాతలను ఉద్దేశించి తెలుగు సినిమా గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. టొవినో థామస్ నటించిన ‘పళ్లిచట్టంబి’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమాపై బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు
Bunny Vas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాను నిర్మించడం అంతా ఈజీ కాదని అన్నారు నిర్మాత బన్నీ వాసు (Bunny Vas). మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’ (Pallichattambi). ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రెస్టీజియస్ మూవీ.. ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌తో రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
‘పళ్లిచట్టంబి’ సినిమా విడుదల గురించి బన్నీ వాసు
ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. మారుతి ఈ సినిమా ప్రొడ్యూసర్స్ టీమ్‌ను మాకు పరిచయం చేశారు. వాళ్లతో మాట్లాడిన తర్వాత ఒక ప్రతిష్టాత్మక మూవీ చేస్తున్నారని అర్థమైంది. కొచ్చి తీసుకెళ్లి సినిమా చూపించారు. మన తెలుగు వాళ్లు కేరళ వెళ్లి ఇలాంటి ఒక భారీ చిత్రాన్ని నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమా టెక్నికల్‌గా చాలా క్వాలిటీగా, హ్యూజ్ స్కేల్‌లో ఉంటుంది. తెలుగు ఆడియెన్స్‌కు ఒక కొత్త కమర్షియల్ మూవీ అవుతుందని చెప్పగలను. మలయాళం మూవీస్ అంటే మనం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌గా భావిస్తాం కానీ, ఈ సినిమా మాత్రం ఒక భారీ కమర్షియల్ మూవీ. తెలుగులో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. మా దగ్గరకు పదేళ్ల క్రితం వచ్చి, మాతో ట్రావెల్ అయిన మేఘశ్యామ్ ఈ సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేయడం హ్యాపీగా ఉంది.
మలయాళ నిర్మాతలకు బన్నీ వాసు సూచనలు
టొవినో థామస్ చేసిన 2018 చిత్రాన్ని మేము తెలుగులో రిలీజ్ చేశాం. మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో ఆయన నటన, యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. నాకు మోహన్ లాల్‌ను చూసినట్లు అనిపించింది. ఈ సినిమా తర్వాత కయదుకు మరింత మంది ఫ్యాన్స్ పెరుగుతారు. డైరెక్టర్ ఈ మూవీని తీసిన విధానం, ఎడిటింగ్ చేయించిన విధానం బాగా నచ్చింది. ఒక న్యూ కమర్షియల్ మూవీ చూడాలంటే పళ్లిచట్టంబి థియేటర్స్‌లో చూడండి. ఈ చిత్ర నిర్మాతలు తెలుగులో సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే. తెలుగు సినిమా చేయడానికి కంగారు పడకండి. మలయాళంలో సినిమాలు చేయడం చాలా ఈజీ. మలయాళంతో పోల్చుకుంటే తెలుగులో సినిమా చేయడం కొద్దిగా కష్టం. అనుభవం ఉన్న నిర్మాతగా చెబుతున్నాను. తెలుగులో సినిమా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని చిత్ర నిర్మాతలకు ఆయన సూచనలిచ్చారు.
మొత్తానికి బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మలయాళ నిర్మాతలు తెలుగులో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతున్న ఈ సమయంలో ఆయన చేసిన హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


