
తెలుగు సినిమా పరిశ్రమలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీ వాసు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలు త్వరగా ఓటీటీలోకి వెళ్లడం వల్ల థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Key Points
సినిమాలు త్వరగా ఓటీటీకి వెళ్తున్నందున థియేటర్ల మనుగడ ప్రమాదంలో ఉంది.
ఈ ట్రెండ్ కొనసాగితే 90% సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉంది.
పెద్ద హీరోలు తమ సినిమాల రిలీజ్ విధానం గురించి ఆలోచించాలి.
నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రేక్షకులను థియేటర్లకు ఎలా ఆకర్షించాలనే దానిపై దృష్టి పెట్టాలి.
థియేటర్ల మనుగడపై బన్నీ వాసు ఆందోళన
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీ వాసు ( Bunny Vas ) ఆవేదన వ్యక్తం చేశాడు. థియేటర్లలో రిలీజైన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైతే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్లు కనిపించబోవని హెచ్చరించాడు. శుక్రవారం నాడు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా టాలీవుడ్‌లో నెలకొన్న సంక్షోభం గురించి ఓ ట్వీట్ చేశాడు.
ఈ ట్రెండ్ కొనసాగితే.. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పర్సంటేజీ సిస్టం గురించి మాట్లాడుకునేబదులు… ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలా? అని ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి? అనేది ఆలోచించాలి. ఇక సినిమా రిలీజైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి.
ఓటీటీ ప్రభావం: సింగిల్ స్క్రీన్ల భవిష్యత్తు
పెద్ద హీరోలు ఆలోచించాలి ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకో సినిమా, మూడేండ్లకో సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలోనే చాలామంది థియేటర్ యజమానులు వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. పెద్ద హీరోలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సింగిల్ స్క్రీన్స్ మూతపడి కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అని రాసుకొచ్చాడు.
పెద్ద హీరోల బాధ్యత
చివరగా, బన్నీ వాసు హెచ్చరికను తీవ్రంగా పరిగణించి, థియేటర్లను కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది పరిశ్రమ మనుగడకు చాలా ముఖ్యం.


