|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జూన్‌ నుంచి జోరుగా…

Published: 27-05-2025, 3:47 PM
జూన్‌ నుంచి జోరుగా...

విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా జూన్ నుంచి చిత్రీకరణ ప్రారంభించనుంది. టబు, విజయ్ కుమార్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా అనేక భాషల్లో విడుదల కానుంది.

Key Points

1

విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా

2

టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించనున్నారు

4

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల

చిత్రీకరణ ప్రారంభం

లొకేషన్‌ సెర్చ్‌ చేస్తున్నారు పూరి జగన్నాథ్‌. విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టబు, కన్నడ నటుడు విజయ్‌ కుమార్‌  కీలకపాత్రల్లో నటించనున్నారు.

పూరి జగన్నాథ్, చార్మి కౌర్‌  నిర్మించనున్నారు. జూన్‌ చివరి వారంలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. షూటింగ్‌ ఆరంభించినప్పటి నుంచి మొత్తం సినిమా పూర్తయ్యేవరకూ షెడ్యూల్స్‌ని జోరుగా జరిపేలా ప్లాన్‌ చేశారట. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై ఏరియాల్లో లొకేషన్స్‌ రెక్కీ చేస్తోంది పూరి అండ్‌ టీమ్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

నటీనటులు

విడుదల వివరాలు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానున్నందున అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. చిత్రీకరణ జోరుగా సాగుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.