
ఇటీవల మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు చేసిన సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చకు దారితీశాయి. తన సినిమాను తొక్కేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై వివరణ ఇస్తూ, సొంత థియేటర్లు ఉన్నా ఇతర సినిమాలకు సహకరిస్తున్నానని స్పష్టం చేశారు. చిత్రసీమ బాగుండాలనేదే తన కోరిక అన్నారు.
Key Points
నా సినిమాను తొక్కేయాలని చూస్తున్నారని బన్నీ వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సొంత థియేటర్లు ఉన్నా ఇతర సినిమాలకు రెండు షోలు ఇస్తున్నానని వివరణ.
గుడివాడ సింధూర థియేటర్ పెద్ద సినిమాకు ఇచ్చి, తన సినిమా చిన్న థియేటర్లో వేశారు.
గీత ఫిలిమ్స్ ఆధ్వర్యంలో కూడా ఇతర సినిమాలకు థియేటర్ల సహకారం.
బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు
Bunny Vasu : ఇటీవల మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు నన్ను, నా సినిమాని తొక్కాలని చుస్తున్నారు. మాపై నెగిటివ్ ట్రోలింగ్ డబ్బులిచ్చి చేయించారు అని సంచలన వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది. దీంతో దీనిపై టాలీవుడ్ నుంచి ఎవరో ఒకరు స్పందిస్తున్నారు.(Bunny Vasu)
బుధవారం రాత్రి మిత్రమండలి ప్రెస్ మీట్ నిర్వహించగా అందరూ అన్ని సినిమాలు బాగా ఆడాలి అని మీడియా ముందు చెప్తున్నారు, కానీ నెగిటివిటి చేస్తున్నారు అని అంటున్నారు అనే ప్రశ్న ఎదురవ్వగా బన్నీ వాసు స్పందించారు.
నా థియేటర్లను ఇతర సినిమాలకు ఇచ్చా
Also See : Mamitha Baiju : స్టేజిపై స్టెప్పులేసిన ‘డ్యూడ్’.. ప్రేమలు బ్యూటీ మమిత బైజు క్యూట్ ఫొటోలు..
బన్నీ వాసు మాట్లాడుతూ.. నా సొంత థియేటర్స్, నేను లీజుకు తీసుకున్న థియేటర్స్ లో నా సినిమాకు రెండు షోలు వేసుకొని, వేరే సినిమాకు రెండు షోలు ఇచ్చాను. గుడివాడ సింధూర థియేటర్ నాదైనా నా సినిమా కంటే పెద్ద సినిమాకే ఆ థియేటర్ ఇచ్చాను. నా సినిమా ఇంకో చిన్న థియేటర్ లో వేసుకున్నా. నా థియేటర్ ఉంది కదా అని నా సినిమా నాలుగు షోలు వేసుకోలేదు. వేరే సినిమాలకు కూడా రెండు షోలు ఇస్తున్నా. గీత ఫిలిమ్స్ ఆధ్వర్యంలో గోదావరి జిల్లాల్లో ఉన్న థియేటర్స్ లో కూడా వేరే సినిమాలకు కోపరేట్ చేస్తున్నాము. ఇంకా ఇంతకంటే ఏం చెప్పను నేను. నా సినిమా, నా సొంత డబ్బులు వదులుకొని అవతలి సినిమాకు థియేటర్స్ ఇస్తున్నాను అంటే సినిమాలు బాగుండాలని కోరుకున్నందుకే కదా అని అన్నారు.
చిత్రసీమకు నా వంతు సహకారం
Also See : Dude Pre Release Event : ‘డ్యూడ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
బన్నీ వాసు వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. తన సినిమాను పక్కన పెట్టి మరీ ఇతర సినిమాలకు థియేటర్లు ఇస్తున్నానని చెప్పిన ఆయన, అందరూ కలిసికట్టుగా ఉంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుందని ఆకాంక్షించారు.


