
📌 Key Points
- బన్నీ వాసు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.
- ఒకే నిర్మాతగా ఇద్దరితో సినిమాలు తీయాలని బన్నీ వాసు కోరిక.
- వారి కెరీర్ బెస్ట్ చిత్రాలు అందించాలని ఆయన లక్ష్యం.
- పవన్ కళ్యాణ్ రాజకీయాలు, అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమాలు సవాళ్లు.
నిర్మాత బన్నీ వాసు తన జీవితకాల కోరికను పంచుకున్నారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో తాను సింగిల్ నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మించాలని తెలిపారు. ఈ కల నెరవేరుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
బన్నీ వాసు – అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో అనుబంధం
Bunny Vasu : నిర్మాత బన్నీ వాసు అటు అల్లు అర్జున్ కి క్లోజ్, ఇటు పవన్ కళ్యాణ్ కి క్లోజ్. గంగోత్రి సినిమా నుంచే అల్లు అర్జున్ తో నడుస్తూ తన పేరునే బన్నీ వాసుగా మార్చేసుకున్నాడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఇండస్ట్రీకి వచ్చి జల్సా నుంచి ఆయనతో ప్రయాణం చేస్తూ జనసేనలో ప్రచార బాధ్యతలు తీసుకునే స్థాయికి ఎదిగారు బన్నీ వాసు.(Bunny Vasu)
తాజాగా 10 టీవీ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీకంటూ ఏదైనా కోరిక ఉందా, తీరని కల ఉందా అని అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పారు.
నిర్మాతగా బన్నీ వాసు కల: సింగిల్ కార్డ్ ప్రాజెక్ట్
బన్నీ వాసు మాట్లాడుతూ.. బన్నీ గారితో డైరెక్ట్ నిర్మాతగా చేయాలి. ఏ రోజుకైనా కళ్యాణ్ గారితో కూడా నిర్మాతగా సినిమా చేయాలి. నిర్మాతగా సింగిల్ కార్డు పడాలి. వాళ్ళిద్దరితో సినిమాలు సింగిల్ నిర్మాతగా చేయాలి. కానీ జరుగుద్దో లేదో చూడాలి. ఎలాంటి స్టోరీ చేయాలి అని కూడా అనుకున్నాను. వాళ్ళ కెరీర్ బెస్ట్ ఇవ్వాలి. దేవుడు రాసి పెడితే జరుగుతుంది అని తెలిపారు.
భారీ ప్రాజెక్ట్స్: కల నెరవేరుతుందా?
పవన్ ఏమో రాజకీయాల్లో బిజీ ఉన్నారు, సినిమాలు చేస్తారో లేదో క్లారిటీ లేదు. ఇక బన్నీ ఏమో అన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. బన్నీతో సినిమా చేయాలంటే వందల కోట్లు కావాల్సిందే. మరి ఈ ఇద్దరితో సింగిల్ కార్డు నిర్మాతగా బన్నీ వాసు కల నెరవేరుతుందా చూడాలి.
బన్నీ వాసు డ్రీమ్ ప్రాజెక్ట్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో సింగిల్ నిర్మాతగా సినిమా చేయాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


