|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీమంతం గ్లింప్స్‌: రక్తపు మడుగులో గర్భిణీ

Published: 09-08-2025, 4:45 AM
సీమంతం గ్లింప్స్‌: రక్తపు మడుగులో గర్భిణీ

టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మితమవుతున్న ‘C-మంతం’ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్‌లో గర్భిణీ మహిళ రక్తపు మడుగులో ఉన్న దృశ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్లాసిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా…

Key Points

1

C-మంతం సినిమా గ్లింప్స్ విడుదల

2

గర్భిణీ మహిళ రక్తపు మడుగులో ఉన్న దృశ్యం ప్రధాన ఆకర్షణ

4

సుధాకర్ పాణి దర్శకత్వం, ఎస్. సుహాస్ సంగీతం

C-మంతం గ్లింప్స్ విడుదల

టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘C-మంతం’ ( Cmantham Movie ). ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను చిత్ర బృందం శనివారం (ఆగస్టు 9న) విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. క్లాసిక్ థ్రిల్, ఎమోషనల్ డెప్త్ కలగలిసినట్లుగా కనిపించే ఈ గ్లింప్స్‌లో విజువల్స్, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ముఖ్యంగా గర్భిణీ మహిళ చేతులు వెనక్కి కట్టిన దృశ్యం.. రక్తపు మడుగు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. దర్శకుడు సుధాకర్ పాణి ఈ  సినిమాను కొత్తగా చూపించడానికి ప్రయత్నించారని గ్లింప్స్‌తోనే అర్థమవుతోంది ప్రశాంత్ టాటా నిర్మాతగా, గాయత్రీ సౌమ్య గుడిసెవా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ గ్లింప్స్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రక్తపు మడుగులో గర్భిణీ దృశ్యం

థ్రిల్లింగ్ మరియు ఎమోషనల్ అంశాలు

C-మంతం సినిమా గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. సుధాకర్ పాణి దర్శకత్వం, ఎస్. సుహాస్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.