|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సముద్రఖని ‘కార్మేని సెల్వం’: అప్పుల తిప్పలు! ఫ్యామిలీ డ్రామాతో హిట్ కొట్టేనా? వైరల్ రివ్యూ!

Published: 03-04-2026, 7:35 AM
సముద్రఖని 'కార్మేని సెల్వం': అప్పుల తిప్పలు! ఫ్యామిలీ డ్రామాతో హిట్ కొట్టేనా? వైరల్ రివ్యూ!
  • సముద్రఖని నటనతో సినిమా మరో స్థాయికి చేరిక!
  • ఫ్యామిలీ ఎమోషన్స్, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు!
  • దర్శకుడు రామ్ చక్రి సక్సెస్ – తప్పటడుగులు వేయకూడదనే ఆలోచన!
  • గౌతమ్ మీనన్ కీలక పాత్రలో అద్భుత నటన కనబరిచారు!

సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన కార్మేని సెల్వం మూవీ విడుదలైంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీకొడుకుల అనుబంధం ఎలా ఉందో చూద్దాం. మూవీ రివ్యూ కోసం చదవండి!

సెల్వం అప్పుల వెనుక కథేంటి?

Carmeni Selvam Review In Telugu: విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ కార్మేని సెల్వం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీకొడుకుల బంధం, సామాజిక బాధ్యత నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి కార్మేని సెల్వం రివ్యూలో చూద్దాం.

నటీనటులు: సముద్రఖని, గౌతమ్ మీనన్, అభినయ, లక్ష్మీ ప్రియ, జాంగిరి మధుమితి, బడవ గోపి తదితరులు

కథ, దర్శకత్వం: రామ్ చక్రి

సంగీతం: మ్యూజిక్‌క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ (రామానుజన్ ఎంకే)

సినిమాటోగ్రఫీ: యువరాజు దక్షణ్

సముద్రఖని నటన ఎలా ఉంది?

ఎడిటింగ్: జగన్ ఆర్‌వీ, దినేష్ ఎస్

విడుదల తేది: 03 ఏప్రిల్ 2026

నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన తాజాగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా కారేమెని సెల్వం. ఇందులో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్ర పోషించారు.

సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (ఏప్రిల్ 3) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కార్మేని సెల్వం రివ్యూ లో తెలుసుకుందాం.

అప్పులు అంటేనే పడని సెల్వం అప్పులు ఎందుకు చేశాడు?, అవి తీర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు?, సమాజంలోని కుళ్లు రాజకీయాలు, స్వార్థపూరిత నిర్ణయాలు అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తన ఆశయాల కోసం అతను చేసిన పోరాటం ఏంటి? చివరికి కోడుకు, భార్య కోసం సెల్వం ఏం చేశాడు? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.

డైరెక్షన్ మరియు సినిమాటోగ్రఫీ!

అలా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా పాతదే అయినప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. సినిమా ఆరంభం కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ, పాత్రల పరిచయం తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా సముద్రఖని తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, సమాజం పట్ల తపన ఉన్న వ్యక్తిగా ఆయన అద్భుతంగా నటించారు.

బంధుమిత్రుల మాటలు, ఇతరులను చూసి గొప్పగా బతకలానే భావనతో మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామే చూపించే సినిమా ఇది. అందులో డైరెక్టర్ రామ్ చక్రి బాగా సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్ అందరిలో తప్పు చేయకూడదనే ఆలోచనను రేకెత్తిస్తుంది.

లక్ష్మీ ప్రియ సహజ నటనతో అలరించారు. సెల్వం కుమారుడిగా చేసిన బాబు కూడా మెప్పిస్తాడు. మిగతా పాత్రలు సైతం పర్వాలేదనిపించాయి. నేపథ్య సంగీతం కథలోని మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది, పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. ముఖ్యంగా రెండో భాగంలో కొన్ని సాగతీత సీన్లను తగ్గించి ఉంటే బాగుండేది.

హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్.

సమాజానికి ఇచ్చే మంచి సందేశం.

కార్మేని సెల్వం మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. సముద్రఖని నటన అద్భుతంగా ఉంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.