|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్మెని సెల్వం టీజర్: డబ్బు మాయలో బంధీ అయిన జీవితాల కథ!

Published: 12-03-2026, 3:35 PM
కార్మెని సెల్వం టీజర్: డబ్బు మాయలో బంధీ అయిన జీవితాల కథ!
  • ‘కార్మెని సెల్వం’ టీజర్ విడుదల
  • సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం
  • డబ్బు సంపాదన మార్గాలపై చిత్రం కథ
  • ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది

రామ్ చక్రి దర్శకత్వంలో సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కార్మెని సెల్వం’. ఈ సినిమా టీజర్ విడుదలైంది. డబ్బు సంపాదించే విధానంపై చిత్రం ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తుంది.

టీజర్ విడుదల: డబ్బు గురించిన కథ

Carmeni Selvam Teaser: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కార్మేని సెల్వం’ (Carmeni Selvam). విలక్షణ నటుడు సముద్రఖని (Samuthirakani) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ వంటి వారంతా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ టీజర్‌ (Carmeni Selvam Teaser)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే..

సముద్రఖని నటనలో వాస్తవికత

ఈ టీజర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ప్రస్తుత సమాజానికి చాలా రిలేటెడ్‌గా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మానవుని మనుగడ మొత్తం డబ్బుపైనే ఆధారపడి నడుస్తుంది. ఈ డబ్బు సంపాదించడం కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. అలాంటి కాన్సెప్ట్‌తోనే ఈ మూవీ తెరకెక్కినట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది. ‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి’ అని సముద్రఖని వాయిస్ ఓవర్‌తోనే ఈ టీజర్ మొదలైంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలను ఇందులో వివిధ కోణాల్లో చూపిస్తూ.. నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనల విధానాలు ఎలా ఉన్నాయో తెలియజేయడం చూస్తుంటే.. చాలా నేచురల్ కథ ఇదని తెలుస్తోంది. ఈ టీజర్‌లోని ఫస్ట్ డైలాగే సినిమాపై క్యూరియాసిటిని పెంచేస్తోంది.

ప్రస్తుత సమాజానికి దగ్గరగా చిత్రం

ఇక ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే సంచలన నిర్ణయాలు ఈ కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. లక్ష్మీ ప్రియ ఆయన భార్యగా, చిన్న కుమారుడితో కుటుంబ జీవితం చూపిస్తుండగా, మరోవైపు విదేశాల్లో ఒంటరిగా కనిపించే కొన్ని షాట్లు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్ర ఇంపార్టెన్స్ ఏంటనేది ఇందులో చెప్పలేదు కానీ, ఆయన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. టీజర్ చివరిలో.. ‘ధనవంతుడు అవ్వాలంటే ముందు ధనవంతుడిలా బతకడం నేర్చుకోవాలి. లెక్క లేకుండా ఖర్చు పెట్టండి.. డబ్బు లేకపోతే అప్పు చేసైనా ఖర్చు చేయండి’ అని సముద్రఖని చెప్పే డైలాగ్.. ఈ సినిమా ఎందుకు చూడాలో తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్‌లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బ్రో’ సినిమాతో కొట్టినట్లుగా ఈ సినిమాతో కూడా సముద్రఖని మంచి హిట్ కొట్టబోతున్నాడనేలా.. ఈ టీజర్ విడుదల అనంతరం టాక్ నడుస్తుండటం విశేషం.

కార్మెని సెల్వం టీజర్ ఆసక్తికరంగా ఉంది. డబ్బు చుట్టూ తిరిగే జీవితాల కథతో ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.