|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాటాలన్‌ మూవీ.. పవర్‌ఫుల్‌ లుక్‌లో హీరో

Published: 12-10-2025, 8:19 AM
కాటాలన్‌ మూవీ.. పవర్‌ఫుల్‌ లుక్‌లో హీరో

అంటోని వర్గీస్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్’ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. పవర్‌ఫుల్‌ లుక్‌లో హీరో కనిపించి సినిమాపై భారీ అంచనాలు పెంచాడు. మలయాళం, తెలుగు సహా పలు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పుడు సినీ ప్రియులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Key Points

1

అంటోని వర్గీస్ హీరోగా 'కాటాలన్' యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ విడుదలైంది.

2

హీరో మాస్, ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

4

తెలుగు నటుడు సునీల్, కబీర్ దుహాన్ సింగ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పవర్‌ఫుల్‌ లుక్‌లో హీరో అంటోని వర్గీస్

అంటోని వర్గీస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్”. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో హీరో మాస్‌ అవతార్‌లో కనిపిస్తున్నాడు. మంటల చుట్టూ సిగరెట్‌తో, కళ్లలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అదిరిపోయింది. రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ ఇన్‌టెన్సిటీని సూచిస్తున్నాయి.

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ “మార్కో” తర్వాత, క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కాటాలన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే పాన్-ఇండియా కాన్సెప్ట్‌గా భారీ స్థాయిలో నిర్మిస్తునారు. పాల్ జార్జ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థాయ్‌లాండ్ యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఒంగ్-బాక్ సిరీస్ యాక్షన్ డైరెక్టర్ కెచా ఖాంఫఖ్డీ తన టీమ్‌తో కలిసి రూపొందించారు. అదే సిరీస్‌లో నటించిన పాంగ్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది.

పాన్-ఇండియా రేంజ్‌లో ‘కాటాలన్’

ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాటాలన్ లో తెలుగు నటుడు సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ప్రముఖ నటీనటులతో భారీ తారాగణం

‘కాటాలన్’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల, భారీ తారాగణం, పాన్-ఇండియా రిలీజ్‌తో అంచనాలను పెంచుతోంది. యాక్షన్ ప్రియులను అలరించేందుకు ఈ చిత్రం సిద్ధంగా ఉంది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.