|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెండి దిగుమతులపై కేంద్రం సంచలన నిర్ణయం: వ్యాపారులకు భారీ షాక్!

Published: 16-05-2026, 5:01 PM
వెండి దిగుమతులపై కేంద్రం సంచలన నిర్ణయం: వ్యాపారులకు భారీ షాక్!
  • కేంద్రం అన్ని రకాల వెండి దిగుమతులపై నిషేధం విధించింది.
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
  • ఇకపై వెండి దిగుమతులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
  • ఈ కొత్త నిబంధనలు వ్యాపారస్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని పెంచిన కేంద్రం, ఇప్పుడు వెండి దిగుమతులపై పూర్తి నిషేధం విధించి మరో షాకిచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయి.

వెండి దిగుమతులపై పూర్తి నిషేధం!

బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని ఇటీవలే కేంద్రప్రభుత్వం 15 శాతానికి పెంచి షాకిచ్చింది. దాని నుంచి తేరుకునేలోపే.. కొనుగోలుదారులకు మరో పిడుగులాంటి వార్త చెప్పింది. పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. అన్ని రకాల వెండి దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోకి వచ్చే వెండి దిగుమతుల్ని మరింత కఠినంగా పర్యవేక్షించడం, క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని DGFT పేర్కొంది.

99.9 శాతం ప్యూరిటీ ఉన్న సిల్వర్ బార్స్ గతంలో ఫ్రీ కేటగిరీలో ఉంచేది. వీటిని ఇప్పుడు నిషేధిత లేదా నియంత్రిత కేటగిరీలోకి మారుస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇతర నిర్దిష్ట వెండి బిస్కెట్లను కూడా నియంత్రిత జాబితాలోకి చేర్చారు. ఈ నిబంధనలతో ఇకపై వెండిని ఇష్టానుసారం దిగుమతి చేసుకునే వీలుండదు. వెండిని దిగుమతి చేసుకోవాలంటే.. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇటీవలే అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద బంగారంపై కేంద్రం 100 కిలోల పరిమితిని విధించింది. ఈ స్కీమ్ కింద దేశీయ జ్యువెలరీ ఎగుమతిదారులు తమకు కావలసిన బంగారాన్ని జీరో డ్యూటీతో దిగుమతి చేసుకునే వీలుంటుంది. దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. అడ్వాన్స్ ఆథరైజేషన్, పర్యవేక్షన నియమ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బంగారం, వెండి దిగుమతులపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాలు వ్యాపారస్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

డీజీఎఫ్‌టీ కీలక నోటిఫికేషన్

వ్యాపారులపై తీవ్ర ప్రభావం

వెండి దిగుమతులపై కేంద్రం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం దేశీయ వ్యాపార రంగంపై, ముఖ్యంగా జ్యువెలరీ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపనుంది. భవిష్యత్తులో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.