
హీరో చైతన్య రావు, సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమైంది. శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్లలో తెరకెక్కుతున్న ఈ మూవీతో ఐరా, సాఖీ అనే ఇద్దరు కొత్త హీరోయిన్లు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. క్రాంతి మాధవ్‌తో తనకున్న మూడేళ్ల బంధం గురించి చైతన్య రావు ఈ సందర్భంగా పంచుకున్నారు.
Key Points
చైతన్య రావు హీరోగా శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్‌లో కొత్త సినిమా ప్రారంభం.
ఈ సినిమాతో ఐరా, సాఖీ అనే ఇద్దరు కొత్త హీరోయిన్లు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు.
సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వం; కొంచెం గ్యాప్ తర్వాత ఆయన మూవీ.
క్రాంతి మాధవ్‌తో మూడేళ్ల బంధం, బ్యాక్ టు బ్యాక్ చిత్రాలపై చైతన్య రావు ఆనందం.
కొత్త హీరోయిన్లతో చైతన్య రావు సినిమా ప్రారంభం
శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద చైతన్య రావు మదాడి హీరోగా పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి ప్రొడక్షన్ నెంబర్. 5 ని ప్రారంభించారు. ఈ సినిమాతో ఐరా, సాఖీ ఇద్దరు కొత్త హీరోయిన్లు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.
‘ ఓనమాలు ’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ సెన్సిబుల్ స్టోరీలతో ఆకట్టుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ ఫుల్ కథతో అందరినీ అలరించేందుకు ఈ సినిమాతో రెడీగా ఉన్నారు. కొంచెం గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
దసరా సందర్భంగా ఈ మూవీని ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 3) నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి మయసభ డైరెక్టర్ దేవ కట్టా క్లాప్ కొట్టగా, కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా.. తొలి సన్నివేశానికి వర ముళ్లపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చైతన్య రావు: మూడేళ్ల అనుబంధం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హీరో చైతన్య రావు మాట్లాడుతూ .. “శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు బ్యానర్‌లో పూర్ణా నాయుడు, శ్రీకాంత్ నిర్మాతలుగా క్రాంతి మాధవ్ అన్న దర్శకత్వంలో మూవీని చేస్తున్నాను. క్రాంతి అన్నతో నాది మూడేళ్ల బంధం. ఆయనతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాను. 2026లోనే ఆయనతో చేస్తున్న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి” అని అన్నారు.
“నాకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చాలా ఇష్టమైన సినిమా. ఆయన నాకెంతో ఇష్టమైన దర్శకుడు. ఆయనతో వరుసగా రెండు చిత్రాలు చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇంత కంటే ఎక్కువగా నేను ఆ దేవుడ్ని ఏదీ కోరుకోను” అని చైతన్య రావు తెలిపారు.
” ఓటీటీ సిరీస్ ‘మయసభ’, అనుష్క ‘ఘాటీ’ తరువాత ఇంత మంచి సినిమాను చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఓ సినిమా చేస్తున్నాను అంటే.. ఏదో ఒకటి కొత్తగా ఉంటుందనే ఆడియెన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను” అని హీరో చైతన్య రావు చెప్పుకొచ్చారు.
“మయసభ, అనుష్క ఘాటి తర్వాత” – చైతన్య రావు మాటలు
“ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. క్రాంతి అన్న చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఐరా, సాఖీలకు ఆల్ ది బెస్ట్. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్” అని చైతన్య రావు తన స్పీచ్ ముగించారు.
నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ .. “క్రాంతిని నేను దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాను. కానీ, ఇన్నాళ్లకు మా ఇద్దరికీ సమయం కుదిరింది. క్రాంతి చెప్పే కథలంటే నాకు చాలా ఇష్టం. శ్రీకాంత్ నా ప్రతీ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అవుతూనే ఉంటారు. త్వరలోనే మరిన్ని వివరాల్ని తెలియజేస్తాం” అని వెల్లడించారు.
చైతన్య రావు, క్రాంతి మాధవ్ కలయికలో వస్తున్న ఈ కొత్త ప్రేమకథ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘మయసభ’, ‘అనుష్క ఘాటి’ వంటి చిత్రాల తర్వాత చైతన్య రావు ప్రేక్షకులకు మరో వైవిధ్యమైన కథను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.


