|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఛాంపియన్ విజయ్ దేవరకొండ: ఆ ఒక్క పాత్ర లేకుంటే ఈ గోల్డెన్ బాయ్ లేడా?

Published: 18-12-2025, 7:44 AM
ఛాంపియన్ విజయ్ దేవరకొండ: ఆ ఒక్క పాత్ర లేకుంటే ఈ గోల్డెన్ బాయ్ లేడా?
  • వైజయంతి బ్యానర్ జగదేకవీరుడు వంటి బ్లాక్ బస్టర్లను నిర్మించి, ఒక ప్రత్యేకమైన చరిత్రను కలిగి ఉంది.
  • ఎన్టీఆర్ సినిమా డిజాస్టర్ తర్వాత వైజయంతి బ్యానర్ క్లిష్ట పరిస్థితుల్లో, ఎవడే సుబ్రమణ్యం విజయంతో మళ్ళీ పుంజుకుంది.
  • ఎవడే సుబ్రమణ్యం సినిమా వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కు, అలాగే విజయ్ దేవరకొండ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.
  • ‘ఛాంపియన్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా #MyChampion హ్యాష్‌ట్యాగ్‌తో సినీ ప్రముఖులు తమ ఛాంపియన్లను వెల్లడిస్తున్నారు.

వైజయంతి మూవీస్ ‘ఛాంపియన్’ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కెరీర్‌కు ‘ఎవడే సుబ్రమణ్యం’ పాత్ర ఎలా కీలకంగా మారిందో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పటి డిజాస్టర్ల నుండి వైజయంతి తిరిగి నిలబడటానికి నాగ్ అశ్విన్ ఎలా కారణమయ్యాడో వివరించే ప్రయత్నం.

వైజయంతి మూవీస్: ఎత్తుపల్లాల ప్రస్థానం

Champion Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ బ్యానర్స్ లో వైజయంతి మూవీ బ్యానర్ ఒకటి. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఈ బ్యానర్ నిర్మించింది. వైజయంతి బ్యానర్ కి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమా ఈ బ్యానర్ లో ఒక సంచలనం. అందరి టైము అందరికీ ఒకేలా నడవదు. జీవితం అంటేనే ఎత్తు పల్లాలు రావడం సహజంగా జరుగుతుంది. ఇలాంటి సంఘటన వైజయంతి బ్యానర్ కి కూడా ఎదురయింది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమాను నిర్మించింది వైజయంతి బ్యానర్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా కంప్లీట్ డిజాస్టర్ గా మారిపోయింది. ఇక్కడితో వైజయంతి బ్యానర్ పని అయిపోయింది అని దాదాపు అందరూ డిసైడ్ అయిపోయారు. ఆల్మోస్ట్ సినిమాలు నిర్మించడం కూడా తగ్గించేద్దాం అని అశ్విని దత్ కూడా ఫిక్స్ అయిపోయారు.

సినిమాలు ఆపేద్దాం అనుకునే తరుణంలో నాగ్ అశ్విన్ చెప్పిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను నిర్మించింది ఈ బ్యానర్ కి అనుసంధానంగా ఉన్న స్వప్న సినిమాస్. ఎవడే సుబ్రమణ్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ అశ్విని దత్ కు అల్లుడు అయిపోయాడు.

వైజయంతి బ్యానర్ లో వచ్చిన మహానటి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ బ్యానర్ ఒక రేంజ్ సక్సెస్ లో ఉంది కల్కి వంటి పాన్ ఇండియా సక్సెస్ కూడా నాగ్ అశ్విని ఈ సంస్థకు అందించాడు. ఇక ప్రస్తుతం వైజయంతి బ్యానర్ లో వస్తున్న సినిమా ఛాంపియన్.

విజయ్ దేవరకొండ కెరీర్ టర్నింగ్ పాయింట్

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదల కానుంది ఈ తరుణంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో అద్భుతమైన ప్లాన్ వేసింది. వైజయంతి బ్యానర్ ట్విట్టర్ వేదికగా.. మనం నడిచే ప్రతి దారిలోనూ మనకు స్ఫూర్తినిచ్చే ఒక ఛాంపియన్ ఉంటారు. తెరపై మన ఛాంపియన్ రోషన్ అయితే, తెర వెనుక మనల్ని నడిపించే శక్తి ఎల్లప్పుడూ అశ్విని దత్ గారే. మీ జీవితంలో ఛాంపియన్ ఎవరు? మాకు చెప్పండి.

Every step I take, every dream I chase, #MyChampion is an expectation i have of myself.

Who’s your Champion @dulquer ? 😉

Excited for the #Champion trailer tonight. All the very best Roshan! https://t.co/re2a2GzTHG

‘ఛాంపియన్’ మూవీ ప్రమోషన్స్ విశేషాలు

— Vijay Deverakonda (@TheDeverakonda) December 18, 2025

#MyChampion ఉపయోగించి ట్వీట్ చేయండి లేదా షేర్ చేయండి, మేము వారిని సన్మానిస్తాము. మన గోల్డెన్ బాయ్ రిషితో దీనిని ప్రారంభిద్దాం. విజయ్ దేవరకొండ, మీ ఛాంపియన్ ఎవరు? అంటూ ట్వీట్. ఎవడే సుబ్రహ్మణ్యం లో విజయ్ దేవరకొండ నటించిన పాత్ర పేరు రిషి. ఆ సినిమా కేవలం విజయ్ కెరీర్ కి మాత్రమే కాకుండా బ్యానర్ కి కూడా మంచి ప్లస్ అయింది. ఆ పాత్ర చూసి సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ గురించి ఇంకా మాట్లాడాల్సిన పనిలేదు. ఇక ఛాంపియన్ అని ట్యాగ్ పెట్టి మెన్షన్ చేయాలి కాబట్టి దుల్కర్ సల్మాన్ ను ట్యాగ్ చేశాడు విజయ్.

‘ఛాంపియన్’ మూవీ ప్రమోషన్స్ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. వైజయంతి, విజయ్ దేవరకొండల ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.