|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చంద్రహాస్‌ సంచలనం: జేడీ చక్రవర్తి డబుల్ గేమ్? పెద్ద సినిమాలపై షాకింగ్ కామెంట్స్!

Published: 06-02-2026, 11:35 PM
చంద్రహాస్‌ సంచలనం: జేడీ చక్రవర్తి డబుల్ గేమ్? పెద్ద సినిమాలపై షాకింగ్ కామెంట్స్!
  • చంద్రహాస్ కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ విడుదల, మిశ్రమ స్పందన!
  • సినిమా ప్రమోషన్స్‌లో అసభ్య పదాలు వాడినందుకు చంద్రహాస్‌పై విమర్శలు, కేసు నమోదు!
  • పెద్ద సినిమాల్లోని వల్గర్ కంటెంట్‌ను ఎందుకు ప్రశ్నించరు అని చంద్రహాస్ ప్రశ్న!
  • సపోర్ట్ చేసి విమర్శించిన జేడీ చక్రవర్తిపై చంద్రహాస్ సంచలన ఆరోపణలు!

హీరో చంద్రహాస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జేడీ చక్రవర్తి చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడంతో మరింత దుమారం రేగింది.

చంద్రహాస్‌పై విమర్శలు వెనుక అసలు కారణం?

సీనియర్‌ నటుడు ప్రభాకర్‌ కొడుకు చంద్రహాస్‌ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన `బరాబర్‌ ప్రేమిస్తా` అనే చిత్రంతో ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కులం, పరువు హత్యలకు సంబంధించిన సబ్జెక్ట్ తో వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కానీ ఆడియెన్స్ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. బుకింగ్స్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీనికి కారణం చంద్రహాస్‌ చేసుకున్న వివాదమే. ఆయన ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా `గుంజి గుంజి` అంటూ పాట పాడారు.

ఈ పాటలో ఆయన రెండు వల్గర్‌ పదాలను ఉపయోగించాడు. సినిమా పాటలో లేని పదాలను తానే స్వతహాగా జోడించి పాడాడు. దీంతో అందరు షాక్‌ అయ్యారు. ఈ ఈవెంట్‌లో జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్‌ వంటి వారు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రహాస్‌ని వీరంతా అభినందించారు. క్లాప్స్ కొట్టారు. వెరైటీ పబ్లిసిటీ విషయంలో చంద్రహాస్‌ని అభినందించారు. కానీ ఆతర్వాత చంద్రహాస్‌ పాడిన ఆ పాట ట్రోల్‌కి గురయ్యింది. సోషల్‌ మీడియాలో, టీవీల్లో బాగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జేడీ చక్రవర్తి స్పందిస్తూ, క్షమాపణలు చెప్పారు. అప్పుడే తాను దాన్ని ఖండించాల్సింది, లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సింది అని తెలిపారు. దీనికితోడు చంద్రహాస్‌ పై పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు.

పెద్ద సినిమాల వల్గర్ కంటెంట్‌పై చంద్రహాస్ ఫైర్!

కొందరు చంద్రహాస్ బహిరంగంగానే తిడుతున్నారు. ఈ క్రమంలో దీనికి రియాక్ట్ అయ్యాడు చంద్రహాస్‌. అదే సమయంలో తాను చేసిన తప్పులకు ఆయన సారీ చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్‌టీవీ లైవ్‌ డిబేట్‌లో పాల్గొన్న ఆయన తాను రెండు పదాలు తప్పుగా ఉపయోగించాను, అందుకు తప్పే అన్నారు. అయితే తాను ఉపయోగించిన పదాలు ఎవరిని ఉద్దేశించి అనలేదని, జనరల్‌గా పాట పాడాను అని తెలిపారు. తాను ఎవరిని అన్నానో చెబితే వారికి సారీ చెబుతానని మొదట మొరాయించిన చంద్రహాస్‌ తర్వాత క్షమాపణ చెప్పాడు.

ఈ క్రమంలో ఆయన పలు ప్రశ్నలను లేవనెత్తాడు. తాను కేవలం ఈవెంట్‌లో సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే అవి వాడాను, దానికి ఇంత పెద్ద రచ్చ చేస్తున్నారు, ట్రోల్‌ చేస్తున్నారు. కానీ ఇతర సినిమాల్లో, పెద్ద పెద్ద సినిమాలో దారుణమైన వల్గర్‌ పదాలు వాడుతున్నారు. కానీ వాటిని ఎందుకు ప్రశ్నించడం లేదు, వాటి విషయంలో ఎందుకు వివాదం చేయడం లేదంటూ ప్రశ్నించాడు చంద్రహాస్‌.

జేడీ చక్రవర్తి క్షమాపణ.. చంద్రహాస్ కౌంటర్!

అంతేకాదు మా ఈవెంట్‌కి వచ్చి సపోర్ట్ చేసిన జేడీ చక్రవర్తి గారు కూడా మొదట మమ్మల్ని అభినందించి, ఆ తర్వాత సారీ అంటూ వీడియో విడుదల చేశారు. తప్పు అని తెలిసినప్పుడు అప్పుడే ఇది తప్పు అని చెప్పాల్సింది. కానీ ఆ సమయంలో క్లాప్స్ కొట్టి, ప్రమోషన్స్ విషయంలో బాగా చేస్తున్నారని, సినిమా జనాల్లోకి బాగా వెళ్తుందని ఆ టైమ్‌లో చెప్పి, ఆ తర్వాత మా నాన్నకి సందేశం పంపించి అభినందించాడు. కానీ రిగ్రెట్‌ ఫీలవుతున్నట్టు, అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందని వీడియో విడుదల చేయడం ఎంత వరకు కరెక్ట్. ఆయనది డబుల్‌ ఫేస్‌. అప్పుడు ఒకలా, ఆ తర్వాత మరోలా ఎలా ప్రవర్తిస్తారు, ఎందుకీ డబుల్‌ గేమ్‌ అంటూ ప్రశ్నించాడు చంద్రహాస్‌. మొత్తంగా జేడీ చక్రవర్తిని తన వివాదంలో గట్టిగా ఇరికించాడు చంద్రహాస్‌. తనపై ఇప్పటికే నెగటివిటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు లైవ్‌లో ఇలాంటి కామెంట్స్ తో మరింత నెగటివిటీ మూటగట్టుకుంటున్నాడు. ఇది ఆయన సినిమాపై గట్టి ప్రభావం చూపించబోతుంది.

చంద్రహాస్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.