|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉత్తరాంధ్ర ఖనిజ సంపదకు చంద్రబాబు భరోసా! పోలవరం నీటితో పారిశ్రామిక విప్లవం!

Published: 23-03-2026, 11:35 AM
ఉత్తరాంధ్ర ఖనిజ సంపదకు చంద్రబాబు భరోసా! పోలవరం నీటితో పారిశ్రామిక విప్లవం!
  • ఉత్తరాంధ్ర రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా అభివృద్ధి చెందుతుంది.
  • పరిశ్రమలకు పోలవరం నీటిని అందిస్తామని చంద్రబాబు హామీ.
  • ఆర్సెలార్ మిత్తల్-నిప్పన్ స్టీల్ పరిశ్రమ ద్వారా లక్ష ఉద్యోగాలు.
  • ఏపీ పెట్టుబడులకు అనుకూలమని చంద్రబాబు ప్రకటన.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రను రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, పరిశ్రమలకు పోలవరం నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్సెలార్ మిత్తల్-నిప్పన్ స్టీల్ పరిశ్రమ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ హబ్ ఏర్పాటు

అర్సెలార్ మిత్తల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిత్తల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును సాకారం చేసి చూపించామన్నారు.

ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని గుర్తుచేశారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు సాకారం కావటంలో కృషి చేసిన ఆదిత్య మిత్తల్, మంత్రి నారాలోకేష్‌ను అభినందించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందన్నారు.

‘అనకాపల్లిలో కేవలం స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే కాదు..స్టీల్ సిటీకి శంకుస్థాపన జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ తో పాటు 11,198కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతుంది. 2028 నాటికి ప్లాంట్‌లో మొదటి దశ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ ఉంటుంది. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్సెన్, డిసెంబరు నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేస్తారు. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారి కూడా పూర్తి అవుతుంది.’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.

పరిశ్రమలకు పోలవరం జలాల వాగ్దానం

పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ కూడా వేయబోతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉక్కు ఉత్పత్తి ఒక్కటే కాదు ఆర్థిక లావాదేవీలతో విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయన్నారు. ఇంత వేగంగా పరిశ్రమకు భూసేకరణ, అనుమతులు ఇచ్చింది దేశంలో ఒక్క ఏపీలోనేని చంద్రబాబు అన్నారు. దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం, రాష్ట్రం ఉందని, నిపుణులు, మానవ వనరులు ఏపీకి మాత్రమే సొంతమని అన్నారు.

‘ టూరిజం నుంచి డేడా సెంటర్ వరకూ, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకూ అన్నింటికీ ఏపీలో మెండైన అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలతో వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అందరికీ పిలుపునిస్తున్నాను. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే నినాదాన్ని విజయవంతం చేస్తాం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావటం దేశంలో ఇదే తొలిసారి. బీపీసీఎల్ సహా పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి.’ అని చంద్రబాబు అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లో రాష్ట్రానికి 20.35 లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ నాలెడ్జి ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ సెంటర్లు ఇలా కీలకమైన కేంద్రంగా విశాఖ మారుతుందన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయని చెప్పారు.

లక్ష ఉద్యోగాల ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్

రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారుతుందని, పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ద్వారా అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్తగా పోర్టులు, ఎయిర్ పోర్టులు వస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తామని తెలిపారు.

ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకునేందుకు సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం. ఈ పరిశ్రమ నిర్మాణంలో రైతులు తమ భూములను త్యాగం చేశారని, వారికి సహకారం అందించాలని కోరారు. ఉక్కు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మొదటిగా అనకాపల్లి జిల్లా యువతకు ఈ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆవిష్కరణల కోసం ఈ మెటలర్జీ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమని నొక్కి చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.