|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఖాతా నంబర్ మారకుండానే బ్యాంక్ ఛేంజ్! ఆర్బీఐ సంచలన నిర్ణయం!

Published: 04-04-2026, 11:05 PM
ఖాతా నంబర్ మారకుండానే బ్యాంక్ ఛేంజ్! ఆర్బీఐ సంచలన నిర్ణయం!
  • ఖాతా నంబర్ మారకుండానే బ్యాంక్ మారే వెసులుబాటు
  • ఈఎంఐలు, సిప్‌లు కొత్త బ్యాంకుకు ఆటోమేటిక్‌గా బదిలీ
  • బ్యాంకింగ్ సేవలు నచ్చకుంటే పోర్టబిలిటీ చేసుకునే అవకాశం
  • కొత్త బ్యాంకుకు మారే విషయం పాత బ్యాంకుకు చెప్పనవసరం లేదు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇకపై వినియోగదారులు తమ ఖాతా నంబర్‌ను మార్చకుండానే బ్యాంకులను మార్చుకునే అవకాశం కల్పించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్‌బీఐ నూతన సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం

దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతి పెద్ద సంస్కరణకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు తమ బ్యాంకు ఖాతా నంబర్‌ను మార్చకుండానే బ్యాంకులు మారడానికి అనుమతించే కీలక మార్పులపై పనిచేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే బ్యాంకు ఖాతాను సిమ్ కార్డు తరహాలో ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు అదే ఖాతా నెంబరు‌తో తేలిగ్గా మారే అవకాశం లభిస్తుంది. ‘పేమెంట్స్ విజన్ 2028’ పేరుతో ఆర్‌బీఐ చేపడుతున్న ఈ సంస్కరణ ద్వారా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ మాదిరిగానే వినియోగదారులు త్వరలో తమ బ్యాంక్ ఖాతాలను పోర్ట్ చేసుకోవచ్చు.

అయితే ఈ కొత్త విధానం గురించి ఆర్‌బీఐ ప్రకటనతో అనేక సందేహాలు వ్యక్తం అవుతుండగా.. వాటి గురించి తెలుసుకుందాం. బ్యాంకు ఖాతాను పోర్టబిలిటీ చేసుకున్నప్పటికీ ఆ అకౌంట్‌తో సంబంధం ఉన్న చెల్లింపులు, ఈఎంఐలు, సిప్‌లు, బిల్లుల చెల్లింపులు కొత్తగా మారిన బ్యాంకు నుంచి యథాతథంగా చేయవచ్చు. దీనివల్ల బ్యాంకింగ్‌ రంగంలో ఖాతాదారుల సేవలు మెరుగుపడటంతో పాటు బ్యాంకుల మధ్య పోటీ వాతావరణం పెరుగుతుందని ఆర్‌బీఐ ఆశిస్తోంది.

ప్రస్తుతం బ్యాంక్ ఖాతాను మార్చడం చాలా కష్టమైన ప్రక్రియ. కస్టమర్లు తమ కొత్త అకౌంట్ నంబర్‌ను శాలరీ, పెట్టుబడులు, సబ్‌స్క్రిప్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ కొత్త బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ ఈ సమస్యను తొలగిస్తుంది. దీనివల్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒక యూనివర్శల్ ఫైనాన్షియల్ ఐడెంటిటీ గా పనిచేస్తుంది. ఒకే బ్యాంకుకు పరిమితమై ఉండదు. అకౌంట్ నెంబర్ మార్చకుండానే మరొక బ్యాంకుకు మారవచ్చు. కొత్త బ్యాంకు ప్రస్తుత అకౌంట్ నంబర్‌ను తమ సిస్టమ్‌లో యాక్టివేట్ చేస్తుంది.

* ఆర్‌బీఐ సంస్కరణ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి బ్యాంకింగ్ సేవలు నచ్చకుంటే పోర్టబిలిటీ చేసుకోవడం. ఏదైనా బ్యాంకు అధిక రుసుములు వసూలు చేస్తున్నా, తక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నా, సరైన డిజిటల్ సేవలందించకున్నా, వినియోగదారులు సాధారణ సమస్యల గురించి ఆందోళన చెందకుండా త్వరగా మారవచ్చు.

* అన్ని ఈఎంఐలు, సిప్‌లు, బిల్లు చెల్లింపులు అటోమెటిక్‌గా కొత్త బ్యాంకుకు బదిలీ అవుతాయి.

* కొత్త బ్యాంకుకు మారే విషయం పాత బ్యాంకుకు చెప్పాల్సిన అవసరం లేదు.

ఖాతా పోర్టబిలిటీతో కలిగే ప్రయోజనాలు

* మనం చేయాల్సిన చెల్లింపులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. దీని కోసం కేంద్రీకృత మౌలిక సదుపాయాన్ని ఆర్‌బీఐ తీసుకురానుంది. దీన్ని పేమెంట్స్ స్విచింగ్ సర్వీస్ (పాస్)గా పరిగణిస్తారు.

* ఆర్‌బీఐ పేమెంట్స్ స్విచింగ్ సర్వీస్ (పాస్) విధానంపై పనిచేస్తోంది. ఇది అన్ని రకాల చెల్లింపులను నిర్వహించే సెంట్రలైజ్‌డ్ ప్లాట్‌ఫామ్ ఇది.

* అన్ని ఆటో-డెబిట్‌లను సెంట్రల్‌గా నిల్వ చేస్తారు.

* బ్యాంకులు మారినప్పుడు, చెల్లింపులు ఆటోమెటిక్‌గా రీ-రూట్ అవుతాయి. ఇది మాన్యువల్ అప్‌డేట్‌ల అవసరాన్ని తొలగిస్తుంది. సులభంగా ఆర్థిక మార్పులకు సహాయపడుతుంది. ప్రతిసారీ అకౌంట్ వివరాల అప్‌డేట్‌కు చెక్ బ్యాంకులు మారిన ప్రతి ఒక్కరికి మరో అతిపెద్ద సమస్య అన్ని చోట్ల అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేసే పని. ఈ కొత్త వ్యవస్థ దీన్ని పూర్తిగా తొలగిస్తుంది.

* శాలరీ అకౌంట్స్ వివరాలను ప్రతిసారి హెచ్‌ఆర్ డీపార్ట్‌మెంట్‌కు తెలియజేసే పని తప్పుతుంది.

* ప్రభుత్వ పథకాలైన ఎల్‌పీజీ లాంటి సబ్సిడీలు లేదా పీఎం-కిసాన్ వంటి పథకాల ప్రయోజనాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయి.

కొత్త విధానం అమలులోకి వచ్చేది ఎప్పుడు?

* కేవైసీ వివరాల కోసం కొత్త బ్యాంకులో ఫామ్స్ నింపడం, డాక్యుమెంట్లు ఇచ్చే సమస్యలుండవు.

* అకౌంట్ నెంబర్ మారకపోయినా ఈ పోర్టబిలిటీ వల్ల కొన్ని వివరాలు మారుతాయి.

* ఐఎఫ్ఎస్ఈ కోడ్: ఇది బ్యాంకు బ్రాంచుకు సంబంధించి కాబట్టి, అకౌంట్ మారకపోయినా ఐఎఫ్ఎస్ఈ కోడ్ మారే అవకాశం ఉంటుంది.

* బ్యాంకు మారితే లోన్స్ కొత్త బ్యాంకుకు బదిలీ అవుతాయి.

* క్రెడిట్ హిస్టరీ యథాతథంగా ఉంటుంది.

ఆర్‌బీఐ తీసుకురానున్న ఈ సంస్కరణలు బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరగనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.