|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chandreshwara: జూన్ 27న మరో మహాశివుని చిత్రం విడుదల

Published: 25-06-2025, 9:14 AM
Chandreshwara: జూన్ 27న మరో మహాశివుని చిత్రం విడుదల

జూన్ 27న ‘కన్నప్ప’ సినిమాతో పాటు మరో శివుడు ఆధారిత చిత్రం ‘చంద్రేశ్వర’ విడుదలవుతోంది. ఆర్కియాలజీ, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్‌తో కూడిన ఈ చిత్రం సురేష్ రవి, ఆశా వెంకటేష్ నటనతో అలరించనుంది.

Key Points

1

జూన్ 27న 'చంద్రేశ్వర' సినిమా గ్రాండ్‌గా విడుదల

2

ఆర్కియాలజీ, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్‌తో కూడిన కథాంశం

4

'కన్నప్ప' సినిమాతో పోటీగా విడుదల

చంద్రేశ్వర విడుదల తేదీ

ఈ నెల 27న కన్నప్ప రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు మరో శివుడు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మరో చిత్రం కూడా రిలీజ్‌ కానుంది. అదే ‘చంద్రేశ్వర’. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్‌లైన్. ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వం వహించగా, సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై  డాక్టర్ రవీంద్ర చారి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి స్పందన లభించింది. జూన్‌ 27న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది.

ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ..  ఈ వారంలో రెండు భక్తి సినిమాలు ఒకటి ‘కన్నప్ప’, రెండు ‘చంద్రేశ్వర’ పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు. చివరి నిమిషం వరకు ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎటువంటి అశ్లీలత ఇందులో ఉండదు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు తరలివచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.

కథాంశం మరియు నటీనటులు

పోటీ సినిమాల విడుదల

చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా ఉండే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే అంచనాలతో విడుదలవుతోంది. ‘కన్నప్ప’తో పోటీలో నిలవడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.