|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంచు విష్ణు కన్నప్పకు పోటీగా మరో భక్తి చిత్రం.. మహాశివుడు బ్యాక్‌డ్రాప్‌లో చంద్రేశ్వర.. ఇలాంటి సినిమా రాలేదన్న నిర్మాత

Published: 25-06-2025, 9:47 PM
మంచు విష్ణు కన్నప్పకు పోటీగా మరో భక్తి చిత్రం.. మహాశివుడు బ్యాక్‌డ్రాప్‌లో చంద్రేశ్వర.. ఇలాంటి సినిమా రాలేదన్న నిర్మాత

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న విడుదలవుతున్న నేపథ్యంలో, అదే రోజు మరో భక్తి చిత్రం ‘చంద్రేశ్వర’ కూడా విడుదలవుతోంది. మహాశివుడిని కేంద్రంగా తీసుకున్న ఈ సినిమా ఆర్కియాలజీ నేపథ్యంలో రూపొందింది.

Key Points

1

మంచు విష్ణు 'కన్నప్ప'కు పోటీగా 'చంద్రేశ్వర' విడుదల.

2

మహాశివుడిని కేంద్రంగా తీసుకున్న భక్తి చిత్రం 'చంద్రేశ్వర'.

4

సినిమా పాటలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

‘కన్నప్ప’కు పోటీగా ‘చంద్రేశ్వర’

మంచు విష్ణు కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. ప్రభాస్ , మోహన్ లాల్, అక్షయ్ కుమార్ , శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి స్టార్స్ నటించిన కన్నప్ప మూవీ జూన్ 27న అంటే రేపే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్పకు పోటీగా మరో మహాశివుడి భక్తి చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

జూన్ 27న మరో శివుని చిత్రం విడుదల కానుంది. ‘ కన్నప్ప ’తో పాటు మహాశివుడి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘చంద్రేశ్వర’. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్‌లైన్. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించారు. సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా చేశారు.

చంద్రేశ్వర సినిమాకు జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వం వహించారు. ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా ‘చంద్రేశ్వర’ మూవీని తెరకెక్కించారు . ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. జూన్ 27న కన్నప్పకు పోటీగా చంద్రేశ్వర మూవీ గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆర్కియాలజీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్

ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ.. ” శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు ‘చంద్రేశ్వర’ మూవీతో నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాను. ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషన్స్‌తో కూడిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది” అని అన్నారు.

“ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీనవ విధానం ఎలా ఉండేది? అనే అంశాలు ఆకట్టుకుంటాయి. ఆర్కియాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని గర్వంగా చెప్పగలం” అని నిర్మాత రవీంద్ర చారి పేర్కొన్నారు.

“ఈ సినిమాకు సంగీతం ప్రధాన హైలెట్‌గా ఉంటుంది. ఇందులో సాంగ్స్ అన్నీ అత్యద్భుతంగా వచ్చాయి. ‘ఈశ్వరా.. నా పరమేశ్వరా’, ‘అఖిల అఖిల’ డ్యూయెట్ సాంగ్, ‘నమస్తే చిదంబరం’ అనే సాంగ్.. ఇలా పాటలన్నీ వండర్‌ఫుల్‌గా వచ్చాయి. ప్రస్తుతం ఈ పాటలు ట్రెండ్ అవుతున్నాయి” అని ప్రొడ్యూసర్ రవీంద్ర చారి తెలిపారు.

సినిమా పాటలపై అంచనాలు

“సినిమా కూడా సస్పెన్స్‌, హారర్ అంశాలతో అత్యద్భుతంగా వచ్చింది. ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ వారంలో రెండు భక్తి సినిమాలు ఒకటి ‘కన్నప్ప’, రెండు ‘చంద్రేశ్వర’ పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము” అని నిర్మాత కోరారు.

“దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు. చివరి నిమిషం వరకు ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎటువంటి అశ్లీలత ఇందులో ఉండదు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు తరలివచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని నిర్మాత రవీంద్ర చారి చెప్పారు.

జూన్ 27న విడుదలవుతున్న ఈ రెండు భక్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ‘చంద్రేశ్వర’ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.