|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చరణ్ ‘పెద్ది’ విడుదల వాయిదా? అభిమానుల్లో ఆందోళన! అసలు కారణాలివేనా?

Published: 26-03-2026, 12:35 PM
చరణ్ 'పెద్ది' విడుదల వాయిదా? అభిమానుల్లో ఆందోళన! అసలు కారణాలివేనా?
  • ఏప్రిల్ 30న విడుదల కావల్సిన ‘పెద్ది’ సినిమా వాయిదా పడే సూచనలు.
  • అడ్వాన్స్ బుకింగ్స్ పోస్ట్ పోన్ కావడంతో అనుమానాలు.
  • చరణ్ గాయం, స్పెషల్ సాంగ్ షూటింగ్ ఆలస్యం వాయిదాకు కారణాలుగా ఊహాగానాలు.
  • ఏప్రిల్ 30న ‘గాయపడ్డ సింహం’ విడుదలయ్యే అవకాశం.

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణాలు ఏమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

ఏప్రిల్ 30న ‘పెద్ది’ రావడం కష్టమేనా?

Peddi  : వస్తామంటూ హడావిడి చేయడం ..తీరా రాలేమంటూ వెనక్కి వెళ్ళిపోవడం ఇండస్ట్రీలోకామన్ అయిపొయింది. తాజాగా పెద్ది కూడా ఇపుడు ఇదే డైలమాలో ఉన్నట్టు కనిపిస్తుంది.అవును..చరణ్ , బుచ్చి కాంబోలో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయ్ కాని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తలే ఫ్యాన్స్ గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తున్నాయ్.ఎన్ని వార్తలు వచ్చినా మేకర్స్ ఏప్రిల్ 30న వచ్చేది పక్కా అని క్లారిటీ ఇస్తున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా ఉందన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయ్.

వాస్తవానికి ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అనుకుంటే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రేపటినుండే షురూ కావాలి.కాని ఉన్నపళంగా వీటిని ఏప్రిల్ 8 కి పోస్ట్ పోన్ చేయడంతో సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తారా అన్న అనుమానాలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.,మేకర్స్ ఎంత కవరప్ చేసినా ఇన్ సైడ్ ఎదో జరిగిపోతుందన్నటాక్ ఫ్యాన్స్ కి నిద్ర పట్టనీయడం లేదు.

సినిమా పోస్ట్ పోన్ కావడానికి కారణాలివేనా?

వాస్తవానికి సినిమా ఇపుడు పోస్ట్ పోన్ అవ్వడానికి రెండు రీజన్స్ వినిపిస్తున్నాయ్.ఈమధ్యే చరణ్ కంటికి గాయం అవడం,దానివల్ల షూటింగ్ కి బ్రేక్ పడటం అందులో ఒకటి.ఇక ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందని అందుకోసం మృణాల్ ఠాకూర్ స్టెప్పులు వేయబోతుందని టాక్ వినిపిస్తున్నా ఇంకా ఎలాంటి అనౌన్స్ ఇప్పటి వరకు లేదు. అయితే బుచ్చి ఈ సాంగ్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయడంతో ఇది మరింత లేట్ అవడానికి కారణం అన్న టాక్ వినిపిస్తుంది.

చరణ్ గ్యాప్ ఫిల్ చేస్తున్నాడా?

మరో వైపు చరణ్ గనుక తన పెద్ది ని రేసు నుంచి తప్పిస్తే అదే ఏప్రిల్ ౩౦న ఎటాక్ చేసేందుకు గాయపడ్డ సింహాన్ని రెడీ గా పెట్టేసింది మూవీ టీమ్. ఇప్పటికే మే 1 రిలీజ్ అంటూ ప్రోమోలు రెడీ అయిపోతున్నాయ్ కూడా.మరో వైపు అయ్యగారు లెనిన్ కూడా అదే డేట్ కి వస్తే ఎలా ఉంటుందన్న లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా చరణ్ గచ్చి బౌలి షూట్ లో పాల్గొంటున్నాడన్న  టాక్ వచ్చేసింది. అంటే వచ్చిన గ్యాప్ ని ఇలా చక చక ఫిల్  చేసి అనుకున్న సమయానికి వదులుతాడా ఏంటి అన్న డిస్కషన్ కూడా మొదలైంది. ఏది ఏమైనా అనుకున్న డేట్ కి సినిమాని తీసుకురావడం ఇపుడు పెద్దికి  పెద్ద పరీక్షలాగే ఉంది.డేట్ మిస్ అయితే మాత్రం నెట్టింట చెడుగుడు మాములుగా ఉండదు . చూడాలి మరి ఈ రిలీజ్ టెన్షన్ నుండి పెద్ది ఎప్పుడు రిలాక్స్ అవుతాడో !

‘పెద్ది’ అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ విడుదల వాయిదా పడితే అభిమానుల నిరాశకు అవధులు ఉండవు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.