|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చరణ్‌ సేఫ్‌.. మహేష్‌, బన్నీ, ఎన్టీఆర్‌లకు ఊహించని దెబ్బ, ఇండియా నెంబర్‌ వన్‌ స్టార్‌ అతనే

Published: 21-05-2025, 9:26 AM
చరణ్‌ సేఫ్‌.. మహేష్‌, బన్నీ, ఎన్టీఆర్‌లకు ఊహించని దెబ్బ, ఇండియా నెంబర్‌ వన్‌ స్టార్‌ అతనే

ఓర్మాక్స్ మీడియా ఇండియా వైడ్‌గా ప్రజాదరణ పొందిన టాప్ 10 స్టార్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచాడు. రామ్ చరణ్ స్థానం మెరుగైంది, కానీ మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు గట్టి దెబ్బ పడింది.

Key Points

1

ఓర్మాక్స్ మీడియా ప్రకారం, ప్రభాస్ ఇండియా నెంబర్ వన్ స్టార్.

2

రామ్ చరణ్ స్థానం మెరుగైంది, మహేష్, బన్నీ, ఎన్టీఆర్ ల స్థానాలు తగ్గాయి.

4

తెలుగు హీరోలలో ప్రభాస్ తర్వాత చరణ్ సేఫ్ లో ఉన్నాడు.

ఓర్మాక్స్ మీడియా టాప్ 10 జాబితా

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల  ఇండియా వైడ్‌గా ఏ స్టార్‌ హీరో క్రేజ్‌ ఎలా ఉంది? ఏ హీరో గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. వారి సినిమాల సందడి ఎలా ఉంది? ఇలా అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని టాప్‌ 10 ఇండియన్‌ మోస్ట్ పాపులర్‌ స్టార్స్ జాబితాని విడుదల చేస్తుంది.

ఓర్మాక్స్ మీడియా తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన జాబితాని విడుదల చేసింది. ఇండియాలో మోస్ట్ పాపులర్‌ టాప్‌ 10 స్టార్ హీరోల లిస్ట్ ని ప్రకటించింది. ఇందులో  రామ్‌ చరణ్‌ సేఫ్‌లో ఉన్నారు. కానీ మహేష్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లకు గట్టి దెబ్బ పడింది. వీరు తమ గత నెలస్థానాలను కోల్పోయారు.

ప్రభాస్ నెంబర్ వన్ స్థానం

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ ఇండియన్ స్టార్స్ లో నెంబర్‌ వన్‌ స్థానంలో ప్రభాస్‌ నిలిచారు. గత కొన్ని నెలలుగా ఆయన అదే స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాలు మారుతున్నాయి కానీ, ఆయన్ని టచ్‌ చేసే వాళ్లే లేరు. ఆ మధ్య బన్నీ రెండో స్థానానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన డౌన్‌ అయ్యారు. మార్చిలో మూడో స్థానంలో ఉన్న బన్నీ, ఏప్రిల్‌లో నాల్గో స్థానానికి పడిపోయారు.

ఇక మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌లకు కూడా గట్టి దెబ్బ పడింది. మార్చిలో ఐదో స్థానంలో ఉన్న మహేష్‌ బాబు, ఏప్రిల్‌లో ఆరో స్థానానికి పడిపోయారు. మార్చిలో ఏడో స్థానంలో ఉన్న తారక్‌ ఇప్పుడు ఏప్రిల్‌లో పదో స్థానానికి పడిపోవడం గమనార్హం.

తెలుగు హీరోల స్థితి

ఇందులో సేఫ్‌గా ఉన్నది ఎవరు అంటే రామ్‌ చరణ్‌. మార్చిలో ఆయన ఎనిమిదో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఏడో స్థానానికి ఎగబాకారు. తెలుగు హీరోల్లో ప్రభాస్‌ తర్వాత సేఫ్‌లో ఉన్నది చరణ్‌ అనే చెప్పాలి.

ఇక మిగిలిన హీరోల విషయానికి వస్తే రెండో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నిలిచారు. మూడో స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ నిలవడం విశేషం. ఐదో స్థానంలో అజిత్‌, ఎనిమిదో స్థానంలో సల్మాన్‌ ఖాన్‌, తొమ్మిదో స్థానంలో అక్షయ్‌ కుమార్‌ నిలవడం విశేషం. కోలీవుడ్‌ నుంచి ఇద్దరు, బాలీవుడ్‌ నుంచి ముగ్గురు ఈ టాప్‌ 10 ఇండియా మోస్ట్ పాపులర్‌ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించారు. తెలుగు నుంచి ఐదుగురు హీరోలు నిలవడం విశేషం.

చివరగా, ఓర్మాక్స్ మీడియా జాబితా ప్రకారం ప్రభాస్ అగ్రస్థానంలో కొనసాగుతూ, రామ్ చరణ్ సేఫ్ గా ఉన్నాడు. మహేష్, బన్నీ, ఎన్టీఆర్ లకు మాత్రం ఈ నెల స్థానాలు తగ్గాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.