
📌 Key Points
- చర్లపల్లి – షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌కు బస్తా రైల్వే స్టేషన్‌లో కొత్త స్టాప్
- మార్చి 17 నుండి బస్తాలో రైలు ఆగనుంది
- రైలు నంబర్ 18046/45 బస్తా స్టేషన్‌లో ఆగుతుంది
- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త! చర్లపల్లి-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ ఇకపై ఒడిశాలోని బస్తా రైల్వే స్టేషన్‌లో కూడా ఆగుతుంది. ఈ మార్పు మార్చి 17 నుండి అమలులోకి వస్తుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
చర్లపల్లి-షాలిమార్ రైలుకు కొత్త స్టాప్ ఎక్కడ?
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి – షాలిమార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు కొత్తగా మరో స్టాపేజీ ఉండనుంది. ఇకపై ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఉన్న బస్తా రైల్వే స్టేషన్ లో కూడా ఆగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
చర్లప్లలి – షాలిమార్ – చర్లపల్లి మధ్య నడిచే ( ట్రైన్ నెంబర్18046/45) ట్రైన్ బస్తా రైల్వే స్టేషన్ లో ఆగనుంది. ఈ నిర్ణయం మార్చి 17వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. చర్లపల్లి నుంచి బయల్దేరే ఈ రైలు ఉదయం 08:40 గంటలకు ప్రారంభమై…. మరుసటి రోజు మధ్యాహ్నం 15:35 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.
బస్తా రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఎప్పటి నుండి?
ఈ ట్రైన్ కాజీపేట, వరంగల్, విజయవాడ , రాజమండ్రి, విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్ పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా… ఈ ట్రైన్ ఇకపై ఒడిశాలోని బస్తా రైల్వే స్టేషన్ లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
తాజా నిర్ణయం ప్రకారం…. చర్లపల్లి – షాలిమార్ మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 18046) ఉదయం 9.36 నిమిషాలకు బస్తా రైల్వే స్టేషన్ కు చేరుకొని… ఉదయం 9.37 నిమిషాలకు బయల్దేరుతుంది. ఇక షాలిమార్ – చర్లపల్లి మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 18045) ట్రైన్…. మధ్యాహ్నం 2.36 నిమిషాలకు బస్తా రైల్వే స్టేషన్ కు చేరుకుని… 2.37 నిమిషాలకు బయల్దేరుతుంది.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ నిర్ణయం
ప్రయోగత్మకంగా ఈ స్టాపేజీ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నిర్ణయం అమలు తర్వాత…. మరిన్ని వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది.
ఈ నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. బస్తా రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల ఒడిశా ప్రాంత ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.


