
అక్కినేని నాగ చైతన్య తాజాగా హైదరాబాద్ వీధుల్లో తన రెడ్ కారులో షికార్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు. దీపావళి మూడ్‌లో సరదాగా బయటికి వచ్చిన చైతూ, అభిమానితో ముచ్చటించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది.
Key Points
నాగ చైతన్య హైదరాబాద్ వీధుల్లో తన ఎరుపు రంగు కారులో షికారు చేశారు.
దీపావళి మూడ్‌లో సరదాగా డ్రైవింగ్ చేస్తూ కనిపించారు.
కారులో వెళ్తూ అభిమానితో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
“తండేల్” విజయం తర్వాత శోభితా ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నారు.
హైదరాబాద్‌లో చైతూ కారు షికారు
దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలోనే తండేల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు నాగచైతన్య. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వీధుల్లో కారులో చెక్కర్లు కొడుతూ కనిపించారు నాగచైతన్య. కార్లు విపరీతంగా కొనుగోలు చేసే నాగచైతన్య, తనకు ఇష్టమైన రెడ్ కారులో హైదరాబాద్ లో తానే డ్రైవింగ్ చేస్తూ తెగ తిరిగేసారు.
దీపావళి మూడులో ఉన్న నాగచైతన్య, అలా సరదాగా బయటికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కారులో వెళ్తున్న నాగ చైతన్యను చూసి, ఓ మహిళ ఆశ్చర్యానికి గురైంది. దీంతో ఆమె దగ్గర కారు ఆపి, కాసేపు ముచ్చటించాడు నాగ చైతన్య. ఈ వీడియోలో ఆ సంఘటన హైలెట్ గా నిలిచింది. సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య, ఇటీవల కాలంలోనే శోభితాను రెండో పెళ్లి చేసుకున్నాడు. క్లిక్
అభిమానితో ముచ్చట్లు.. వీడియో వైరల్
తండేల్ విజయం, వ్యక్తిగత జీవితం
హైదరాబాద్ వీధుల్లో నాగ చైతన్య కారులో షికారు చేస్తూ అభిమానితో ముచ్చటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తండేల్ విజయంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


