|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డర్టీ పీఆర్‌ గేమ్‌, ఇదేం ఫెమినిజం.. దీపికా పదుకొణెపై విరుచుపడ్డ సందీప్‌ రెడ్డి వంగా ?

Published: 27-05-2025, 12:11 AM
డర్టీ పీఆర్‌ గేమ్‌, ఇదేం ఫెమినిజం.. దీపికా పదుకొణెపై విరుచుపడ్డ సందీప్‌ రెడ్డి వంగా ?

ప్రభాస్ నటించే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకున్న సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయంపై సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలిపారు.

Key Points

1

సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ నుండి దీపికా పదుకొణె తప్పుకుంది.

2

మూవీలోని బోల్డ్ సీన్లు, రూల్స్ కారణంగా దీపికా తప్పుకుందని వార్తలు.

4

సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ లో 'డర్టీ పీఆర్ గేమ్స్' అంటూ ఘాటుగా స్పందించారు.

‘స్పిరిట్’ నుండి దీపికా ఎందుకు తప్పుకుంది?

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సినిమాలు ఎంత బోల్డ్ గా ఉంటాయో, ఆయన కూడా అంతే బోల్డ్. `అర్జున్‌ రెడ్డి` సినిమా సమయంలో ఆయన టేకింగ్‌, బోల్డ్ సీన్లపై విమర్శలు వచ్చాయి. వాటికి అంతే ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు. ఇటీవల `యానిమల్‌` సినిమా విషయంలోనూ అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ అప్పుడు కూడా తగ్గలేదు. దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయన రెచ్చిపోయారు. అయితే ఈ సారి స్టార్‌ హీరోయిన్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా `స్పిరిట్‌` అనే సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్‌ ఎంపిక జరుగుతుంది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెని ఎంపిక చేశారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుంది. అయితే సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయని, ఆ విషయంలో దీపికా అభ్యంతరం తెలిపిందని సమాచారం. అంతేకాదు కొన్ని రూల్స్ కూడా పెట్టిందట. ఈ నేపథ్యంలో ఇద్దరికి సెట్‌ కాలేదని, దీంతో ఈ మూవీ నుంచి దీపికా తప్పుకుందని సమాచారం. ఆమె స్థానంలో `యానిమల్‌` నటి త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా ఎంచుకున్నారు సందీప్‌.

సందీప్ రెడ్డి వంగా ట్వీట్ వైరల్

అదే సమయంలో దీపికా పదుకొనె.. అల్లు అర్జున్‌-అట్లీ మూవీకి ఓకే చెప్పిందని సమాచారం. ఈ క్రమంలో `స్పిరిట్‌` మూవీ స్టోరీ లీక్‌ అయ్యింది. అంతేకాదు బాలీవుడ్‌లో మీడియాలో సందీప్‌ రెడ్డి వంగాకి వ్యతిరేకంగా కథనాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇదంతా దీపికా పీఆర్‌ టీమ్‌ చేస్తున్న పనే అని భావించారు సందీప్‌. దీంతో తాజాగా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఓ రకంగా వారిపై ఆయన విరుచుకుపడ్డారు.

ఈ మేరకు సందీప్‌ రెడ్డి ట్విట్టర్‌(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఆయన చెబుతూ, తాను ఒక ఆర్టిస్ట్ కి కథ చెప్పానంటే అది పూర్తి నమ్మకంతోనే చేస్తాను. కానీ ఆ కథను బయటపెట్టడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటి చెప్పారు. నా కథని బహిర్గతం చేయడమే కాకుండా ఒక యంగ్‌ యాక్టర్‌ని కూడా తక్కువ చేశారు. ఇదేనా మీ ఫెమినిజం?. ఒక సినిమా కోసం ఏళ్లుగా కష్టపడతాం. ఫిల్మ్ మేకింగే నాకు అన్నీ. అది ఆ వ్యక్తికి అర్థం కాదు. అర్థం చేసుకోలేరు, ఎప్పటికీ అర్థం కాదు` అంటూ ఫైర్‌ అయ్యారు సందీప్‌ రెడ్డి వంగా. తన దైన స్టయిల్‌లో హిందీలో డైలాగ్‌ని పంచుకున్నారు. అంతేకాదు `డర్టీపీఆర్ గేమ్స్` అంటూ యాష్‌ ట్యాగ్‌ని కూడా మెన్షన్‌ చేశారు.

డర్టీ పీఆర్ గేమ్స్ ఆరోపణలు

అయితే ఇందులో ఆయన దీపికా పదుకొణె పేరుని ఎక్కడా మెన్షన్‌ చేయలేదు. కానీ జరిగిన పరిణామాలు చూస్తుంటే అది దీపికా పీఆర్‌ టీమ్‌నే అని అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు సందీప్‌ కామెంట్లు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై దీపికా పీఆర్‌ టీమ్‌ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రభాస్‌ హీరోగా రూపొందే `స్పిరిట్‌` చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందట. ఈ మూవీ అంతర్జాతీయ  మాఫియా నేపథ్యంలో ఉంటుందని సమాచారం.

దీపికా పదుకొణె, సందీప్ రెడ్డి వంగాల మధ్య వివాదం సినీ ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచుతోంది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.